Latest Updates
-
హైదరాబాద్ స్పెషల్ ఇరానీ ఛాయ్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి! -
చపాతీ, పూరీ, పులావ్ లలోకి అదిరిపోయే మీల్ మేకర్ మసాలా గ్రేవీ.. నాన్ వెజ్ కూడా దీని ముందు దిగదుడుపే! -
ఒకే రకమైన మందులు.. వేర్వేరు ఫలితాలు..లివర్ డ్యామేజ్ వెనుక ఉన్న రహస్యం ఇదే! -
హ్యాపీ హోలీ 2026..మీ బంధుమిత్రులకు పంపడానికి బెస్ట్ హోలీ విషెస్, వాట్సాప్ స్టేటస్ లు ఇవే! -
ఈ హోలీకి అదిరిపోయే స్నాక్..అతిథులను మెప్పించే కరకరలాడే హెల్దీ రైస్ కుర్కురే..ఎలా చేసుకోవాలంటే.. -
హోలీ స్పెషల్..తాగేకొద్దీ తాగాలనిపించే చల్లని థాండాయ్..ఎలా చేసుకోవాలంటే.. -
వేసవి తాపాన్ని క్షణాల్లో తగ్గించే అద్భుతమైన సోంపు షర్బత్..ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
Holi 2026: ఇంట్లోనే సహజసిద్ధమైన హోలీ రంగులు..తయారు చేసుకోండిలా! -
Lunar Eclipse 2026: ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం..మీ రాశిపై ఎలాంటి ఫ్రభావం ఉంటుందో చూడండి! -
నోరూరించే కొబ్బరి అటుకుల ఉప్మా: 10 నిమిషాల్లో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్!
ఒకేసారి ఒబేసిటి , బాడీ వెయిట్ తగ్గించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..
ఓబేసిటి అంటే శరీరంలో ఎక్కువగా కొవ్వు చేరడం లేదా కొవ్వు నిల్వ ఉండటం. ఇది బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా శరీరంలో కొవ్వు ఎంత పరిమాణంలో ఉందో తెలుసుకోవచ్చు . బియంఐ(బాడీమాస్ ఇండెక్స్ 18.5 మరియు 25 మద్య ఉంటే శరీరానికి సరిపడా ఉందని అర్ధం . అయితే BMI 30కి పైన ఉంటే అప్పుడు మీరు ఒబేసిటి(ఊబయాకం)తో బాధపడుతున్నారని అర్ధం.
ఒబేసిటికి (ఊబయాకం)కు ముఖ్య కారణం అసాధారణ జీవనశైలి, ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారపు అలవాట్లు, ప్రొసెస్ చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువ ఆహారాలను తినడం, ఎక్కువగా తాగడం, శారీరకంగా వ్యాయామాలు చేయకపోవడం, నిద్రలేమి, మరియు మరికొన్ని ఇతర చెడు అలవాట్లు వల్ల ఒబేటిసికి కారణం అవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు మరియు హార్మోనుల సమస్యలు కూడా ఒబేసిటి రిస్క్ ను పెంచుతుంది.

ఒబేసిటి అంటే శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండటం మాత్రమే కాదు, కొవ్వుతో పాటు శరీరం అధిక బరువుతో ఉండటం. కొవ్వుతో పాటు అధిక బరువు ఉన్నట్లైతే ఆరోగ్య పరంగా అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్, హైబ్లడ్ ప్రెజర్, హార్ట్ డిసీజెస్ మరియు ఇతర కొన్ని ప్రమాధకరమైన ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది.
ఇలాంటి సమస్యలన్నింటి నుండి బయటపడాలంటే హెల్తీ లైఫ్ స్టైల్ ను అలవర్చుకోవడం మంచిది. అదే విధంగా శరీరంలో ఊబకాయానికి కారణమయ్యే కొవ్వును కరిగించడంతో పాటు, బరువును తగ్గించే కొన్ని ఎపెక్టివ్ నేచురల్ రెమెడీస్ ను ఉపయోగించి తగ్గించుకోవచ్చు. ..మరి అవేంటో తెలుసుకుందాం...

