For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 10 డైట్ టిప్స్ పాటించి దీపావ‌ళి నాటికి ఫిట్‌గా త‌యార‌వ్వండి!

By Sujeeth Kumar
|

దీపావ‌ళి అంటేనే వెలుగు జిలుగుల దీపకాంతుల పండుగ‌. ఆడంబ‌ర‌త్వానికి, ప్ర‌త్యేక‌త‌కు గొప్ప‌త‌నానికి ఈ పండుగ పెట్టింది పేరు. భార‌త‌దేశానికి చెందిన‌దైనా ఈ పండుగ‌ను వివిధ దేశాల్లో పెద్ద‌యెత్తున ఘ‌నంగా వేడుక‌గా జ‌రుపుకుంటారు. దీపావ‌ళి స‌మీపించే కొద్దీ ప్ర‌పంచంలో ఉన్న భార‌తీయులు పండుగను వేడుక‌గా జ‌రుపుకునే ఏర్పాట్లు చేసుకుంటారు. ఈ రోజు అత్యంత సంతోషంగా, వేడుక‌గా జ‌రుపుకోవాల‌ని అనుకుంటారు.

హిందువులు ఈ పండుగ‌ను కేవ‌లం మ‌న దేశంలోనే కాదు మ‌లేసియా, మ‌య‌న్మార్‌, శ్రీ‌లంక లాంటి దేశాల్లోనూ ఘ‌నంగా జ‌రుపుకుంటారు. మ‌న‌లోని చీక‌టి అనే అజ్నానాన్ని త‌రిమివేసి లోప‌లి నుంచి వెలుగును బ‌య‌ట‌కు తీసుకురావాల‌నేది ఈ పండుగ ఉద్దేశం. అందుకే ప్ర‌జ‌లు త‌మ ఇళ్ల‌ను, ప‌రిస‌రాల‌ను రంగు రంగుల ర‌కారకాలైన‌టువంటి దీపాల‌తో అలంక‌రిస్తారు.

Here Are 10 Simple Diet Tips To Remain Healthy During Diwali

ఇక పండుగ అంటే అంద‌రికీ తెలిసిందే! నిష్ట‌తో కూడిన వ్ర‌తాలు, నోములు, పూజ‌లు ఉంటాయి. సంప్ర‌దాయాల‌ను పాటించాల్సి ఉంటుంది. కొత్త బ‌ట్ట‌లు, ఆభ‌రణాలు కొంటాం. రుచిక‌ర‌మైన ఆహారాన్ని సిద్ధం చేసుకుంటాం. బంధువులు, స్నేహితుల ఇళ్ల‌కు వెళుతుంటాం. వారిని క‌లుస్తుంటాం.

దీపావ‌ళి అనే కాదు పండుగ ఏదైనా స‌రే చ‌క్క‌గా ముస్తాబై అలంక‌రించుకొని అంద‌రికీ ఆక‌ర్ష‌ణ‌గా క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడుతుంటాం. స‌రైన శ‌రీరాకృతి పొందేలా, ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకుంటాం. పండుగ రోజు ఆరోగ్యంగా ఉండాల‌ని అనుకుంటాం. మ‌నం కొనే దుస్తులు మ‌న‌కు న‌ప్పేలా మ‌న శ‌రీరాకృతికి త‌గ్గ‌ట్టుగా ఉండాల‌నుకోవ‌డం త‌ప్పేం కాదు క‌దా! మ‌రి అందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

పండుగ తర్వాత బరువు తగ్గించుకోడం ఎలా పండుగ తర్వాత బరువు తగ్గించుకోడం ఎలా

పెళ్లి చేసుకునే ముందు బ‌రువు త‌గ్గాలి అనుకునే వారు ఉంటారు. అలాగే పండుగ‌కు కూడా బాగా క‌నిపించాల‌ని అనుకునేవారు ఉంటారు. వారి కోసం కొన్ని ఆరోగ్య చిట్కాలు.. ఈ దీపావ‌ళి నుంచి మీరూ పాటించి హెల్దీగా ఉండండి...

