Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్!
చౌకగా, తేలికగా బరువు తగ్గించే ఆహారాలు..
బరువు తగ్గడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ.. అనేక సందర్భాల్లో ఈజీగా బరువు తగ్గించే.. అందుబాటులో ఉండే వండర్ ఫుల్ ఫుడ్స్ మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటాం. ఈ ఆహారాల్లో క్యాలరీలు తక్కువ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఈ వెయిట్ లాస్ ఫుడ్స్ పొట్ట నిండినట్టుగా అనిపించేలా చేసి.. అన్ హెల్తీ ఫుడ్స్ తీసుకోకుండా అరికడతాయి.
ఈ బరువు తగ్గించే ఆహారాలు మెటబాలిజం స్థాయిని పెంచి, క్యాలరీలను కరిగిస్తాయి. అలాగే శరీరంలో కొవ్వు పేరుకోకుండా కాపాడతాయి. ఈ బరువు తగ్గించే ఆహారాలు అందరికీ అందుబాటులో ఉండటమే కాదు.. తక్కువ ఖర్చులోనే లభిస్తాయి. కాబట్టి ఇలాంటి ఆహారాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి.. ఖచ్చితంగా డైట్ లో చేర్చుకోవాలి.
వెయిట్ లాస్ క్వాలిటీస్ మాత్రమే కాదు.. ఈ ఫుడ్స్ లో పోషకవిలువలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. విటమిన్స్, మినరల్స్ కూడా పుష్కలంగా పొందవచ్చు. మైండ్ ని, బాడీని ఆరోగ్యంగా, ఎనర్జిటిక్ గా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే చర్మం కూడా కాంతివంతంగా, జుట్టు బలంగా పెరగడానికి కూడా తోడ్పడతాయి. ఇంకెందుకు ఆలస్యం ఈజీగా బరువు తగ్గించడంతో పాటు.. అనేక పోషకాలను అందించే వెయిట్ లాస్ ఫుడ్స్ గురించి ఇప్పుడు చర్చిద్దాం..

పియర్
పియర్స్ బరువు తగ్గడానికి సహాయపడతాయని మీకు తెలుసా ? నిజమే ఇందులో 6 గ్రాముల సొల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ర్టాల్ స్థాయిని తగ్గించి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే పియర్ లో 100 క్యాలరీలు కలిగి ఉంటుంది.

క్యాబేజ్
క్యాబేజ్ లో ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయి. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఒక క్యాబేజీలో డెన్స్ ఫైబర్స్, 65 క్యాలరీలు ఉంటాయి. కానీ.. చాలా మంది క్యాబేజీ తినడానికి ఇష్టపడరు.. అలాగే చాలా నిర్లక్ష్యం చేస్తారు. కానీ.. ఇది బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

తక్కువ ఫ్యాట్ ఉండే పెరుగు
తక్కువ ఫ్యాట్ ఉండే పెరుగు, పాలు కూడా బరువు తగ్గడానికి సహాయపడతాయి. కానీ వీటిని చాలా మంచి నిర్లక్ష్యం చేస్తుంటారు. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే పెరుగులో ప్రొటీన్స్ రిచ్ గా ఉండటం వల్ల మెటబాలిజం స్థాయి పెంచడానికి ఉపయోగపడతాయి.

బ్రౌన్ రైస్, హోల్ గ్రెయిన్స్
బ్రౌన్ రైస్ బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుందని తాజా అధ్యనాలు వెల్లడించాయి. అలాగే ఇందులో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే బ్రౌన్ రైస్, హోల్ గ్రెయిన్ మీకు పొట్ట నిండిన ఫీలింగ్ తీసుకొస్తాయి. దీనివల్ల ఎక్కువ ఆహారం తీసుకునే అవకాశం ఉండదు. దీనివల్ల ఎక్కువ తినకుండా.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

గుమ్మడి
అందరికి అందుబాటులో ఉండే గుమ్మడికాయ క్యాలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ కలిగి ఉంటుంది. అలాగే గుమ్మడిలో ఫైబర్స్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడం చాలా ఈజీ. మీ పొట్ట నిండినట్లు అనిపించేలా చేస్తుంది గుమ్మడి. ఇందులో బీటా కెరొటిన్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. కానీ చాలా మంది దీన్ని తీసుకోకుండా దూరంగా ఉంటారు.

యాపిల్స్
బరువు తగ్గడానికి యాపిల్స్ చాలా మంచి ఆహారం. యాపిల్ తిన్న తర్వాత పొట్టనిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీనివల్ల అన్ హెల్తీ ఫుడ్స్ కి దూరంగా ఉంటారు. అలాగే యాపిల్స్ మెటబాలిజం స్థాయిని పెంచి, జీర్ణక్రియ సజావుగా సాగడానికి ఉపయోగపడుతుంది. యాపిల్స్ ద్వారా ఫైబర్స్, విటమిన్స్ ఎక్కువగా పొందవచ్చు. అయితే తొక్కతో పాటు యాపిల్స్ తీసుకోవడం వల్ల బరువు తగ్గడం చాలా తేలిక.

దాల్చిన చెక్క
బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది సుంగంధ దినుసుల్లో ఒకటైన దాల్చిన చెక్క. దీన్ని టీ రూపంలో గానీ, తేనెతో కలిపి గానీ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఖచ్చితంగా రోజూ తీసుకోవడం వల్ల ఈజీగా, త్వరగా బరువు తగ్గవచ్చు.
చూశారుగా.. అందరికీ అందుబాటులో, అందుబాటు ధరలో ఉండే ఫుడ్స్ తో ఎలా బరువు తగ్గవచ్చో. ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీటిని మీ డైట్ లో చేర్చుకుని వెంటనే బరువు తగ్గేయండి.



Click it and Unblock the Notifications











