త్వరగా, ఎఫెక్టివ్ గా బరువు తగ్గడానికి ఫుడ్ కాంబినేషన్

By: Mallikarjuna
Subscribe to Boldsky

బరువు పెరుగుట మరియు బరువు కోల్పోవడం అనేవి నిర్ణయించడంలో ఆహారంను ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. కొన్ని ఆహారాలు బరువు పెరుగుటకు,కొన్ని ఆహారాలు బరువు కోల్పోవటానికి సహాయపడతాయి. బరువు కంట్రోల్లో ఉండాలంటే డైట్ ను బ్యాలెన్స్ చేయాలి. అంతే కాదు డైట్ వల్ల శరీర ఆరోగ్యంగా కూడా మెరుగ్గా ఉంటుంది

బరువు తగ్గాలంటే సరైన ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. బరువు తగ్గడం ఎప్పుడూ ఒక టాస్క్ వంటిది. బరువు తగ్గే క్రమంలో కొన్ని ఆహారాలను ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటారు. అయితే ఈ ఆహారాలను ఒకటిగా తీసుకోవడం కంటే జంటగా అంటే మరో ఇతర ఆహారంతో కలిపి తీసుకోవడం వల్ల బరువు తగ్గడం మరింత సులభం అవుతుంది

బీర్ తో పాటు తినేటటువంటి ఫుడ్ కాంబినేషన్

మనకు తెలియకుడా తినే కొన్ని చెత్త కాంబినేషన్ ఫుడ్స్ తినడం వల్ల పొట్ట కొవ్వు చేరుతుంది. కడుపుబ్బరంగా, గ్యాసీగా ఉండటమే కాదు, డీహైడ్రేషన్ కు కారణం అవుతుంది. రోజంతా అలసటగా అనిపిస్తుంది.

ఇలా ఎక్కువ రోజులు ఉంటే జీర్ణ వ్యవస్థకు, మరియు ఆరోగ్యానికి ఏమౌతుంది. ఆరోగ్యం ఇంకొంచెం ఎక్కువగా దెబ్బతింటుంది. బరువు పెరిగిపోతారు. కాబట్టి వీటికి బదులుగా మంచి ఆహారాలను తీసుకోవడంమంచిది.

మనం అంతర్గతంగా తీసుకునే ఆహారాలు జీర్ణ వ్యవస్థను హెల్తీగా మార్చుతాయి. ఇవి జీర్ణవ్యవస్థకు మాత్రమే కాదు, ప్రేగుల ఆరోగ్యాన్ని కూడా హెల్తీగా ఉంచుతాయి. దాంతో మనల్నీ ఆరోగ్యంగాన్ని మరియు స్ట్రాంగ్ గా మార్చుతాయి

బాన పొట్టను తగ్గించే 20 సూపర్ ఫుడ్స్...!

ఇక్కడ మీకోసం అటువంటి హెల్తీ అండ్ స్ట్రాంగ్ గా మార్చగలిగే ఫుడ్ కాంబినేషన్స్ కొన్ని ఉన్నాయి. ఆలస్యం చేయకుండా వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు.

1. గుడ్డు మరియు వెజిటేబుల్స్ :

1. గుడ్డు మరియు వెజిటేబుల్స్ :

ఈ రెండు ఆహారాలను కలిపి తీసుకోవడం వల్ల ఇటు ఆరోగ్యాన్ని సమతుల్యం చేయడం మాత్రమే కాదు,ఎఫెక్టివ్ గా బరువు కూడా తగ్గిస్తాయి. ఫ్రెష్ వెజిటేబుల్స్ లో పోషకాలు అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గించడానికి డబుల్ గా పనిచేస్తాయి.

2. చికెన్ మరియు రెడ్ పెప్పర్ :

2. చికెన్ మరియు రెడ్ పెప్పర్ :

రెడ్ పెప్పర్ లో ఎక్స్ ట్రా క్యాలరీలుంటాయి . మనం తినే ఆహారాలను ఎనర్జీగా మార్చడంలో ఇవి సహాయపడుతాయి. చికెన్ లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడుతాయి. బరువు తగ్గడానికి ఇవి ఒక బెస్ట్ పెయిరింగ్ ఫుడ్స్.

