Latest Updates
-
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్‌షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే!
ఒక్క నెలలో బాడీ వెయిట్ కంట్రోల్, బెల్లీ ఫ్యాట్ కరిగించే 7 అమేజింగ్ ఫ్రూట్స్
గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చోవడం, శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల చాలామందికి ఒబిసిటీ తప్పట్లేదు. ఒబిసిటీతో బాధపడేవారు పెరిగిన పొట్టతో తప్పకుండా ఇబ్బంది పడుతూనే ఉంటారు. బెల్లీఫ్యాట్ కరిగించడానికి ప్రయత్నాలు చేసి విసిగిపోయారా? కొన్ని కేర్‌ఫుల్ టిప్స్ ఫాలో అయితే ఒక్క నెలలో బెల్లీఫ్యాట్‌ని కరిగించి స్మార్ట్‌గా కనిపించొచ్చు.
బెల్లీ ఫ్యాట్ చాలామందికి ఇదో పెద్ద సమస్య. మీరు ఈ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి ఇది వరకే చాలా టిప్స్ ఫాలో అయి ఉంటారు. అయినా ఫలితం లేదా ? అయితే ఈ రోజు నుంచి కొన్ని చిట్కాలు పాటించండి. ఫ్యాట్ తగ్గించుకోండి. మీ స్టమక్ ను ప్లాట్ గా చేసుకోండి. కొన్ని రకాల ఫ్రూట్స్ ను బ్రేక్ ఫాస్ట్ గా లేదా స్నాక్స్ గా తీసుకోవడం వల్ల మీ బాడీకి అధిక కేలరీస్ అందడమేగాకుండా మీ బెల్లీ ఫ్యాట్ ఈజీగా కరిపోతుంది.అందుకు కొన్ని ప్రత్యేకమైన ఫ్రూట్స్ ఉన్నాయి, ఇవి టమ్మీ ఫ్యాట్ ను అద్భుతంగా ఒక నెలలో కరిగించేస్తాయి.
ప్రతి రోజూ మనం తినే ఆహారమే , మన శరీరం మీద ప్రభావం చూపుతుంది. బరువు పెరగడానికి ఫ్యాట్ ఏర్పడుటకు, టమ్మీ ఏర్పడుటకు కారణమవుతుంది.
టమ్మీ ఫ్యాట్ ను కరిగించుకోవడానికి వివిధ రకాలుగా సలహాలు తీసుకుని ఉంటారు, అనేక రకాలు ప్రయత్నించి ఉంటారు, వ్యాయామాలు చేసుంటారు. అయితే వీటన్నింటిలోనూ ఫ్యాట్ కరిగించుకోవడంలో ఫెయిల్ అయ్యుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఫ్యాట్ కరగకపోవడం వల్ల ఫ్రస్టేషన్ కు చేరుకుని ఉంటారు.
ముఖ్యంగా ఎవరైతే డెస్క్ జాబ్స్ చేస్తుంటారో, ఎక్కువ సమయం కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేస్తారో వారు జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం , జీవనశైలి వల్ల అటువంటి వారిలో టమ్మీ ఫ్యాట్ సమస్య సహజం. జంక్ ఫుడ్ ను కంట్రోల్ చేయడంతో పాటు ఈ క్రింది లిస్ట్ లో తెలిపిన ఫ్రూట్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బాడీ ఫ్యాట్ కరిగించుకోవడంతో పాటు, టమ్మీ ఫ్యాట్ తగ్గుతుంది.

వాటర్ మెలోన్ :
వాటర్ మెలోన్ లో నీరు 95శాతం ఉంటుంది. అంతే కాదు వాటర్ తో పాటు,అమినోయాసిడ్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి టమ్మీ ఫ్యాట్ ను కరిగిస్తాయి, బరువును కంట్రోల్ చేస్తాయి.

బొప్పాయి:
బొప్పాయి జీర్ణ శక్తిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. బొప్పాయిని రెగ్యులర్ గా తినడం వల్ల బరువు తగ్గిస్తుంది. పొట్ట చుట్టూ , నడుము చుట్టూ ఫ్యాట్ కరిగిస్తుంది.

పైనాపిల్:
పైనాపిల్ మరో ఫ్రూట్ క్యాలరీలు తక్కువ, విటమిన్ సి ఎక్కువ. మెటబాలిజం రేటును పెంచుతుంది. బెల్లీ ఫ్యాట్ ను త్వరగా కరిగిస్తుంది.

అవొకాడో :
అవొకాడో ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ లో బెస్ట్ ఫ్రూట్ . ఇది బాడీ వెయిట్ ను కూడా గ్రేట్ గా తగ్గిస్తుంది. ఎందుకంటే అవొకాడో ఫ్రూట్ లో ఫైబర్ మరియు మోనోఅన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉన్నాయి. అవొకాడో టమ్మీ ఫ్యాట్ ను కరిగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

అరటి పండ్లు:
అరటి పండ్లలో పొటాషియం మరియు ఎంజైమ్స్ అధికంగా ఉంటాయి, ఇది జీర్ణ శక్తిని పెంచుతుంది. బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. టమ్మీ ఫ్యాట్ ను కూడా ఎఫెక్టివ్ గా కరిగిస్తుంది.

ఆపిల్స్ :
ఆపిల్స్ లో ఫైబర్ కంటెంట్ అత్యధికంగా ఉంటుంది. ఇది కొవ్వు కరిగించడంలో బెస్ట్ ఫ్రూట్ శరీరంలో ఎక్స్ ట్రా ఫ్యాట్ ను కరిగించడంలో సహాయపడుతుంది. ప్రతి రోజూ ఆపిల్ తినడం వల్ల టమ్మీ ఫ్యాట్ ను కరిగించుకోవచ్చు.

ద్రాక్ష:
బాడీ ఫ్యాట్ ను కరిగించడంలో ద్రాక్ష గ్రేట్ గా సహాయపడుతుంది. బరువు తగ్గిస్తుంది. ప్రతి రోజూ ఒక గ్రేప్ జ్యూస్ తాగడం వల్ల టమ్మీ ఫ్యాట్ ను కరిగించుకోవచ్చు.



Click it and Unblock the Notifications