For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  కర్పూరం మరియు బేబీ ఆయిల్ మిశ్రమం పొట్టచుట్టూ చేరిన కొవ్వును తగ్గించడంలో చేసే సహాయం!

  |

  ఒక ముఖ్యమైన కార్యక్రమం కోసం ప్రణాళిక చేయబడింది. కానీ మీరు మీ దుస్తుల అసౌకర్యం కారణంగా ఆ కార్యక్రమం పట్ల ఆసక్తిని కూడా ప్రదర్శించలేకున్నారు. నలుగురిని ఆకట్టుకునేలా కనపడాలని మీ భావన. కానీ మీ ఊబకాయం మీకు సహకరించడం లేదు. ఇటువంటి పరిస్థితిని మీరు తరచుగా ఎదుర్కొంటున్న ఎడల, తక్షణమే వీడ్కోలు పలికేలా చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తుంటారు. అవునా?

  కొంచం పొట్ట ఉండడం, సాధారణంగానే భావిస్తారు అనేకులు. సన్నని అమ్మాయిలకు కూడా పొట్ట ఉండడం జరుగుతుంటుంది. ఇది మన శరీరంలోని పునరుత్పత్తి అవయవాలను రక్షిస్తుందని అనేకమందికి తెలీదు. భవిష్యత్తులో మాతృత్వం కోసం సిద్ధమవుతోంది. కానీ, ఆ పొట్ట అధికమైతే, క్రమంగా జీవక్రియలు మందగించడం, హార్మోనుల అసమతౌల్యం వంటి వేరే ఇతరత్రా సమస్యలకు సైతం దారితీస్తుంది. కానీ, ఉదరం బరువు తగ్గడానికి, ఆహరం మానివేయడం మంచి పద్దతి కాదు. సరైన ఆహార ప్రణాళిక, వ్యాయామం తప్పనిసరిగా అనుసరించాలని మరువకండి.

  Baby Oil And Camphor To Reduce Belly Fat

  ఈ వ్యాసం కొవ్వు తొలగించడంలో సహాయపడడమే కాకుండా, కండరాలనను బలోపేతం చేయడంలో కూడా సహాయం చేస్తుంది. అంతేకాకుండా, మీ ఆరోగ్యకరమైన శరీరాకృతి కోసం, చెడు అలవాట్లను (మద్యపానం, ధూమపానం, ఇతరత్రా స్టెరాయిడ్లు వంటివి) వదులుకోవలసి ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా మీరు అవలంభించే ఆహారప్రణాళిక మరియు వ్యాయామం ప్రధానంగా సహాయపడుతుంది.

  మీరు మీ పొట్టకొవ్వును తగ్గించుకోడానికి సూచించబడిన మాజికల్ రెసిపీ గురించి, తెలుసుకోవాలనుకుంటే, ఈ వ్యాసం చూడండి:

  కర్పూరం మరియు బేబీ ఆయిల్ తీసుకుని ఈ రెండు పదార్ధాలను కలపండి. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఆ మిశ్రమాన్ని అలాగే వదిలివేయండి. అది మసాజుకు సిద్ధంగా ఉందని ధృవీకరించుకున్న తర్వాత, సమస్యాత్మక ప్రాంతంనందు, ఆ మిశ్రమాన్ని వర్తించండి.

  Baby Oil And Camphor To Reduce Belly Fat

  కర్పూరం సహజ సిద్దమైనపదార్ధం, దీనిలోని సహజమైన నూనెలు, కర్పూరం చెట్టు కొమ్మల నుండి తీసుకోబడుతుంది. ఎక్కువగా వైద్య ప్రయోజనాలకై దీనిని ఉపయోగించడం జరుగుతుంది. ఇది ప్రధానంగా క్రిమినాశక ప్రభావాలను కలిగి ఉంటుంది, అంతేకాకుండా అనాల్జేసిక్ మరియు యాంటీ-స్పాస్మ్ ప్రభావాన్ని అందిస్తుంది. అలాగే, మీ చర్మానికి కూడా మంచిదిగా సూచించబడుతుంది.

  ఊబకాయం తగ్గించడంలో కర్పూరం నూనె ఎంతగానో సహాయపడుతుంది. మహిళల్లో పిరుదులు మరియు ఉదర భాగాన కొవ్వు నిల్వలు పేరుకునిపోయిన కారణాన, రక్తసరఫరాకు ప్రధాన ఆటంకంగా తయారవుతుంది. కావున, ఆ భాగాలలోని రక్తనాళాల పనిని బలోపేతం చేయడానికి కర్పూరం కూడిన ఈమిశ్రమంతో మసాజ్ చేయడం ద్వారా అద్బుత ఫలితాలను పొందవచ్చునని చెప్పబడింది.

  Baby Oil And Camphor To Reduce Belly Fat

  కర్పూరం నూనె మరియు సముద్రపు ఉప్పు మిశ్రమాన్ని ఒక స్క్రబ్ వలె వినియోగించడం ద్వారా, రక్త ప్రసరణను క్రియాశీలపరచడంలో ఎంతగానో సహాయపడుతుందని చెప్పబడింది. మీ క్రీమ్ లో కొన్ని చుక్కల కర్పూరం నూనెను జోడించి, ప్రభావిత ప్రాంతంలో మసాజ్ చేయడం ద్వారా కొవ్వు తగ్గడంలో ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుందని చెప్పబడింది.

  పొట్టచుట్టూ పేరుకున్న కొవ్వును తాగించడంలో ప్రభావవంతంగా పనిచేసే కర్పూరం నూనెను తరచుగా అనుసరించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందగలరు. కానీ, దీనిని అనుసరించే ముందు రియాక్షన్స్ తనిఖీ చేసుకునే క్రమంలో భాగంగా చేతిమీద కానీ, తొడల మీద కానీ అప్లై చేసి పరీక్షించుకున్న తర్వాతనే ఈ పద్దతిని పాటించండి. ఉత్తమ ప్రయోజనాల కోసం వారంలో కనీసం రెండుమార్లు అనుసరించండి.

  Baby Oil And Camphor To Reduce Belly Fat

  ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, వ్యాయామ, లైంగిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

  English summary

  Baby Oil And Camphor To Reduce Belly Fat

  Baby Oil And Camphor To Reduce Belly Fat, Read more to know about,
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more