For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  వెయిట్ లాస్ కై ఏమాత్రం ఉపయోగపడని ఈ 11 వరస్ట్ మార్గాల గురించి బహుశా మీకు తెలిసుండకపోవచ్చు

  |

  ఈ రోజుల్లో అదనపు బరువును తగ్గించుకునేందుకు అనేక మార్గాల గురించి అన్వేషణ సాగిస్తున్నారు. డీటాక్స్ డైట్ దగ్గరనుంచి వెయిట్ లాస్ షేక్స్ వరకు అన్ని రకాల మార్గాలను ప్రయత్నిస్తున్నారు. డైటింగ్ సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వెయిట్ లాస్ కోసం ప్రయిత్నించే వారు మొదట డైటింగ్ నే ప్రారంభిస్తారు. అయితే, ఇక్కడ అసలు విషయం ఏంటంటే, బరువు తగ్గాలనుకునే వారు వేగవంతమైన ఫలితాలను పొందేందుకు అనేక పద్దతులను ఒకేసారి పాటించి చివరికి ఆశించిన ఫలితాలు రాకపోవటం చేత నిరుత్సాహపడతారు.

  ఫిట్ గా హెల్తీగా ఉండేందుకు న్యూట్రిషన్, కార్డియోవాస్క్యూలర్ వర్క్ అవుట్ అలాగే రెసిస్టెన్స్ ట్రైనింగ్ అనేవి అవసరపడతాయి. ఈ మూడు ముఖ్య అంశాలు బరువుని అదుపులో ఉంచేందుకు అమితంగా తోడ్పడతాయి. అయితే, బరువు తగ్గాలనుకునే చాలా మంది వీటిని పాటించరు. అందుకు బదులుగా, వెయిట్ లాస్ ప్రాసెస్ కి ఏమాత్రం సహకరించని మిగతా అంశాలపై దృష్టిపెట్టి వాటి ద్వారా బరువు తగ్గాలని ఆశిస్తారు.

  బరువు తగ్గేందుకు కనీసం ఏభై శాతం మంది డైటింగ్ పై ఎక్కువగా ఆధారపడతారు. దీని వలన ఏ మాత్రం ఉపయోగం లేకపోగా మరిన్ని ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయి.

  మీ వెయిట్ లాస్ స్ట్రేటజీస్ అనేవి సరైనవి కానప్పుడు, అదనపు బరువు తగ్గేందుకు మీకు కొన్ని నెలల సమయం పట్టవచ్చు. కొన్ని సందర్భాలలో, కొన్ని సంవత్సరాలు కూడా పట్టవచ్చు.

  కాబట్టి, వెయిట్ లాస్ కై ఏ మాత్రం ఉపయోగపడని ఈ వరస్ట్ మార్గాల గురించి తెలుసుకుని సరైన పద్దతులను పాటించి బరువు తగ్గడానికి ప్రయత్నించండి.

  1. ఫ్యాడ్ డైట్స్ పై ఆధారపడటం:

  1. ఫ్యాడ్ డైట్స్ పై ఆధారపడటం:

  వెయిట్ లాస్ కోసం ఒకటి లేదా రెండు ఆహారాలపైనే ఆధారపడటం వలన మీకు ఏ మాత్రం ఫలితం దక్కదు. సెవెన్ వీక్స్ వరకు షేక్స్ ని తీసుకోవడం వంటి క్విక్ ఫిక్సెస్ అనేవి వెయిట్ లాస్ విషయంలో ఏ మాత్రం ఉపయోగకరంగా ఉండవు. హోంమేడ్ ప్రోటీన్ స్మూతీని ఒక మీల్ కి ప్రత్యామ్నాయంగా తీసుకోండి. అలాగే డైట్ లోంచి కార్బ్స్ ని కట్ చేయడం మానుకోండి.

  2. మీల్స్ ని స్కిప్ చేయడం:

  2. మీల్స్ ని స్కిప్ చేయడం:

  వెయిట్ లాస్ కై ప్రయత్నం సాగిస్తున్నప్పుడు భోజనాన్ని స్కిప్ చేయకూడదు. మీల్స్ ని స్కిప్ చేయడం వలన శరీరానికి అవసరమైన పోషకాలు తగినంత అందవు. శరీరం ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండేందుకు పోషకాలనేవి అవసరం. వీటి లోపం ఏర్పడడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి, మీల్స్ ని స్కిప్ చేయడం ద్వారా వెయిట్ లాస్ అనేది జరుగుతుందని భావించకూడదు.