నిమ్మరసం:
నిమ్మరసం ఒక బెస్ట్ హోం రెమెడీ. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది . హెల్తీ డైజెషన్ వల్ల క్రమంగా బరువు తగ్గించుకోవచ్చు. నిమ్మరసం అందించే న్యూట్రీషీయన్స్ ఫ్యాట్ బర్న్ కు సహాయపడుతుంది, శరీరంలో టాక్సిన్స్ తొలగిస్తుంది. మెటబాలిజంను ఆలస్యం చేస్తుంది.
*3టేబుల్ స్పూన్ల నిమ్మరసంలో ఒక చెంచాతేనె, అరటీస్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ ను ఒక గ్లాసు నీటిలో మిక్స్ చేయాలి. ఈ డ్రింక్ ను ప్రతి రోజూ ఉదయం పరగడపున తాగాలి. క్రమంగా 3 నెలలు తాగుతుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్:
ఒబేసిటి మరియు ఎక్సెస్ వెయిట్ తగ్గించడంలో మరో ఎఫెక్టివ్ నేచురల్ రెమెడీ ఆపిల్ సైడర్ వెనిగర్. ఆపిల్ సైడర్ వెనిగర్ ఒబేసిటికి వ్యతిరేఖంగా పనిచేస్తుంది. ఫ్యాట్ ను విచ్ఛిన్నం చేస్తుంది. బాడీలో ఫ్యాట్ చేరకుండా నివారిస్తుంది.
* 2 చెంచాలా ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఒక గ్లాసు నీటిలో పోసి. ప్రతి రోజూ ఉదయం పరగడుపున మరియు భోజనానికి ముందు రోజూ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

అలోవెర:
ఒబేసిటికి మరియు అధిక బరువును తగ్గించడంలో మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ అలోవెర. ఇది ఎనర్జీని అందిస్తుంది మరియు శరీరంలో ఉపయోగంలేని ఫ్యాట్స్ ను కరిగిస్తుంది. ఇందులో ఉండే నేచురల్ కొల్లాజెన్ శరీరం మరింత హార్డ్ గా పనిచేయడానికి సహాయపడుతుంది. . మరియు ఇది శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది . జీర్ణవాహికలో మరియు కోలన్ లో టాక్సిన్స్ ను తొలగించడానికి సహాయపడుతుంది.
* రెండు అలోవెర లీఫ్స్ తీసుకొని, జెల్ ను స్పూన్ తో ఒక గ్లాసులోకి తీసుకోవాలి. తర్వాత దీన్ని బ్లెండర్ లో వేసి బ్లెండ్ చేయాలి. దీన్ని సిట్రస్ ఫ్రూట్ జ్యూసులతో కలిపి తీసుకోవచ్చు. నిమ్మరసం, గ్రేప్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ లతో కలిపి తీసుకోవడం వల్ల రుచికి రుచి. ఆరోగ్యానికి ఆరోగ్యం.

గ్రీన్ టీ:
గ్రీన్ టీలో మరో పాపులర్ హోం రెమెడీ. ఇది బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. శరీరంలో బాడీ ఫ్యాట్ ఏర్పడం ఆలస్యం చేస్తుంది. గ్రీన్ టీలో విటమిన్ సి, కెరోటినాయిడ్స్, జింక్, సెలీనియం, క్రోమియం మరియు ఇతర మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి.
* రోజూ రెండు కప్పులు గ్రీన్ టీ తాగడం వల్ల ఒబేసిటితో పాటు, అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు . గ్రీన్ టీకి అల్లం మరియు కేయాన్ పెప్పర్ ను కూడా జోడించి తీసుకోవడం వల్ల ఫలితం మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది.

కేయాన్ పెప్పర్:
కేయాన్ పెప్పర్ ఒబేసిటిని కంట్రోల్ చేయడానికి మరియు బరువు తగ్గించడానికి సహాయపడుతుంది . కేయాన్ పెప్పర్ లో ఉండే క్యాప్ససిన్ శరీరంలో ఫ్యాట్ ను క్రమబద్ద చేస్తుంది. ఎనర్జీ పెంచుతుంది. అదనంగా జీర్ణక్రియను క్రమబద్దం చేస్తుంది. ఆకలి తగ్గిస్తుంది. మెటబాలిజం రేటు పెరగడంతో కొవ్వు వేగంగా కరుగుతుంది. ఒబేసిటి, బరువు క్రమంగా తగ్గించుకోవచ్చు.
*కేయాన్ పెప్పర్ ను గ్లాసులో వేసి, వేడి నీరు పోయాలి. తర్వాత కొద్దిగా నిమ్మరసం కూడా మిక్స్ చేసి గోరువెచ్చగా నెల రోజుల పాటు క్రమం తప్పకుండా తాగాలి.

