Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
శరీరంలో ఎఫెక్టివ్ గా కొవ్వును కరిగించే ఒకే ఒక పండు..!
బొప్పాయిలో నమ్మశక్యం కాని బరువు తగ్గించే ప్రయోజనాలు ఉన్నాయని కనుగొన్నారు. బొప్పాయి పండును ఎంత ఎక్కువగా తింటే అంత ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. ఇది ప్రకృతి యొక్క అద్భుతమైన కొవ్వు బర్నింగ్ ఆహారాలలో ఒకట
బొప్పాయిలో నమ్మశక్యం కాని బరువు తగ్గించే ప్రయోజనాలు ఉన్నాయని కనుగొన్నారు. బొప్పాయి పండును ఎంత ఎక్కువగా తింటే అంత ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. ఇది ప్రకృతి యొక్క అద్భుతమైన కొవ్వు బర్నింగ్ ఆహారాలలో ఒకటిగా ఉంది. తియ్యని మరియు రుచికరమైన బొప్పాయి పండును రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.
బొప్పాయిలో హవాయిన్ బొప్పాయి మరియు మెక్సికన్ బొప్పాయి అనే రెండు రకాలు ఉన్నాయి.

పండ్లు శరీరంలో కొవ్వును ఎలా కరిగిస్తాయి
మెక్సికన్ బొప్పాయి కొన్నిసార్లు హవాయిన్ బొప్పాయి కంటే 20 పౌన్ల బరువు ఎక్కువగా ఉంటుంది. ఇది అత్యంత రుచికరమైన పండు. దీని రుచి పీచెస్ మరియు పుచ్చకాయల రుచిని మిక్స్ అయ్యి ఉంటుంది.
బొప్పాయిలో విటమిన్ సి మరియు విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటాయి. అలాగే కెలోరీలు సంతృప్తిగా,కొలెస్ట్రాల్,కొవ్వు లేకుండా పొటాషియం, ఫైబర్ మరియు ఫోలిక్ ఆమ్లంతో నిండి ఉంటుంది. అందువలన పోషకాలు కలిగిన ఈ పండును ప్రతి రోజు ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

జీర్ణ ప్రక్రియ లో సహాయం చేయటం బొప్పాయిలో ఉన్న ప్రధాన ఆరోగ్య ప్రయోజనం అని చెప్పవచ్చు. బొప్పాయిలో ఉండే ప్రోటెయోలైటిక్ ఎంజైమ్ మరియు పెపైన్ శరీరంలో ఉండే మాంసకృత్తులు, కొవ్వులు మరియు పిండి పదార్ధాలను విడగొట్టటానికి సహాయపడుతుంది.
అలాగే ప్రోటీన్ పరిణామాలను తొలగించడం ద్వారా జీర్ణ వాహికను శుభ్రం చేయటానికి కూడా ఉపయోగపడుతుంది. మీ ఆహారంలో కొవ్వును కరిగించే ఆహారం చేర్చటం చాలా లాభదాయకం. ఎందుకంటే మీ జీవక్రియ ప్రక్రియలో ఆహారం కొవ్వుగా మారకుండా సహాయపడతాయి.

నారింజ,ఆపిల్ తో పోల్చినప్పుడు బొప్పాయిలో విటమిన్ E కంటెంట్ అధికంగా ఉంటుంది. చర్మం పొర సున్నితంగా మరియు మృదువుగా మారటానికి బొప్పాయి జ్యుస్ సహాయపడుతుంది. బొప్పాయి కోలన్ లేదా గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

కొన్ని పచ్చి బొప్పాయి ముక్కలను తినటానికి ప్రయత్నం చేయాలి. బొప్పాయి గుజ్జును సల్సాలో మూల వస్తువుగా ఉపయోగించవచ్చు. బొప్పాయి ప్యూరీని తయారుచేసుకొని సలాడ్ గ్రీన్స్ తో మిక్స్ చేసుకొని తినవచ్చు. దీనిని ఒక ఆరోగ్యకరమైన సలాడ్ డ్రెస్సింగ్ గా ఉపయోగించవచ్చు.

పండ్ల సలాడ్ లో బొప్పాయి ముక్కలను కలపటం అనేది ఒక అద్భుతమైన భాగం. మీరు కూడా రంగుల,పోషకాలు మరియు రుచికరమైన వంటకం కోసం హానీడ్యూ, స్ట్రాబెర్రి లేదా ఇతర రుచికరమైన పండ్లను చేర్చవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications