Latest Updates
-
ఎండల దెబ్బకు పీసీఓఎస్, పీరియడ్స్ సమస్యలు పెరుగుతున్నాయా? ఈ జాగ్రత్తలు మీకోసమే! -
ఎండల మంటల్లో పెళ్లిళ్లు.. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఈ మార్పులు తప్పనిసరి! -
జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే వడదెబ్బ తగలదా? -
సూరత్‌లో దారుణం: భార్యను సిమెంట్ బాక్సులో దాచిన భర్త.. బంధాల్లో ఈ 'రెడ్ ఫ్లాగ్స్' కనిపిస్తే జాగ్రత్త! -
షుగర్ ఫ్రీ పుదీనా లస్సీ.. వేసవిలో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం! -
వేసవి తాపాన్ని తగ్గించే సత్తు లడ్డూ.. ఈ ఎండలకు బెస్ట్ స్వీట్ ఇదే! -
NEET UG 2026 అడ్మిట్ కార్డులు వచ్చేసాయి.. పరీక్షలో విజయం సాధించాలంటే ఈ చివరి నిమిషం జాగ్రత్తలు తప్పనిసరి! -
పాలు వద్దు, పంచదార వద్దు.. పటిక బెల్లంతో 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ రవ్వ లడ్డు! -
ఏప్రిల్ 27 రాజయోగం: ఈ రాశుల వారికి ధన యోగం.. ఇక తిరుగులేదు! -
ఈ చేప మగాళ్లకు సర్వరోగ నివారిణి..ఒకేసారి బలం,ఓపిక వచ్చేస్తుంది!
అమ్మాయి ఒళ్లు ఒంపులు తిరగాలన్నా.. అబ్బాయి బాడీ అందంగా మారాలన్నా ఆ భంగిమల్లో వర్కవుట్స్ బెస్ట్
ఆనందకరమైన సందర్భాల్లో మాత్రమే నలుగురు కలిసి చిందేయడం సహజం. కానీ ఇప్పుడు నిత్యం డ్యాన్స్ మంత్రాన్ని జపిస్తోంది యువత. అదే మంటే అదొక ఫిట్‌నెస్ మంత్రగా చెబుతున్నారు.
ఆనందకరమైన సందర్భాల్లో మాత్రమే నలుగురు కలిసి చిందేయడం సహజం. కానీ ఇప్పుడు నిత్యం డ్యాన్స్ మంత్రాన్ని జపిస్తోంది యువత. అదే మంటే అదొక ఫిట్‌నెస్ మంత్రగా చెబుతున్నారు. ఇల్లు, కార్యాలయం..పబ్‌లలో సైతం నృత్యంతో కసరత్తు చేస్తున్నారు. యోగా, జిమ్, జాగింగ్, వాకింగ్ లాగే ఇప్పుడు నృత్యం కూడా వ్యాయామ క్రియగా మారిపోయింది.

అందమైన శరీరాకృతి సొంతం
అబ్బాయిలు కండలు పెంచడానికి, అమ్మాయిలు అందమైన శరీరాకృతిని సొంతం చేసుకునేందుకు చాలా వ్యాయామశాలలున్నాయి. ఎన్నో వ్యాయామ పద్ధతులూ ఉన్నాయి. కానీ జిమ్‌కెళ్లి బరు వులు ఎత్తుతూ, అద్దంలో పదే పదే కండలు చూసుకుంటూ చేయ డం బోరింగ్‌గా ఫీలయ్యే వారు...! పార్కులో రోజూ ఏం నడుస్తాం! అను కునేవారికి ఇప్పుడు డ్యాన్స్ ఫిట్‌నెస్ ఒక మంచి అవకాశంగా కనప డుతోంది.

ఎక్కువగా డ్యాన్స్ వ్యాయామం కోరుకుంటారు
వ్యాయామం చేయాలనుకునేవారు, డ్యాన్స్‌ను ఇష్టపడేవారు ఎక్కువగా డ్యాన్స్ వ్యాయామాన్ని కోరుకుంటున్నారు. వాస్తవానికి ఈ పద్ధతి వ్యాయామం ఆరేళ్ల నుంచి పరిచయమైనా, ఇటీవల నగర యువత నోళ్లలో నానుతోం ది. కార్పొరేట్ ఉద్యోగులు, యువత, కుర్ర కారు డ్యాన్స్ వర్కవుట్లపై మక్కువ చూపు తున్నారు.

ఉల్లాసంగా..
నలుగురితో కలిసి డ్యాన్స్ చేయడం వల్ల, సరదాగానూ, ఉల్లాసంగానూ ఉండటంతో సాధారణ వ్యాయా మాన్ని ఇష్టపడనివారు సైతం, బృంద నృత్యవ్యాయామంపై ఆసక్తి చూపుతున్నారు.

ఇది సరైన వ్యాయామం
బాలీఫిట్‌నెస్, బోక్వా, మసాలా భాంగ్రా, బూట్ క్యాంప్, క్రాస్‌ఫిట్, జుంబా, ఎరోబిక్స్, సల్సా వంటి నృత్యరీతుల్ని ముఖ్యంగా ఫిట్‌నెస్ వర్కవుట్లుగా చేస్తున్నారు. వీటిలో ఒక్కో నృత్యం ఒక్కో రకంగా ఉంటుంది. పంజాబీ జానపద నృత్యం మసాలా భాంగ్రా. అధికబరువు తగ్గేందుకు, శరీరంలో ఎక్కువ కేలరీలు ఖర్చు అయేందుకు ఇది సరైన వ్యాయామంగా చెబుతున్నారు ఫిట్‌నెస్ నిపుణులు.