కరివేపాకు:
ప్రతి రోజూ ఉదయం నిద్రలేవగానే 10 కరివేపాకు ఆకులను తినడం వల్ల ఒబేసిటి దూరం చేసుకోవచ్చు. డయాబెటిస్ కు కారణమయ్యే ఊబకాయంను తగ్గించడంలో , అధిక బరువు తగ్గించడంలో కరివేపాకు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . రెగ్యులర్ గా మూడు నెలలపాటు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
*కరివేపాకులో ఉండే ఆల్కలాయిడ్స్ యాంటీ ఒబేసిటిగా పనిచేస్తుంది. బాడీ వెయిట్ ను తగ్గిస్తుంది.

టమోటోలు:
ప్రతి రోజూ ఉదయం పరగడుపు రెండు మూడు టమోటోలు తినాలి. విత్తనాలు, తొక్కతో పాటు అలాగే తినాలి. వీటిలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. టమోటోలో ఉండే కొన్ని కాంపౌడ్స్ ఆకలిని తగ్గించే హార్మోనులను ఉత్పత్తి చేస్తాయి. దాంతో ఆకలి తగ్గించే ఆహారాల మీద కోరిక కలగకుండా ఎక్కువ ఆహారాలు తీసుకోకుండా చేస్తుంది.
ఇంకా ఇందులో ఉండే విటమిన్ సి, ఎ, మరియు కె లు మరియు మెగ్నీషియం, కోలిన్, ఫొల్లెట్ మరియు ఇతర న్యూట్రీషియన్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి . వీటిలో ఉండే యాంటీ యాక్సిడెంట్ క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతాయి.

క్యాబేజ్:
పచ్చిది లేదా ఉడికించిన క్యాబేజ్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. పచ్చిక్యాబేజ్ లో టార్టరిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది షుగర్ మరియు ఇతర కార్బోహైడ్రేట్స్ మరియు ఫ్యాట్ ను కరిగించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్ సి ఎక్కువ, క్యాలరీలు తక్కువ, ఫైబర్ మరియు వాటర్ కంటెంట్ అధికం.
ఈ క్యూసిఫెరస్ వెజిటేబుల్లో ఉండే ఫైటో కెమికల్స్ ఈస్ట్రోజన్ మెటబాలిజం లోపం వల్ల బాడీ ఫ్యాట్ కు , బ్రెస్ట్ , ఓవేరియన్, మరియు ఇతర క్యాన్సర్స్ కు గురిచేస్తుంది, ఈ క్రూసిఫెరస్ వెజిటేబుల్ రెగ్యులర్ గా తింటే ఫ్యాట్, బరువు తగ్గించుకోవడంతో పాటు, ఇతర ప్రాణాంతక క్యాన్సర్ ను నివారించుకోవచ్చు.

సోంపు:
సోంపు బరువు తగ్గించే ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఇందులో ఉండే డ్యూరియాటిక్ గుణాలు బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.
సోంపు డ్రై రోస్ట్ చేసి, మెత్తగా పౌడర్ చేసి , ఈ పౌడర్ ను గోరువెచ్చని నీటితో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే పొట్ట ఉదరంలో గ్యాస్, అజీర్తి సమస్యలు మరియు మలబద్దకం నివారించబడుతుంది .

.హాని సినామిన్:
ఈ రెండింటి కాబినేషన్ డ్రింక్ బరువు తగ్గించడంలో, కొవ్వు కరిగించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి . శరీరాన్ని డిటాక్సిఫై చేస్తాయి.
ఒక కప్పు హాట్ వాటర్ లో తేనె , దాల్చిన చెక్క పౌడర్ మిక్స్ చేసి రోజూ ఉదయం పరగడపున మరియు రాత్రి నిద్రించే ముందు తాగితే మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications











