Latest Updates
-
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే..
డూ ఇట్ యువర్ సెల్ఫ్: పొట్ట కరిగించి, బరువు తగ్గించే అమేజింగ్ డ్రింక్ -లెమన్ అండ్ మింట్ డ్రింక్
ప్రస్తుత జీవన శైలిలో ఆరోగ్యంగా జీవించాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆరోగ్యకర బరువును కలిగిండాలి. ఎత్తుకు తగ్గ బరువును మెయింటైన్ చేయడం వల్ల ఆరోగ్యంగా జీవిస్తారు. అధిక బరువు మరయు ఊబకాయం ఆరోగ్యానికి ఎంత హాని కలిగిస్తో ప్రతి ఒక్కరికీ తెలుసు.
అధికబరువు ఉండటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అద్రుష్టవశాత్తు , ఎంత బరువున్నా ...బరువు తగ్గించుకోవడానికి వివిధ మార్గాలున్నాయి. అధిక బరువును తగ్గించుకోవడానికి చాలా మంది వర్కౌట్స్, జిమ్, వ్యాయామాలు మరియు కఠినమైన డైట్ ను ఫాలో అవుతుంటారు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడానికి బదులు, ఇతర సమస్యలను తెచ్చిపెట్టుకుంటారు. ఏ పనిచేయాలన్నా, పరిమితంగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
బరువు తగ్గించుకోవడానికి నేచురల్ రెమెడీ ఎన్నో మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒక సీక్రెట్ రెమెడీని మీరు బరువు తగ్గించుకోవడానికి పరిచయం చేస్తున్నాము.

ఈ రిఫ్రెషింగ్ డ్రింక్ శరీరానికి డిటాక్సిఫై చేయడంతో పాటు , బరువు తగ్గించుకోవడానికి ఇది ఒక బెస్ట్ నేచురల్ మార్గం. ఈ నేచురల్ డ్రింక్ ను తయారుచేయడానికి మూడు ముఖ్యమైన పదార్థాలు అవసరం అవుతాయి. వాటిలో కీరదోస, లెమన్, మరియు మింట్ .
కీరదోసకాయ యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మరియు అద్భుతమైన డ్యూరియాటిక్ లక్షణాలు కూడా ఉన్నాయి.
అదే విధంగా నిమ్మరసం అసిడిక్ లక్షణం కలిగి ఉండటం వల్ల ఇది జీర్ణ శక్తిని పెంచుతుంది. మరియు ఫ్యాట్ బర్నింగ్ కాంపోనెంట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.
ఇక పుదీన అద్భుత ఔషధాలు కలిగినది . అనేక న్యూట్రీషియన్స్ గలది మరియు ఇది స్టొమక్ యాసిడ్స్ ను నివారిస్తుంది.

ఈ మూడు రకాల కాంబినేషన్ పదార్థాలు జీర్ణక్రియను పెంచడంలో గొప్పగా సహాయపడుతాయి . వీటిని కలిపినప్పుడు , వండర్ ఫుల్ టమ్మీ ఫ్లాటనింగ్ డ్రింక్ గా పనిచేస్తుంది.
పొట్టదగ్గర చేరిన అనవసర వ్యర్థాలను తొలగించడంలో ఈ డ్రింక్ గ్రేట్ గా పనిచేస్తుంది. దాంతో బరువు తగ్గడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.
మరి ఈ బరువు తగ్గించే డ్రింక్ తయారుచేయడం ఎలా, దీనికి ఏం అవసరం అవుతాయో తెలుసుకుందాం..

కావల్సినవి:
కీరదోసకాయ: 1/2
నిమ్మకాయ: 1
పుదీనా ఆకులు 10
నీరు: 1లీటర్
తయారుచేయు విధానం:
కీరదోసకాయను , పుదీనా ఆకులను కొద్దిగా నీరు చేర్చి మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత ఈ పేస్ట్ ను ఒక లీటర్ నీటిలో మిక్స్ చేసి ఫ్రెష్ లెమన్ జ్యూస్ ను అందులో జోడించాలి . తర్వాత మీకు ఇష్టమైతే కొన్ని ఐస్ ముక్కలు జోడించి చల్లచల్లగా లాంగించేయాలి.
ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది . రిమార్క్ లేకుండా క్రమంగా బరువు తగ్గుతారు. మంచి మార్పు కనిపిస్తుంది . ఈ హెల్తీ హ్యాబిట్ ను మీ డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందడంతో పాటు, స్లిమ్ గా తయారవుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
