Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
వ్యాయామంతో లేకుండా బెల్లీ ఫ్యాట్ కరిగించే సులభ మార్గాలు
ప్రస్తుతం పెళ్లైన పిల్లలు పుట్టిన వాళ్లకు మాత్రమే కాదు.. చిన్న వయసులోనే బెల్లీ ఫ్యాట్ సమస్య మొదలవుతోంది. ఉద్యోగాలు, కూర్చున్న చోట నుంచి కదలలేని పని ఒత్తిడి, వ్యాయామానికి సమయం కుదరక పోవడం, అన్ హెల్తీ ఫుడ్స్.. ఇలా ఒకటేమిటి చాలా కారణాల వల్ల చిన్న వయసులోనే బెల్లీ ఫ్యాట్ తో విసిగిపోతున్నారు. బొజ్జ పెరగడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే వ్యాయామం అవసరం లేకుండానే.. సింపుల్ గా బెల్లీ ఫ్యాట్ కరిగించుకునే అద్భుతమైన ఐడియా మీ చేతిలోనే ఉంది. అదేంటో ఇప్పుడే చూడండి.

ఒమేగా త్రీ ఫుడ్స్
ఒమేగా త్రీ ఫుడ్, సప్లిమెంట్స్ ఖచ్చితంగా తీసుకునే ఆహారంలో చేర్చుకోవాలి. ఎందుకంటే దీన్ని శరీరం ఉత్పత్తి చేసుకోలేదు. ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో పేరుకున్న అనవసర ఫ్యాట్ కరిగించడానికి సహాయపడతాయి. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ని వాల్ నట్స్, సార్డీన్ చేపలు, సాల్మన్ చేపలు, స్ర్పౌట్స్ నుంచి పొందవచ్చు. వీటిని డైలీ డైట్ లో చేర్చుకుంటే బెల్లీ తగ్గించుకోవచ్చు.
ప్రొటీన్స్
బరువు తగ్గించడానికి ప్రొటీన్స్ చాలా ముఖ్యమైనవి. కాబట్టి ప్రొటీన్స్ తీసుకునే పరిమాణం పెంచడం వల్ల మెటబాలిజం స్థాయి పెరిగి ఫ్యాట్ చేరుకోకుండా కాపాడుతాయి. కనుక ప్రొటీన్స్ స్థాయి పెంచితే.. క్యాలరీలు కరుగుతాయి. మీరు ఊహించని విధంగా బరువు తగ్గవచ్చు.

గ్రీన్ టీ
వ్యాయామం లేకుండా ఫాలో అవ్వాల్సిన టిప్స్ లో గ్రీన్ టీ ఒకటి. గ్రీన్ టీలో క్యాటెచిజం ఉంటుంది. ఇది చెడు కొలెస్ర్టాల్ చేరుకోకుండా అరికడుతూ.. జీర్ణవ్యవస్థ పనితీరుకి, కాలేయం ఆరోగ్యకరంగా ఉండటానికి సహాయపడుతుంది.
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్ ఫ్యాట్ కదా అని ఆలోచిస్తున్నారా ? మరీ ఎక్కువ మోతాదులో కాకుండా.. మీడియం పరిమాణంలో డార్క్ చాక్లెట్ తీసుకుంటే.. శరీరంలోని ఫ్యాట్ తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ గుండె ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. కాబట్టి మీ డైట్ లో డార్క్ చాక్లెట్ ను కూడా చేర్చుకోండి.

నిద్ర
నిద్రలేమి కారణంగా హార్మోనల్ డిశ్చార్జ్, జీర్ణవ్యవస్థ పనితీరుపై ప్రభావం పడటమే కాకుండా.. ఆకలిని పెంచుతుంది. ఇది వల్ల ఎక్కువ బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీ బెల్లీ ఫ్యాట్ ని కరిగించాలంటే.. సరైన నిద్ర అవసరం. కంటినిండా నిద్రపోతేనే ఆరోగ్యానికి మంచిది. చూశారుగా.. వ్యాయామంతో పనిలేకుండా.. సింపుల్ గా బెల్లీ ఫ్యాట్ కి బై బై చెప్పండిలా.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