ఆకు కూర‌లు తినండి

ఆకు కూర‌లు తినండి

దీపావ‌ళి పండుగ రోజు వ‌ర‌కు పాల‌కూర‌, పుదీన‌, కోతిమీర‌, గోంగూర లాంటి ఆక‌కూర‌ల‌ను మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి. ప‌చ్చ‌ని ఆకుకూర‌ల్లో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్లు, పోష‌కాలు ఉంటాయి. అవి రోగ‌నిరోధ‌క శ‌క్తిని మ‌రింత పెంచుతాయి. త‌ద్వారా రోగాలు ద‌రిచేర‌కుండా ఉంటాయి. జీవక్రియ‌ల‌ను వేగ‌వంతం చేసి బ‌రువు త‌గ్గేలా చేస్తాయి. దీంతో పాటు మీ చ‌ర్మం కాంతివంత‌మ‌వుతుంది.

నీళ్లు ఇలా తాగితే...

నీళ్లు ఇలా తాగితే...

రోజుకు క‌నీసం 2 లీట‌ర్ల నీళ్లు తాగండి. చెప్పాలంటే నీళ్లు తాగ‌డం వ‌ల్ల ఆనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలున్నాయి. సత్ఫ‌లితాలు తొంద‌ర‌గా పొందుతారు. బ‌రువు త‌గ్గ‌డంలో నీళ్ల పాత్ర అమోఘ‌మైన‌ది. చ‌ర్మం డీహైడ్రేట్ అవ్వ‌కుండా ఇది కాపాడుతుంది. అంతేకాకుండా అజీర్తి స‌మ‌స్య‌లుంటే ఇట్టే పోతాయి.

ఆంధ్ర స్పెషల్ స్నాక్స్ -దీపావళి స్పెషల్ఆంధ్ర స్పెషల్ స్నాక్స్ -దీపావళి స్పెషల్

రోజూ వ్యాయామం

రోజూ వ్యాయామం

రోజుకు క‌నీసం గంట‌సేపు వ్యాయామం చేసేలా చూడండి. పండుగ‌కు కొద్ది రోజులే ఉన్నా ప‌రుగు, జాగింగ్‌, జుంబా, స్విమ్మింగ్ లాంటివి చేయ‌డం వ‌ద‌ల‌కండి. వ్యాయామం మీ శ‌రీరాన్ని తేలిక‌ప‌రుస్తుంది. రోగ‌నిరోధ‌క శ‌క్తిని కూడా పెంపొందిస్తుంది.

పండ్లు, కూర‌గాయలు తినండి

పండ్లు, కూర‌గాయలు తినండి

మీ ఆహారంలో పండ్లు, కూర‌గాయ‌ల‌ను సాధ్య‌మైనంత ఎక్కువ‌గా చేర్చుకోండి. దీంట్లో పుష్క‌లంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అంతేకాకుండా పోష‌కాలు కూడా మెండుగా అందుతాయి. తొంద‌ర‌గా బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఇలా ఎక్కువ మోతాదులో తాజా పండ్లు, కూర‌గాయ‌లు తీసుకుంటూ ఉండాలి. అప్పుడు రోగ‌నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది.

ఇవి తిన‌కండి

ఇవి తిన‌కండి

బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు ఆలుగ‌డ్డ‌లు, అర‌టి పండ్లు తిన‌క‌పోవ‌డ‌మే మంచిది. వీటిలో పోష‌కాలు, క్యాల‌రీలు ఎక్కువ‌. కొవ్వు శాతం కూడా ఎక్కువే. తీరైన శ‌రీరాకృతి కోరుకునేవారు వీటికి దూరంగా ఉండ‌డం మంచిది. లేక‌పోతే అన‌వ‌స‌రంగా లావైపోతారు.

హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ తినండి

హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ తినండి

బ్రేక్ ఫాస్ట్‌లో ఒక పెద్ద ఆపిల్ పండుతో పాటు పెద్ద గ్లాసు నిండా పాలు తాగ‌డం అల‌వాటు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇలా చేయ‌డం వ‌ల్ల ఉద‌యాన్నే శ‌రీరాన్ని ఆక‌లికి గురిచేయ‌కుండా చూసుకోగ‌లుగుతారు. ఉద‌యం పూట అల్పాహారం తీసుకోవ‌డం వ‌ల్ల బరువు త‌గ్గుతార‌ని అంటారు అయితే త‌క్కువ క్యాల‌రీలున్న అల్పాహారం తీసుకోవాలి.

మాంసం వ‌ద్దు

మాంసం వ‌ద్దు

మీరు మాంసాహార ప్రియులైతే త‌క్కువ కొవ్వు ఉంటే మాంసాన్ని ఎంచుకోవాలి. చికెన్ లాంటి మాంసం మంచిది. అదే స‌మ‌యంలో ఎర్ర మాంసం అంత‌గా మంచిది కాదు. బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు చేప‌లు లాంటి ఆహారం తీసుకోవాలి. దీని వ‌ల్ల రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధుల‌ను త‌ట్టుకునే శ‌క్తి పెరుగుతుంది.

ప్రోటీన్లు ఎక్కువుండేలా..

ప్రోటీన్లు ఎక్కువుండేలా..

మీ ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండేలా చూసుకోండి. డైట్‌లో భాగంగా చికెన్‌, శ‌న‌గ గింజ‌లు, రాజ్మా, సోయా, టోఫు లాంటి ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. కొవ్వు క‌ణాల‌ను ప్రోటీన్లు బాగా క‌రిగిస్తాయి. కండ‌లు పెర‌గ‌డానికి సైతం ప్రోటీన్లు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. టోన్డ్ బాడీ మీ సొంత‌మ‌వుతుంది.

వ్య‌ర్థాల‌ను తొల‌గించండి

వ్య‌ర్థాల‌ను తొల‌గించండి

దీపావ‌ళి స‌మీపిస్తున్నందుకు ఒక రోజు మొత్తం డీటాక్సిఫికేష‌న్ కోసం కేటాయించండి. ఇందుకోసం ఒక రోజంతా తాజా పండ్లు, కూర‌గాయ జ్యూస్‌లు తాగండి. దీంతో పాటు లైట్ స‌లాడ్లు తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలోని వ్య‌ర్థాల‌న్నీ తొల‌గిపోయి బాడీ ఫ్రెష్‌గా త‌యార‌వుతుంది. జీవ క్రియ‌లు కూడా వేగ‌వంత‌మ‌వుతాయి.

జంక్ ఫుడ్‌కు బ‌దులుగా ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం

జంక్ ఫుడ్‌కు బ‌దులుగా ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం

కొన్ని ర‌కాల జంక్ ఫుడ్ కు దూరంగా ఉండ‌డం మంచిది. వైట్ రైస్ తీసుకునే బ‌దులు బ్ర‌వున్ రైస్ తినాలి. ఇంకా వైట్ బ్రెడ్ కి బ‌దులు హోల్ గ్రెయిన్ బ్రెడ్ తీసుకోవ‌డం మంచిది. సాఫ్ట్ డ్రింక్స్ స్థానంలో సుగ‌ర్ లెస్ ఫ్రూట్ జ్యూసులు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. ఈ పండుగ స‌మ‌యంలో ఇలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోవ‌డం వ‌ల్ల ఉత్సాహంగా, బ‌లంగా ఉంటాం.

మ‌రి దీపావ‌ళికి అందంగా, ఆరోగ్యంగా త‌యార‌య్యేందుకు మీరు కూడా సిద్ధ‌మ‌వుతున్నారు క‌దా!

English summary

Here Are 10 Simple Diet Tips To Remain Healthy During Diwali

Here Are 10 Simple Diet Tips To Remain Healthy During Diwali. Read to know more about it..
Story first published:Wednesday, October 18, 2017, 9:58 [IST]
Desktop Bottom Promotion