దక్షిణాఫ్రికా నృత్య భంగిమలు ఉంటాయి
శరీరాన్ని ఎల్, కే, ఓ ఆకారాలుగా వొంచుతూ చేసే వ్యాయామం బోక్వా. దీనిలో హోరెత్తే సంగీతంతోపాటు, దక్షిణాఫ్రికా నృత్య భంగిమలు ఉంటాయి. శరీర భాగాల్లో అసహజంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించేందుకు బోక్వా ఉపకరిస్తుంది. వ్యాయామం శరీర, మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఆ వ్యాయామ శిక్షణ సరైన నిపుణుల వద్ద తీసుకోవాలి. చాలా ఏళ్ల కిందటే ఈ ట్రెండ్ మొదలైనా కుర్రకారు నోళ్లలో ఎక్కువగా నానుతోంది మాత్రం ఈమధ్య కాలంలోనే.

ఏరోబిక్స్
ఏరోబిక్స్ అంటేనే సంగీతానికి అనుగుణంగా స్టెప్పులేయడం. బృంద నృత్యంలో వేగం పెంచి బీట్ పర్‌మినిట్ 135 నుంచి 150 వరకు ఉండేలా నృత్యరీతులు రూపొందిస్తారు.

జుంబా
మెరుంగే, సాల్సా, కుంభియా, రెగెట్టా అనే విభాగాలుంటాయి. ఈ స్టెప్పులనే మార్చి 75శాతం లాటిన్, 25శాతం ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఉండేలా వ్యాయామాలు రూపొందిస్తారు. ఇక బోక్వా అంటే శరీరాన్ని ఎల్, కే, ఓ, జే ఆకారాల్లో తిప్పుతూ చేసే వ్యాయామం. హోరెత్తే సంగీతం, దక్షిణాఫ్రికా స్టెప్పులు అదనం.

బాలీఫిట్‌నెస్
బాలీవుడ్ సినిమా పాటల్లోని డ్యాన్స్‌లనే మార్పులు చేసి ఫిట్‌నెస్ కోర్సుగా రూపొందిస్తారు. కండరాల పటుత్వం కోసం ఎక్కువగా ఈ స్టెప్పులు రూపొందిస్తారు.

క్రాస్‌ఫిట్
భారీ బరువులు ఎత్తడం క్రాస్‌ఫిట్ అసలు ఉద్దేశం. బృందం నృత్యంలో తేలికపాటి బరువులు ఎత్తిస్తూ ఫంక్షనల్ ట్రైనింగ్ వ్యాయామాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.

ఆక్వా యోగా
బృందంగా ఏర్పడి నీటిలో చేసే వ్యాయామం. యోగా భంగిమలకుతోడు సంగీతం జతగా చేర్చుతారు. కీళ్లు, మోకాలు నొప్పులకు ఉపశమనం.

మసాలా భాంగ్రా
ఒక్కో వర్కవుట్‌కి 500 కేలరీలు కరిగించగల పంజాబీ జానపద నృత్యం ఇది. కొద్దిపాటి మార్పులతో బరువు తగ్గించి, చక్కటి శరీరాకృతి తెచ్చే వర్కవుట్‌గా మార్చారు.

బూట్‌క్యాంప్
ఇది సైన్యం చేసే వ్యాయామం. దీనికి సంగీతం జోడించి, కసరత్తులను తేలికగా మలిచి ఇంకాస్త వేగం పెంచుతారు.
అలాగే ఆ వర్కవుట్లు చేయిస్తూనే శరీర పటుత్వం కోసం స్క్వాట్స్, కూర్చోవడం.. లేవడం.. మాడిఫై పుషప్‌లు, బైసెప్స్, సోల్, ట్రైసెప్‌లాంటి కండిషనింగ్ వ్యాయామాలు చేయిస్తారు.

కండరాలు గట్టిపడతాయి
వీటి వల్ల కండరాలు గట్టిపడతాయి.. బరువు, పొట్ట తగ్గుతుంది. గుండెకు బలం. అత్యధికంగా ఉన్న కొవ్వు కరుగుతుంది. తొడలు, శరీరాకృతి మెరుగు పడుతుంది. చెప్పుకుంటూ పోతే ఈ బృంద నృత్య వ్యాయామం ఇతర ఏ వర్కవుట్లకూ తీసిపోదు. అన్నింటికన్నా ముఖ్యం ఇదో సరదా వ్యాపకం. ఒకర్ని చూసి ఇంకొకరు ఉత్సాహం పొందుతారు.

సరైన పద్ధతి
చేసే వ్యాయామం ఎలాంటిదైనా సరైన పద్ధతి పాటించకపోతే కొత్త సమస్యలు ఎదురవుతాయన్నది నిపుణులు చెప్పే మాట. వ్యాయామ నిపుణుడు, సీపీఆర్ సర్టిఫికేషన్ కోర్సు చేసినవారి దగ్గరే శిక్షణ పొందాలి. అనుకోని ప్రమాదాల బారిన పడకుండా కచ్చితమైన నియమాలు రూపొందిచగలరు.

కండీషనింగ్ వ్యాయామాలు చేయాలి
ముందు బేసిక్ స్ట్రెంగ్తెనింగ్, చివర్లో కండీషనింగ్ వ్యాయామాలు చేయాలి. దీంతో కీళ్లు, కండరాలు, ఎముకలపై దుష్ప్రభావం తగ్గుతుంది. భీకరంగా కసరత్తులు చేస్తే సరిపోదు. మన లక్ష్యానికి అనుగుణంగా కచ్చితమైన ఆహార నియమాలు పాటించాలి. ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే ముందే శిక్షకుడికి తెలియజెప్పాలి. దానికి అనుగుణంగా కోర్సులో మార్పులు చేస్తారు. వ్యాయామానికి అనుగుణంగా దుస్తులు, షూలు ధరించాలి.



Click it and Unblock the Notifications