Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
నీటిలో వ్యాయామాలు: అద్భుతమైన 10 ప్రయోజనాలు
పూల్ ఎక్సర్‌సైజులు లేదా జలక్రీడలు ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. జిమ్ లో చేసే రొటీన్ వ్యాయామాలు ఇష్టపడనివారికి ఇలాంటి జల క్రీడలు నూతనోత్సాహాన్ని తేగలవు. పూల్ ఎక్స్‌ర్‌సైజులు
పూల్ ఎక్సర్‌సైజులు లేదా జలక్రీడలు ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. జిమ్ లో చేసే రొటీన్ వ్యాయామాలు ఇష్టపడనివారికి ఇలాంటి జల క్రీడలు నూతనోత్సాహాన్ని తేగలవు. పూల్ ఎక్స్‌ర్‌సైజులు చవకలో అయిపోతాయి. అంతే కాకుండా మీ భాగస్వామితో కలిసి చేయవచ్చు లేదంటే మీ చిలిపి స్నేహితులతో కలిసి ఎంజాయ్‌చేయొచ్చు.

ఏ వయసు వారికైనా ఈ వ్యాయామాలు సరిపోతాయి. చిన్న పిల్లల దగ్గరి నుంచి ముసలివారి దాకా అందరూ వీటిని చేయొచ్చు. దీనికంటూ ప్రత్యేకంగా ప్రయివేట్ పూల్ ఉండాల్సిన అవసరం లేదు. ఈత వచ్చి ఉంటే చాలు.
స్విమ్మింగ్ పూల్‌లో నీటి వ్యాయామాలతో ఎలాంటి ప్రయోజనాలుంటాయో తెలుసుకుందాం...

1. బరువు తగ్గిస్తుంది
అధిక బరువు ఇప్పుడో సమస్య. అందరికీ బరువు తగ్గాలని ఆశగా ఉంటుంది. నేలపైన చేసే వ్యాయామాల కంటే నీటిలో చేసే వాటితోనే అత్యంత తొందరగా బరువు తగ్గగలం. నీటి శక్తిని తట్టుకొని కార్డియో లేదా మిక్స్‌డ్ వర్కవుట్స్ చేయడంలో త్వరితగతి ఫలితాలు కనబడతాయి. శరీరంలో ఒక్క భాగానికి వ్యాయామం చేసినా ఆ ప్రభావం మొత్తం కనిపిస్తుంది. 30 నుంచి 60 నిమిషాలపాటు నీటిలో వ్యాయామంచేస్తే అద్భుతమైన ఫలితాలు పొందొచ్చు.

2. కీళ్ల ఆరోగ్యం మెరుగవుతుంది
కండరాలు, కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. నీటికి తేలియాడే శక్తి ఉండడం మూలాన అవి కండరాలపై ఎక్కువగా ఒత్తిడి తీసుకురావు. నీళ్లలో వ్యాయామం చేశాక తక్కువగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. నేలపైన చేసే వ్యాయామంలో ఎన్ని క్యాలరీలు కరిగిస్తామో అన్నే క్యాలరీలు ఇక్కడా కరుగుతాయి. క్రమంగా ఈత కొడితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

3. సాగిపోయే గుణం
నీటిలో ఈత కొట్టాక శరీరం చాలా తేలికగా, హాయిగా అనిపిస్తుంది. నేలపైన వ్యాయామం చేసేటప్పుడు ఎక్కడైనా కింద పడతామేమో అనే భయం ఇక్కడ ఉండదు. వీపు, వెనుక భాగాలకు ఫ్లెక్సిబిలిటీ పెరిగి ఫిట్‌నెస్ మెరుగవుతుంది.

4. బీపీ తగ్గుతుంది.
నీటిలో ఈత కొట్టడం వల్ల రక్త సరఫరా బాగా జరుగుతుంది. ఇది బీపీ తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. హైపర్ టెన్షన్ తగ్గించేసి జీవితకాలాన్ని పొడిగించగలుగుతుంది ఈత.

5. కండరాల శక్తిని పెంచుతుంది
శరీరానికి ఈవెన్ టోన్‌తో పాటు కండరాల పటుత్వం పెరుగుతుంది. తరచూ స్విమ్మింగ్ చేయడం వల్లే ప్రపంచ శ్రేణి ఈతగాళ్లకు టోన్డ్ బైసెప్స్ ఉంటాయి. నీటి ఉదృతికి వ్యతిరేకంగా వ్యాయామం చేస్తాం కాబట్టి కండరాల పటుత్వం మెరుగవుతుంది.

6. ఒత్తిడి మాయం
మీ ప్రియమైనవారితో కలిసి ఈత కొలనులో దిగి సరదాగా గడిపే అవకాశం దొరుకుతుంది. కాబట్టి చాలా రిలాక్స్డ్‌గా అనిపిస్తుంది. ఆలోచనలు కూడా బాగా మెరుగై ఒత్తిడి మటుమాయమవుతుంది. ఎండార్ఫిన్లు ఉత్పత్తి అయి మూడ్‌ను బాగా చేస్తుంది.

7. వ్యాయామ పరికరాలు అవసరం రాదు
బరువు తగ్గాలన్నా, కండరాలు పెంచాలన్నా నీటి శక్తి ఒక్కటి చాలు. ప్రత్యేకంగా పరికరాలు అవసరం లేదు. సాధారణ వ్యాయామాల్లో రకరకాల పరికరాల అవసరం ఏర్పడుతుంది. నీటిలో ఈత కొట్టడానికి ఇవేమీ అక్కర్లేదు.

8. చల్లబరిచే వ్యాయామాలు
వేసవి కాలంలో నీటి వ్యాయామాలు చాలా సాంత్వన చేకూరుస్తాయి. నీరు కూడా శరీరాన్ని చల్లగా ఉంచగలదు. ఎండార్ఫిన్లు విడుదలై లైట్ ఫీలింగ్ తీసుకొస్తుంది.

9. అన్ని వయసుల వారికీ
నేలపైన చేసే వ్యాయామాలతో పోలిస్తే నీటిలో చేసేవే సులభంగా ఉంటాయి. అదే ఫలితాన్ని ఇవ్వడంతో పాటు తక్కువ రిస్క్ ఉంటుంది. అన్ని వయసులవారికీ అనూకూలంగా ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలిదాకా ఎవరైనా ఈత కొట్టేయచ్చు. సహజసిద్ధమైన వ్యాయామం ఈత. కండరాలు, కీళ్లు ఒత్తిడికి గురికాకుండా నీరు చేయగలదు.

10. ఓరిమి తీసుకొస్తుంది
ఓర్పు లేదా ఓరిమి తీసుకురావడంలో నీటి వ్యాయామానికి మించింది లేదు. దీంతోపాటు కండరాల పటుత్వమూ పెరుగుతుంది.
ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? మంచి స్విమ్ సూట్ కొనిపెట్టుకోండి. వేసవి కాలంలో వచ్చేస్తుంది. ఈత కొట్టడం వల్ల అన్ని రకాల ప్రయోజనాలు పొందే పనిలో పడండి.



Click it and Unblock the Notifications