3. లెగ్యుమ్స్ అండ్ కార్న్ :

3. లెగ్యుమ్స్ అండ్ కార్న్ :

లెగ్యుమ్స్ ను వెయిట్ లాస్ డైట్ లో చేర్చుకోవడం మంచిదని కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడించారు. కార్న్ (మొక్క జొన్న)లో స్ట్రార్చ్ , కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అధికంగా ఉండటం వల్ల వ్యాధినిరోధకశక్తి పెంచుతుంది. ఇది హెల్తీ ఫిగర్ మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది.

4. గ్రీన్ టీ మరియు నిమ్మరసం :

4. గ్రీన్ టీ మరియు నిమ్మరసం :

గ్రీన్ టీలో పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటినే క్యాట్చిన్స్ అంటారు. నిమ్మ కాయలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్ ఫుడ్స్ కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేసి బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

5. సాల్మన్ మరియు ఆస్పారాగస్

5. సాల్మన్ మరియు ఆస్పారాగస్

సాల్మన్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఫైబర్ మరియు ప్రోటీన్స్ కూడా అధికంగా ఉండటం వల్ల శరీరంలో ఎక్సెస్ వాటర్ ను తగ్గించి, ఇటు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఎఫెక్టివ్ గా బరువు తగ్గిస్తాయి .

6. బాదం మరియు పెరుగు

6. బాదం మరియు పెరుగు

కొన్ని విటమిన్స్, ముఖ్యంగా ఎ, డి మరియు ఇలు ఫ్యాట్ శరీరంలో చేరకుండా నివారిస్తుంది. బాదంలో క్యాల్షియం, యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ ఇ ఎక్కువగా ఉండటం వల్ల శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, బరువు తగ్గిస్తాయి. పెరుగులో విటమిన్ డి అధికంగా ఉండటం వల్ల ఈ ఫుడ్ కాంబినేషన్స్ బరువు తగ్గడానికి గొప్పగా సహాయపడుతుంది.

7. అవొకాడో మరియు ఆకుకూరలు:

7. అవొకాడో మరియు ఆకుకూరలు:

ఆకుకూరలు మరియు అవొకాడోలో విటమిన్స్ మరియు మినిరల్స్ అధికంగా ఉంటాయి. అందువల్ల సలాడ్స్ లో చేర్చుకోవడం వల్ల మ్యాక్సిమమ్ హెల్త్ బెనిఫిట్స్ పొందుతారు. అలాగే బరువు తగ్గడానికి ఆకుకూరలతో పాటు, ఆలివ్ ఆయిల్ కూడా మంచి కాంబినేషన్.

8. తున మరియు అల్లం:

8. తున మరియు అల్లం:

చేపల్లో తున చేపల్లో ఓమేగా 3 ఫ్యాట్ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. అల్లం బౌల్ ఫంక్షన్ ను మెరుగుపరుస్తుంది. కడుపుబ్బరం తగ్గిస్తుంది. కాబట్టి, ఫ్రెష్ గా ఉన్న అల్లంతో తయారుచేసిన తున సలాడ్ ను తినడం మర్చిపోకండి.

9. నట్ బట్టర్ మరియు బనానా:

9. నట్ బట్టర్ మరియు బనానా:

ప్రోటీన్స్ అధికంగా ఉండే ఫుడ్స్ కాంబినేషన్ ఇవి. పోస్ట్ వర్కౌట్ తర్వాత వీటిని తీసుకోవడం మంచిది. ఈ కాంబినేషన్ ఫుడ్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.

10. పసుపు, బ్లాక్ పెప్పర్ :

10. పసుపు, బ్లాక్ పెప్పర్ :

పరిశోధనల ప్రకారం పసుపు, బ్లాక్ పెప్పర్ ను వివిధ రకాల వంటలో వాడటం వల్ల బయోఅవాల్యబులిటీని మెరుగుపరుస్తుంది.

English summary

Food Pairings That Will Help You Lose Weight

In this article, we have mentioned some of the best food pairings for weight loss. Read to know more about the healthy food pairings for weight loss.
Story first published: Saturday, November 4, 2017, 17:30 [IST]
Subscribe Newsletter