  3. అతిగా హై ఇంటెన్సిటీ ఏక్సర్సైజేస్ ని చేయడం:

  3. అతిగా హై ఇంటెన్సిటీ ఏక్సర్సైజేస్ ని చేయడం:

  హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజులను చేయడం మీకిష్టమైనా వాటిని చేసేటప్పుడు కాస్తంత జాగ్రత్తని పాటించండి. హై ఇంటెన్సిటీ వర్కవుట్స్ ని చేయడానికి ఎంతో శక్తితో పాటు బలం అవసరపడుతుంది. వర్కవుట్ చేయడానికి మీ శరీరంలో తగినంత ఫ్యూయల్ లేకపోతే వర్కవుట్స్ బెడిసికొట్టి మరింత ఫ్యాట్ శరీరంలో స్టోర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే, ప్రొటీన్ల లోపం తలెత్తుతుంది.

  4. జ్యూస్ క్లీన్స్ డైట్

  4. జ్యూస్ క్లీన్స్ డైట్

  వెయిట్ లాస్ కోసం జ్యూస్ క్లీన్స్ డైట్ ను ప్రయత్నించడమనేది కూడా ఏ మాత్రం ఉపయోగకరంగా ఉండదు. జ్యూసులలో విటమిన్స్ తో పాటు మినరల్స్ లభిస్తాయి. అయితే, కండరాలను బిల్డ్ చేసే ప్రోటీన్స్ మాత్రం అస్సలు లభించవు. కాబట్టి, మీరు ఫ్యాట్ ను కోల్పోరు. అందుకు బదులుగా శరీరంలో స్టోర్ అయి ఉన్న మజిల్ మాస్ ని కోల్పోతారు. ఇది కాస్తంత షాక్ కి గురిచేసే వాస్తవమే కదా?

   5. ఫ్యాట్ ఫ్రీ ఫుడ్స్ ని తీసుకోవడం:

  5. ఫ్యాట్ ఫ్రీ ఫుడ్స్ ని తీసుకోవడం:

  వెయిట్ లాస్ డైట్ లో భాగంగా మీరు ఫ్యాట్ ఫ్రీ ఫుడ్స్ నే తీసుకుంటున్నప్పుడు మీరు వెయిట్ లాస్ విషయంలో అతిపెద్ద పొరపాటు చేస్తున్నట్టే అర్థం. ఆలివ్ ఆయిల్, అవొకాడో, ఎగ్స్ అలాగే ఇతర ఫుడ్స్ లో హెల్తీ ఫ్యాట్స్ లభిస్తాయి. ఇవన్నీ శరీరానికి అవసరమైన ఫ్యాట్స్. ఈ ఫ్యాట్స్ ని తగినంత తీసుకోకపోవటం వలన మానసిక అలసట, పేల్ స్కిన్ అలాగే హంగర్ క్రేవింగ్స్ వంటి సమస్యలు తలెత్తుతాయి.

  6. కార్బోహైడ్రేట్స్ ను తీసుకోకపోవటం:

  6. కార్బోహైడ్రేట్స్ ను తీసుకోకపోవటం:

  కార్బోహైడ్రేట్స్ అధికంగా కలిగిన ఫుడ్స్ ను మీరు పూర్తిగా ఎలిమినేట్ చేస్తున్నట్లైతే, వెయిట్ లాస్ కోసం మీరు వరస్ట్ మార్గాన్ని అనుసరిస్తున్నారని అర్థం. శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమయ్యే వైటల్ న్యూట్రియెంట్స్ అనేవి కార్బోహైడ్రేట్స్ నుంచి కూడా లభిస్తాయి. వీటిని మీరు ఎలిమినేట్ చేయడం ద్వారా హంగర్ ప్యాంగ్స్ పెరుగుతాయి. తద్వారా, మీకు ఆకలి రెట్టింపై మరింత ఎక్కువగా ఆహారాన్ని తీసుకుంటారు.

