బాడీ ఎక్సెస్ క్యాలరీలను కరిగించి అధిక బరువును తగ్గించే గ్రీన్ షేక్స్...

కొన్ని ఫ్యాబులస్ డ్రింక్స్ శరీరంలోని కొన్ని అదనపు క్యాలరీలను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది? ఖచ్చితంగా అవుననే చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు . బరువు తగ్గించుకోవడానికి గ్రీన్ షేక్స్ అద్భుతంగా సహాయపడుతాయి . అదే క్రమంలో ప్రకాశవంతమైన యంగర్ లుక్ ను అందిస్తాయి . 60పర్సెంట్ గ్రీన్ వెజిటేబుల్స్ 40శాతం ఫ్రూట్స్ మిక్స్ షేక్స్ తయారుచేసికొని త్రాగడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందంతో పాటు..శరీరంలోని అదనపు క్యాలరీలను కరిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది . గ్రీన్ ఫుడ్స్ తీసుకోవడం కంటే రెగ్యులర్ గా గ్రీన్ డ్రింక్స్ మరియు గ్రీన్ స్మూతీస్ త్రాగడం అలవాటు చేసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు అందుతాయి.

గ్రీన్ ఫుడ్స్ ఎల్లప్పుడు ఆరోగ్యకరమైనవిగా మరియు న్యూట్రిషియన్ మరియు ఎనర్జీ అందించే ఆహారాలుగా గుర్తించడం జరిగింది. ఆకుకూరలు, కేలా, కొత్తిమీర మరియు పుదీనా వంటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇవి ప్రోటీనులు, కార్బోహైడ్రేట్స్, మినిరల్స్, న్యూట్రీషియన్ కు ఒక మంచి మూలం. గ్రీన్ వెజిటేబుల్స్ గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు కలిగిఉన్నాయి అందుకే డైటీషియన్స్, డాక్టర్స్ మీ రెగ్యులర్ డైట్ లో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ను చేర్చుకోమని సలహాలిస్తుంటారు.

గ్రీన్ వెజిటేబుల్స్ ను ఉడికించి లేదా ఉడికించ కుండా కూడా తీసుకోవచ్చు. గ్రీన్ జ్యూస్ లు అనేకం ఉన్నా యి. అవి మీ శరీరానికి తక్షణ ఎనర్జీ అంధిస్తాయి. గ్రీన్ జ్యూస్ లను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల, మీ శరీరంలో పోషకాలు లోపించిన వాటిని తిరిగి తీసుకొస్తుంది మరియు మీ శరీరంలో రోగనిధక శక్తిని పెంచుతుంది.

బరువు తగ్గాలనుకుంటున్నారా ? ఐతే బనానా డైట్ ఫాలో అవండి

గ్రీన్ వెజిటేబుల్స్ క్లోరోఫిల్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది శరీరానికి కావల్సిన ఆక్సిజన్ ను అందిస్తుంది. ఇంకా బ్లడ్ సర్కులేషన్ ను క్రమబద్దం చేస్తుంది. శరీరంలో నిల్వ ఉన్న టాక్సిన్స్ (విషాల)ను బయటకు నెట్టివేస్తుంది. ఇందులో ఉండే చాలా రకాల యాంటీఆక్సిడెంట్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచి, క్యాన్సర్ తో పోరాడుతుంది. బరువు క్యాలరీలు తగ్గించడానికి సహాయపడుతాయి. మరి క్యాలరీలు బర్న్ చేసి బరువు తగ్గించే గ్రీన్ డ్రింక్స్ ఏంటో ఒకసారి చూద్దాం...

ఆకుకూరలు మరియు కోకోనట్ జ్యూస్

ఆకుకూరలు మరియు కోకోనట్ జ్యూస్

ఈ జ్యూస్ తయారుచేయడానికి ఒక కప్పు కొబ్బరి పాలు, పేస్ట్ చేసిన ఆకుకూరల. ఆకుకూరలను, త్రుణధాన్యాలు, అరటిపండు మరియు దాల్చిన చెక్క అన్నీ వేసి బాగా మెత్తగా పేస్ట్ చేయాలి . ఇందులో అరటిపండు, దాల్చిన చెక్క వేయడం వల్ల ఈ గ్రీన్ జ్యూస్ కొద్దిగా తియ్యగా ఉంటుంది. ఈ జ్యూస్ ఎనర్జీ అంధిచండంలో, ప్రోటీన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ అంధించడంలో గొప్ప నప్రయోజనకారి, ఇది శరీరాన్ని శుభ్రపరుస్తుంది. జీర్ణాశయాన్ని క్లియర్ చేస్తుంది.

కీరదోస మరియు ఆకు కూర

కీరదోస మరియు ఆకు కూర

ఆకు కూర మరియు కీరదోసకాయను రెండింటిని ముక్కలుగా చేసి, మిక్సీలో వేసి మెత్తగా పేస్తట్ చేయాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి మరియు కొన్ని దాల్చిన చెక్క వేసి కొద్దిగా నీళ్ళు పేసి గ్రైండ్ చేయాలి . కీరదోస బాడీ క్లెన్సర్ గా అద్బుతంగా సహాయపడుతుంది. మరియు ప్రోటీనులను అందిస్తుంది. ఆకు కూరలో అనేక యాంటీఆక్సిడెంట్స్, ప్రోటీనుల మరియు న్యూట్రీషియన్స్ కలిగి ఉంది . ఇది ఆరోగ్యకరంమరియు శక్తిని అంధిస్తుంది.

