For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉపవాసం వల్ల ఆరోగ్యానికి 10 అద్భుత ప్రయోజనాలు

|

ప్రస్తుతం పవిత్ర రంజాన్ మాసం నడుస్తోంది. రంజాన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది..ఉపవాస దీక్షలు, ఎంతో భక్తితో, శ్రద్దతో చేసే ప్రార్థలు. అయితే వాస్తవానికి అన్ని మతాల్లో ఈ ఉపవాసం చేసే ఆచారం కనిపిస్తుంది.

పుణ్యం కోసం చేసే వారిని మినహాయిస్తే, కొందరు బరువు తగ్గి, సన్నగా , నాజూగ్గా తయారవ్వాలని కూడా ఉపవాసం చేస్తుంటారు. అయితే ఉపవాసం నేపథ్యమేదైనా దీని వల్ల లాభాలు మాత్రం అనేకం ఉన్నాయి..

1. ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్ అవుతాయి, వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది:

1. ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్ అవుతాయి, వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది:

ఉపవాసం ఉండటం వల్ల వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. మనం తిన్న ఆహారంను జీర్ణం చేసే జీర్ణవ్యవస్థ భాగాలకు ఉపవాసం వల్ల విశ్రాంతి దొరుకుతుంది. దీని వల్ల శరీరంలోని వివిధ రకాల ద్రవాలు బ్యాలెన్స్ అతుతాయి.

2. ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి:

2. ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి:

ఉపవాసం అనే ఈ సంప్రదాయం వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు, శరీరంలోపల క్లెన్సింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఉపవాసం శరీరంలోని ఎంజైమ్ వ్యవస్థపై ప్రభావం చూపి శరీరంలోని విషపదార్థాలను (టాక్సిన్స్)తొలగిస్తుంది. దీని వల్ల ఒత్త

3. ఆర్థ్రైటిస్, రుమటాయిడ్ సమస్యలు తగ్గుతాయి:

3. ఆర్థ్రైటిస్, రుమటాయిడ్ సమస్యలు తగ్గుతాయి:

ఉపవాసం వల్ల ఆర్థ్రైటిస్, రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ , వివిధ రకాల చర్మ సంబంధ సమస్యలను నుండి ఉపశమనం కలుగుతుంది.

రంజాన్ నెలలో ఉపవాసం యొక్క ప్రాముఖ్యత రంజాన్ నెలలో ఉపవాసం యొక్క ప్రాముఖ్యత

4. బరువు తగ్గిస్తుంది:

4. బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గాలనుకునే వారికి ఉపశాసం చేయడం అనేది మంచి పద్దతి. ఎందుకంటే ఉపవాసం వల్ల మనం తీసుకునే ఆహారం, అలవాట్లు జీవనశైలి, వీటన్నింటిలో మార్పులొస్తాయి. పైగా శరీరంలోని కొవ్వు కూడా కరగుతుంది. కాబట్టి, బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

5. టాక్సిన్స్ తొలగిపోవడంతో చర్మం మెరుగుస్తుంది:

5. టాక్సిన్స్ తొలగిపోవడంతో చర్మం మెరుగుస్తుంది:

ఉపవాసం వల్ల శరీరంలోని వ్యర్థాలు తొలగిపోయి, అనారోగ్యాలు దూరమవ్వడమే కాకుండా, చర్మం కూడా మెరుస్తూ కనబడుతుంది.

6. ఎనర్జీ పెరుగుతుంది:

6. ఎనర్జీ పెరుగుతుంది:

ఉపవాసం చేయడం వల్ల శరీరంలోని శక్తి తగ్గుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు, పైపెచచు మనకు ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు ఏర్పడిన విషపదార్థాలు ఉపవాసం చేయడం వల్ల తొలగిపోయి, శరీరంలో చురుకుదనం, ఉత్సహాయం పెరుగుతాయి. ఫలితంగా శక్తిస్థాయిలు కూడా పెంపొందుతాయి.

7. హైపర్ టెన్షన్ తగ్గుతుంది:

7. హైపర్ టెన్షన్ తగ్గుతుంది:

ఉపవాసం చేయడం వల్ల శరీరంలో మెటబాలిక్ రేటు పెరుగుతుంది. రక్తంలో ఫ్యాట్ లెవల్స్ కరుగుతాయి.దాంతో హైబ్లడ్ ప్రెజర్, ఇతర సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

రంజాన్ సమయంలో చేయకూడని 10 పనులు రంజాన్ సమయంలో చేయకూడని 10 పనులు

8. చెడు అలవాట్లకు దూరంగా ఉండవచ్చు:

8. చెడు అలవాట్లకు దూరంగా ఉండవచ్చు:

రంజాన్ మాసంలో ఉపవాసం వల్ల స్మోకింగ్, డ్రింకింగ్ వంటి చెడు అలవాట్లును దూరం చేసుకోవచ్చు. ఒక్క నెల రోజులు కఠినంగా ఉండటం వల్ల ఈ అలవాట్లు పూర్తిగా దూరం చేసుకోవడానికి సహాయపడుతుంది.

9. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

9. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

ఉపవాస సమయంలో ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉంటారు. ఇది బ్లడ్ ప్యాట్ లెవల్స్ ను తగ్గిస్తుంది. దాంతో కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

10. జీర్ణవ్యవస్థకూ మంచిది.

10. జీర్ణవ్యవస్థకూ మంచిది.

ఉపవాసం ఆరోగ్యానికి మంచిది కాదా అని రోజూ చేస్తామంటే ఆరోగ్యం పాడైపోతుంది. కాబట్టి, సాధారణంగా వారానికోసారి ఉపవాసం ఉండటం మంచిది. ఒక వేళ దీక్షల వంటి సందర్భాల్లో ఒకటి కన్నా ఎక్కువ రోజులు చేయాల్సి వస్తే రోజంతా ఏం తీసుకోకుండా ఉండకుండా, పండ్లు పళ్ల రసాలు , సలాడ్స్, నట్స్ పచ్చికూరగాయలు ఇలా ఏవైనా లైట్ గా తీసుకుంటే ఆకలికి తట్టుకోలేని వారికి సౌకర్యంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థకూ మంచిది.

English summary

10 Amazing Health Benefits Of Fasting During Ramzan in Telugu

Here is why fasting during Ramzan can prove to be healthy, read on!
Desktop Bottom Promotion