For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్రీన్ టీ మీ బరువును తగ్గించడానికి ఏ విధంగా సహకరిస్తుందో మీకు తెలుసా!

గ్రీన్ టీ మీ బరువును తగ్గించడానికి ఏ విధంగా సహకరిస్తుందో మీకు తెలుసా!

|

బరువు తగ్గించదంలో గ్రీన్ టీ పాత్రను గురించి తెలిపే అనేక వ్యాసాలను మీరు ఇప్పటికే చాలా చదివి ఉంటారు . కానీ ఏ గ్రీన్ టీ బరువును తగ్గించడంలో ఉత్తమమైనదో మీకు తెలుసా? ఈ వ్యాసం రాయడానికి ముఖ్య కారణం అదే!

క్యాన్సర్ నివారణ మరియు చికిత్స, హృద్రోగ సమస్యలు, రుమటాయిడ్ ఆర్ధ్రైటిస్, ఇన్ఫెక్షన్లు, దంత సమస్యలు మరియు అధిక కొలెస్ట్రాల్ వంటి రోగాల పరిష్కారానికి, గ్రీన్ టీని మీ దైనందిన ఆహార ప్రణాళికలో భాగంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Did You Know That Green Tea Is Best For Weight Loss?

గ్రీన్ టీలో ఎన్నో వ్యాధులతో పోరాడే ఎపిగాల్లోకెటచిన్-3 గల్లేట్ (EGCG), అనే యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. గ్రీన్ టీ రుచికి చేదుగా, మనను ఉత్తేజపరిచే గుణాలతో ఉంటుంది.

గ్రీన్ టీలో కేటచిన్, ఎపికేటచిన్, ఎపికేటచిన్ గాలెట్ (ECG), ఎపిగాల్లోకెటచిన్-3 గల్లేట్ (EGCG) అనే కేటచిన్ పోలిఫెనోల్స్ యొక్క రసాయన సమూహం మరియు అనేక ఇతర ప్రోఏంథోసయినడిన్స్ ఉంటాయి.

బరువు తగ్గించడానికి ఏ గ్రీన్ టీ అత్యుత్తమమైనదో చదివి తెలుసుకోండి.

1. గ్యోకురోచ

2. సెంచా

3. బంచా

4. మచ్చా

5. హోజిచ

6. గెన్మైచ

1. గ్యోకురోచ:

1. గ్యోకురోచ:

ఈ రకమైన తేయాకులను కాచినపుడు, ఆకుపచ్చ రంగులోకి మారతాయి. లేత చిగుర్ల నుండి ఈ ఆకులను సేకరించడం మూలాన, ఆరోగ్యానికి మేలు చేసే ఈ రకం టీకి అత్యుత్తమ రుచి మరియు సువాసన ఉంటాయి. ఇంతేకాక, లేత ఆకులలో టానిన్లు మరియు కెఫిన్లు తక్కువగా ఉండటం మూలాన, ఈ టీ లో చేదుతనం తక్కువగా ఉంటుంది.

2. సెంచా:

2. సెంచా:

సెంచా ఇంకోరకమైన గ్రీన్ టీ. దీనిని కాచినప్పుడు, తేటుగా ఉండే లేత ఆకుపచ్చ టీ తయారవుతుంది. ఈ టీలో టానిన్లు మరియు కెఫిన్లుఅధికంగా ఉండటంతో గ్యోకురోచ కన్నా ధర తక్కువ. గ్యోకురోచ కన్నా ఇది ప్రసిద్ధమైన టీ.

3. బంచా:

3. బంచా:

ఈ గ్రీన్ టీ లేత కొమ్మల నుండి తయారు చేయడం వలన చేదుగా మరియు గాఢంగా ఉంటుంది. దీనిని కాచినప్పుడు, గోధుమ వర్ణంతో కూడిన బంగారు ఛాయలో టీ తయారవుతుంది. పైన చెప్పిన రెండు గ్రీన్ టీ రకాలకన్నా ఈ రకం చవకైనది.

4. మచ్చా:

4. మచ్చా:

గ్రీ టీ పొడి తయారీలో మిగిలిపోయిన గుండ వంటి దానితో దీనిని తయారు చేస్తారు. ఇది అందమైన ఆకుపచ్చ వర్ణంలో, నురుగతో కూడుకున్న టీని ఇస్తుంది. దీనిలో సువాసన తక్కువగా ఉంటుంది. సంప్రదాయ వేడుకలలో వాడటానికి ఇది ప్రసిద్ధి చెందింది. మిగిలిన మూడు రకాలతో పోలిస్తే ఇది తక్కువ చేదుదనం కలిగి ఉంటుంది.

5. హోజిచ:

5. హోజిచ:

ఇది స్వచ్ఛమైన గ్రీన్ టీ కాదు. దీనిలో వేయించి పొడి చేసిన బార్లీ, బియ్యం లేదా గోధుమలను కలిపి తయారు చేస్తారు. ఇది బంగారు వర్ణంలో ఉంటుంది. ఇది అతి చవకైనది.

6. గెన్మైచ:

6. గెన్మైచ:

ఇది కూడా స్వచ్ఛమైన గ్రీన్ టీ కాదు, గ్రీన్ టీ మరియు వేయించిన బ్రౌన్ రైస్ యొక్క మిశ్రమం. వేయించిన బ్రౌన్ రైస్ ఉండటం వలన, ఇది మంచి రుచి, సువాసన కలిగి ఉండే బంగారు రంగు టీని ఇస్తుంది.

గ్రీన్ టీ వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు:

గ్రీన్ టీ వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు:

1. వృద్ధాప్య ఛాయలను నివారిస్తుంది: గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, మన శరీరంలోని ఆక్సిడెంట్లు మరియు ఫ్రీ రాడికల్స్ ను తటస్తపరుస్తుంది. గ్రీన్ టీలోని కేటచిన్ పోలిఫెనోల్స్ యాంటీ- ఆక్సిడైజింగ్ లక్షణాలు ఇందుకు కారణం. క్రమం తప్పకుండా గ్రీన్ టీని సేవిస్తే వృద్ధాప్య ఛాయలు మరియు లక్షణాలు ఆలస్యంగా కనిపిస్తాయి.

2. రోగనిరోధక శక్తిని పెంచుతుంది:

2. రోగనిరోధక శక్తిని పెంచుతుంది:

క్రమం తప్పకుండా గ్రీన్ టీని సేవించేవారిలో, బాక్టీరియల్ మరియు వైరల్ ఇన్ఫెక్షన్లు కలుగవు. గ్రీన్ టీలోని కేటచిన్లు, బాక్టీరియా మరియు వైరస్ ఎదుగుదలను నివారించి, కణత్వచానికి అతుక్కోకుండా చేస్తుంది. కేటచిన్లలోని యాంటీమైక్రోబియల్ లక్షణాలు నోటి దుర్వాసన, డయేరియా, ఫ్లూ, దగ్గు, జలుబు, దంత క్షయం మరియు విరేచనాలను కూడా నివారిస్తాయి.

3. బరువును తగ్గిస్తుంది:

3. బరువును తగ్గిస్తుంది:

జీవక్రియను వేగవంతం చేసి, గ్రీన్ టీ బరువు కోల్పోయేందుకు దోహదపడుతుంది. రోజు ఉదయాన్నే ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్ టీని సేవిస్తే, అధిక బరువు సమస్య ఒకటి రెండు వారాల్లో పరిష్కారమవుతుంది.

4. క్యాన్సర్ ను నివారిస్తుంది:

4. క్యాన్సర్ ను నివారిస్తుంది:

గ్రీన్ టీలోని కేటచిన్లు, క్యాన్సర్ కారకమైన ఫ్రీ రాడికల్స్ ను తటస్తపరుస్తుంది. క్రమం తప్పకుండా గ్రీన్ టీని సేవించే క్యాన్సర్ రోగులలో నైట్రోసమైన్ వంటి కార్శినోజన్లు ఏర్పడటాన్ని నివారించి, వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది. గ్రీన్ టీ, క్లోమము, పెద్దప్రేగు, పురీషనాళం మరియు ప్రేగుల యొక్క క్యాన్సర్ ను నివారిస్తుంది.

5. మధుమేహాన్ని తగ్గిస్తుంది:

5. మధుమేహాన్ని తగ్గిస్తుంది:

గ్రీన్ టీ పంచదార కలపకుండా తీసుకుంటే, రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. దీనిలోని యాస్ట్రిజెంట్ మరియు యాంటీఆక్సిడెంట్ గుణాలు మంచి ఆరోగ్యాన్ని కలిగించి, క్లోమం మెరుగ్గా పనిచేసేటట్లు ప్రోత్సహిస్తుంది. దీనివలన మధుమేహం మీ దరి చేరదు.

English summary

Did You Know That Green Tea Is Best For Weight Loss?

Green tea is high in antioxidants called epigallocatechin-3 gallate (EGCG), which helps in treating diseases. The characteristics of green tea include its taste, bitterness, and stimulating effect. Some of the types of green tea for weight loss are Gyokurocha, Sencha, Bancha, Matcha, Houjicha, and Genmaicha.
Story first published:Saturday, June 9, 2018, 14:21 [IST]
Desktop Bottom Promotion