పుదీనా మరియు నిమ్మరసం

పుదీనా మరియు నిమ్మరసం

పుదీనా రిఫ్రెష్ మరియు రివైవింగ్ ఏజెంట్. నిమ్మరసం , పుదీనా రెండింటి మిశ్రమనం తక్షణ శక్తిని అంధించేవే . ఇవి శరీరానికి తగినంత తేమను అందిస్తుంది. రీ హైడ్రేషన్ లక్షణాలు కలిగి ఉండటం వల్ల తక్షణ శక్తిని అంధిస్తాయి . ఈ రెండింటిని మీక్సిలో వేసి దానికి ఉప్పు, దాల్చిన చెక్క చేర్చి పేస్ట్ లా చేయాలి. ఈ జ్యూస్ చాలా ఆరోగ్యకరం మరియు తయారుచేయడం చాలా సులభం.

గ్రీన్ గార్డెన్ జ్యూస్

గ్రీన్ గార్డెన్ జ్యూస్

ఈ జ్యూస్ తయారుచేయడానికి ఆకుకూర కాలే, ఒక కప్పు కీరదోసముక్కలు , మరో కప్పు ఆకుకూరలు, కొత్తిమీరమరియు పార్సలే అన్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. అందులో కొద్దిగా నీళ్ళు, పెప్పుర్ వేసి మిక్స్ చేసి తీసుకోవాలి . ఇది ఫర్ ఫెక్ట్ ఎనర్జీ డ్రింక్

స్పినాచ్(ఆకు కూరలతో)జ్యూస్:

స్పినాచ్(ఆకు కూరలతో)జ్యూస్:

గ్రీన్ లీఫీ వెజిటేబుల్ జ్యూసులు బరువు తగ్గాలనుకొనే వారికి చాలా మంచిది. ఇందులో అధిక శాతంలో విటమిన్స్, మరియు ప్రోటీన్స్ కలిగి ఉంటాయి. ఉడికించిన ఆకుకూరల జ్యూసును ఒక గ్లాస్ త్రాగడం వల్ల ఇటు శరీరం ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మ, కురుల సంరక్షణతో పాటు. కళ్ళ ఆరోగ్యానికి మంచిది.

 కివి జ్యూస్:

కివి జ్యూస్:

కివి ఒక పండు. దీంతో తయారు చేసే జ్యూస్ ఆరోగ్యం మాత్రమే కాదు టేస్టీ కూడా. ఈ కివి జ్యూస్ ను ఒక్క సారి త్రాగితే చాలు అందరికి చాలా ఇష్టం అవుతుంది. దీన్ని పాలతో మిక్స్ చేసి త్రాగడం వల్ల శరీరానికి కావల్సిన న్యూట్రీషియన్స్ మరియు ప్రోటీనులు అందుతాయి.

 బ్రొకోలీ జ్యూస్:

బ్రొకోలీ జ్యూస్:

గ్రీన్ వెజిటేబుల్ జ్యూసులు వల్ల చాలా రకాల ఆరోగ్య, న్యూట్రీషనల్ బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా మంది తమ చర్మసంరక్షణ కోసం, చర్మం మెరిసేలా చేసుకోవడం కోసం బ్రొకోలీ జ్యూసును రెగ్యులర్ గా తీసుకుంటుంటారు. ఇది క్యాన్సర్ తో పోరాడుతుంది. బ్రొకోలీ, మెలకెత్తిన విత్తనాల జ్యూసులు చాలా ఫేమస్.

కొత్తిమీర జ్యూస్:

కొత్తిమీర జ్యూస్:

చాలా సన్నటి ఆకులు కలిగిన గ్రీన్ లీఫ్ కొత్తిమీర. దీంతో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో మెడిసినల్ ఔషధ గుణాలు ఎక్కువ. క్యాన్సర్ తో పోడటం అటుంచితే, ఈ జ్యూస్ తో డైజషన్, రక్తంలోని కొలెస్ట్రాల్ తగ్గించడానికి, బ్లెడ్ ప్రెషర్ లెవల్ కంట్రోల్ చేయడానికి బాగా సహాయపడుతుంది.

బాటిల్ గార్డ్(సొరకాయ):

బాటిల్ గార్డ్(సొరకాయ):

విటమిన్ - సి, బి.కాంప్లెక్క్ష్ , సొరకాయలో లబిస్తాయి. సొరకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది, సులువుగా జీర్ణమవుతుంది. డయూరెటిక్ గా పనిజేస్తుంది. ముత్రనాళాల జబ్బులకు ఇది మంచిది. పచ్చిసొరకాయ రసం దాహార్తిని అరికడుతుంది, అలసటను తగ్గిస్తుంది.

అవొకాడో జ్యూస్:

అవొకాడో జ్యూస్:

అవొకాడో జ్యూసులో చాలా హెల్త్ మరియు స్కిన్ బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రతి రోజూ అవొకాడో జ్యూస్ ను త్రాగితే మంచి ఆరోగ్యంతో పాటు, కాంతివంతమైన చర్మ ఛాయను పొందుతారు.

Story first published: Wednesday, March 9, 2016, 18:56 [IST]
Desktop Bottom Promotion