  7. ప్రోటీన్ ఫుడ్స్ ని మాత్రమే తీసుకోవడం:

  7. ప్రోటీన్ ఫుడ్స్ ని మాత్రమే తీసుకోవడం:

  వాటర్ వెయిట్ ని తగ్గించుకోవడానికి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ కొంతకాలం వరకు సహకరించవచ్చు. అయితే, దీర్ఘకాలం పాటు ఇవి మీకు ఉపయోగకరంగా ఉండవు. బరువు తగ్గేందుకు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ని మాత్రమే అధికంగా తీసుకోవడం వలన ఏమాత్రం ఉపయోగం ఉండదు. దీనివలన మీకు అమితంగా తినే అలవాటు పెరుగుతుంది. ఇంతకు ముందు కంటే హెవీగా ఫీల్ అవుతారు.

  8. ఖాళీకడుపుతో ఎక్సర్సైజ్ చేయడం:

  8. ఖాళీకడుపుతో ఎక్సర్సైజ్ చేయడం:

  జిమ్ లో కసరత్తులు ప్రారంభించే ముందు కొద్దిగానైనా ఆహారాన్ని తీసుకోవాలి. లేదంటే ఫ్యాట్ టిష్యూస్ ని కోల్పోవడానికి బదులు మజిల్ మాస్ ని కోల్పోతారు. జిమ్ కి వెళ్లేముందు శరీరాన్ని ఫ్యూయల్ చేసుకోవడం అవసరం. తద్వారా, అదనపు బరువును తగ్గించుకునే శక్తి మీకు లభిస్తుంది.

  9. ఒమేగా-3 ఫ్యాట్స్ ను తీసుకోకపోవటం:

  9. ఒమేగా-3 ఫ్యాట్స్ ను తీసుకోకపోవటం:

  వాల్నట్స్, చియా సీస్ అలాగే సాల్మన్ లో లభించే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి వెయిట్ లాస్ లో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఈ ఆహారాలను తీసుకోవడం ద్వారా ఆకలితీరిన భావన కలుగుతుంది. శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది అలాగే బ్లడ్ షుగర్ స్థాయి కూడా తగ్గుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఆరోగ్యకరమైన ఫ్యాట్స్. వీటివలన శరీరానికి ఏ విధంగానూ కూడా హాని కలగదు.

  10. సరైన యోగర్ట్ ని ఎంచుకోకపోవటం:

  10. సరైన యోగర్ట్ ని ఎంచుకోకపోవటం:

  ప్రోబయాటిక్స్ తో నిండి ఉన్న యోగర్ట్ అనేది అద్భుతమైన డైరీ ప్రాడక్ట్. ఇందులో వెయిట్ లాస్ కి అవసరమైన న్యూట్రియెంట్స్ లభిస్తాయి. అయితే, ఫ్లేవర్ కలిగిన యోగర్ట్ ని ఎంచుకోవడం ద్వారా మీకు ఆశించిన ఫలితం లభించదు. ఎందుకంటే, వీటిలో యాడెడ్ షుగర్స్ ఉంటాయి. ఇవన్నీ, శరీరంలో షుగర్ లెవెల్స్ ని పెంచుతాయి. సహజమైన యోగర్ట్ నే మీరు తీసుకోవాలి.

  11. సరైన సలాడ్స్ ని తీసుకోకపోవడం:

  11. సరైన సలాడ్స్ ని తీసుకోకపోవడం:

  వెయిట్ లాస్ రొటీన్ లో ఒక కప్పుడు సలాడ్ ని తీసుకోవడం మంచిదే. అయితే, వాటిలో ష్రెడ్డెడ్ ఛీజ్ ని అలాగే సలాడ్ డ్రెస్సింగ్ ని జోడించడం వలన వెయిట్ లాస్ గోల్ దారితప్పుతుంది. అందుకు బదులుగా, నట్స్, ఆలివ్ ఆయిల్ లేదా అవొకాడోని సలాడ్ పై టాపింగ్ గా వాడితే ప్రయోజనం లభిస్తుంది.

  ఈ ఆర్టికల్ ని షేర్ చేయండి!

  English summary

  11 Worst Ways To Lose Weight You Probably Didn't Know

  11 Worst Ways To Lose Weight You Probably Didn't Know,Dieting is the worst weight loss method that half of the percentage of people do it to lose weight. Know about the worst ways to lose weight that will benefit you.
  Story first published: Wednesday, February 14, 2018, 19:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more