For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టైఫాయిడ్ కలిగినప్పుడు మరియు అనంతరం తీసుకోవలసిన ఆహార జాగ్రత్తలు

టైఫాయిడ్ కలిగినప్పుడు మరియు అనంతరం తీసుకోవలసిన ఆహార జాగ్రత్తలు

|

ప్రతి యేడు, కొన్ని మిలియన్ల మంది ప్రజలు టైఫాయిడ్ బారిన పడుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే, ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారే అవకాశం కలిగి ఉంటుంది. వైద్య చికిత్స పొందినప్పటికి కూడా, ఇది రోగిని, శారీరక మరియు మానసికంగా దెబ్బతీస్తుంది.

అందువల్ల, ఈ వ్యాధి వలన నశించిన శక్తిని తిరిగి భర్తీ చేసుకునే ఆహారాన్ని తీసుకోవలసిన అవసరం ఉంది. పౌష్టికాహారం ద్వారా పూర్వపు ఆరోగ్యకరమైన పరిస్థితిని పొందవచ్చు. ఈ వ్యాసంలో, టైఫాయిడ్ రోగులు తీసుకోవలసిన ఆహారపదార్ధాలను గురించి తెలుసుకుందాం!

Diet during and post Typhoid - What to eat and what to avoid.

టైఫాయిడ్ అనేది సాల్మోనెల్లా టైఫి అనే బ్యాక్టీరియా కలిగించే ఒక అంటువ్యాధి. ఈ బ్యాక్టీరియా సాధారణంగా అనారోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు మరియు కలుషితమైన ప్రాంతాల్లో నివసిస్తుంది.

ఈ విధంగా కలుషితమైన ఆహారం లేదా త్రాగునీటిని మీరు సేవించేటప్పుడు, బాక్టీరియా మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీని మూలంగా మీలో టైఫాయిడ్ ముందు జ్వరంతో ప్రారంభమై, తదనంతరం అలసట, తలనొప్పి, అధిక జ్వరం, కడుపులో వాపు, అతిసారం లేదా మలబద్ధకం, గొంతు నొప్పి, ఛాతీపై గులాబీ రంగు మచ్చలు, వికారం మరియు ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు కనిపిస్తాయి.

ఈ వ్యాధి సంక్రమణ జరిగిన తరువాత, శరీరంలో వ్యాప్తి చెంది వారం నుండి మూడు వారాల మధ్య కాలంలో లక్షణాలన్నీ కనపడటం ప్రారంభమవుతుంది. ఈ లక్షణాలన్నీ ఏడు నుండి పద్నాలుగు రోజులు లేదా చికిత్స చేయని సందర్భాల్లో, అంతకంటే ఎక్కువ (నెలలు) కాలం పాటు నిలిచి ఉంటాయి.

సాల్మోనెల్లా టైఫీ ప్రధానంగా, జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేసినప్పటికీ, రక్తం ద్వారా ఈ సూక్ష్మజీవులు శరీరం యొక్క మిగిలిన అవయవాలకు కూడా చేరతాయి. అప్పుడు ఈ వ్యాధి తీవ్రత మరింత పెరుగుతుంది. కనుక టైఫాయిడ్ వ్యాధి చికిత్సకు, సరైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం.

టైఫాయిడ్ వ్యాధి సోకినప్పుడు, ఆహారం తీసుకునే విషయంలో మీరు పాటించాల్సిన 7 జాగ్రత్తలు:

1. తరచుగా ఆహారం తీసుకోండి.

1. తరచుగా ఆహారం తీసుకోండి.

ఒక వైపు, టైఫాయిడ్ మీ శక్తి మొత్తాన్ని హరించేయడమే కాక, మరోవైపు మీ ఆకలిని మరియు తినాలనే కోరికను తగ్గిస్తుంది. మీరు ఎప్పటిలాగే ఆహారాన్ని తినడం కష్టతరమవుతుంది.

అందువల్ల, మీరు మరింత తరచుగా తింటుండండి. మరియు మీ శరీరానికి శక్తినిచ్చే మరింత ఆరోగ్యకరమైన చిరుతిళ్ళను తినండి. ఆహారం తక్కువగా తీసుకున్నప్పటికిని, అది అత్యంత పోషకాలతో కూడి ఉండేట్టు నిర్ధారించుకోండి.

2. తరచుగా ఆరోగ్యకరమైన ద్రవాలను తీసుకోండి

2. తరచుగా ఆరోగ్యకరమైన ద్రవాలను తీసుకోండి

టైఫాయిడ్ సమయంలో, మీ శరీరం పలు విధాలుగా ద్రవాలను కోల్పోతుంది. చెమట మరియు వాంతులు ద్వారా, మీ శరీరం నీటిని త్వరితగతిన కోల్పోతుంది. మీ శరీరంలో శక్తిని ఉత్పత్తి అవ్వడానికి మీ శరీరానికి చాలా ఎక్కువ నీరు అవసరమవుతుంది. నీళ్ల విరేచనాలు మరియు అతిసారం వలన కూడా నీరు ఎక్కువగా కోల్పోతారు.

ఇవన్నీ కలిసి మీ పరిస్థితిని మరింత దిగజార్చి, డీహైడ్రేషన్ సంబంధిత సమస్యలకు కారణం అవుతున్నాయి. అందువల్ల మీ శరీరాన్ని చైతన్యవంతం చేయడానికి, హైడ్రేట్ చేయడానికి మరియు ఎలెక్ట్రోలైట్ బ్యాలన్స్ కొనసాగించడానికి ఆరోగ్యకరమైన ద్రవాలను త్రాగాలి.

3. ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోండి

3. ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోండి

టైఫాయిడ్ సమయంలో ఆకలి తగ్గిపోవడం, శక్తిని కోల్పోవడం మరియు తక్కువగా ఆహారం మరియు ద్రవాలు తీసుకోవడం వల్ల, మీ శరీరం బరువును కోల్పోతుంది. ఇది బరువు కోల్పోయేందుకు ఆరోగ్యకరమైన పద్ధతి కాదు కనుక, మీ శరీరంలోని ప్రోటీన్లు మరియు కండరాల ద్రవ్యరాశిని కోల్పోతారు - కొవ్వులు కాదు. కనుక, ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.

4. సులభంగా జీర్ణమయ్యే ఆహారపదార్ధాలను తీసుకోండి

4. సులభంగా జీర్ణమయ్యే ఆహారపదార్ధాలను తీసుకోండి

టైఫాయిడ్ శరీరం మొత్తం మీద జీర్ణ వ్యవస్థను ప్రధానంగా బలహీనపరుస్తుంది కనుక, మీ జీర్ణ సంబంధిత మరియు ప్రేగులలో జరిగే ప్రక్రియలలో ప్రతికూల మార్పులు సంభవిస్తాయి. కొన్నిరకాల పదార్థాలు జీర్ణం కావు. కనుక, ముందుగా మీరు సరిగా వండిన లేదా మెత్తగా ఉడికిన ఆహారం మాత్రమే తీసుకోవాలని గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి ఆహారం తేలికగా జీర్ణమవుతుంది.

5. నీటిలో కరగని పీచుపదార్ధం కలిగి ఆహారాన్ని తీసుకోకుండా ఉండటం మంచిది

5. నీటిలో కరగని పీచుపదార్ధం కలిగి ఆహారాన్ని తీసుకోకుండా ఉండటం మంచిది

పై పేర్కొన్న కారణాల వల్ల, మీరు నీటిలో కరగని పీచుపదార్ధంకలిగి ఉన్న ఆహారాన్ని తినరాదు లేదా వాటి వినియోగంను వీలైనంతగా తగ్గించాలి. కరగని పీచుపదార్ధాలు ప్రధానంగా వృక్ష సంబంధిత ఉత్పత్తులు. ఇవి సాధారణంగా కరిగే పీచుపదార్థాలతో పాటుగా ఉంటాయి.

 6. మసాల, కొవ్వు మరియు జిడ్డు కలిగిన ఆహార పదార్థాలను సేవించరాదు

6. మసాల, కొవ్వు మరియు జిడ్డు కలిగిన ఆహార పదార్థాలను సేవించరాదు

టైఫాయిడ్ జ్వరం తీవ్రంగా ఉన్నపుడు, ఇటువంటి ఆహారానికి దూరంగా ఉండండి. ఈ రకమైన ఆహారపదార్థాలను తినడం సరైన జీర్ణక్రియ మందగించడం లేదా దెబ్బతినడం జరుగుతుంది. మీరు తీసుకునే ఆహారం అనారోగ్యకరమైనది కానప్పటికీ, టైఫాయిడ్ మూలంగా ప్రభావితమైన మీ జీర్ణవ్యవస్థ తిరిగి సాధారణ స్థితికి చేరేవరకు, తగినంత శ్రద్ధ మరియు జాగ్రత్త తీసుకోవటం అవసరం. కనుక మసాల మరియు కొవ్వు పదార్ధాలు కలిగిన ఆహారానికి దూరంగా ఉండండి.

6. మసాల, కొవ్వు మరియు జిడ్డు కలిగిన ఆహార పదార్థాలను సేవించరాదు

6. మసాల, కొవ్వు మరియు జిడ్డు కలిగిన ఆహార పదార్థాలను సేవించరాదు

ఇక్కడ విటమిన్లు అంటే, A, B మరియు C విటమిన్లని అర్ధం. విటమిన్స్ మొత్తం శరీరం యొక్క పనితీరును మెరుగుపరిచి, వ్యాధి నుండి కొలుకున్నాక ఆరోగ్యాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకుని రావడానికి సహాయపడతాయి. ఇవి నారింజ, క్యారట్లు మరియు బంగాళాదుంపలు వంటి పండ్లు మరియు కూరగాయలలో లభిస్తాయి. టైఫాయిడ్ నుండి కొలుకున్నాక, విటమిన్లను సప్లిమెంట్ల రూపంలో తీసుకోదలచినట్లైతే, మీ వైద్యుడిని సంప్రదించిన తరువాత మాత్రమే తీసుకోవాలి.

తినేముందు పండ్లు మరియు కూరగాయలను అలాగే మీ చేతులను సరిగా కడుక్కోండి. అపరిశుభ్రంగా ఉండే ప్రదేశాలను నివారించండి. మీరు అలా చేయలేకపోతే, కనీసం ఆ ప్రదేశంలో దొరికే ఆహార పదార్థాలు మరియు నీటిని సేవించకండి.

ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, నీటి సీసాను తీసుకునివెళితే మంచిది. మీరుతప్పనిసరి పరిస్థితుల్లో టైఫాయిడ్ వ్యాధి పీడిత ప్రదేశానికి ప్రయాణం చేయవలసివస్తే, ప్రయాణానికి కనీసం రెండు వారాల ముందు టైఫాయిడ్ టీకాలు వేయించుకోవడానికై డాక్టర్ను సంప్రదించండి.

7. విటమిన్స్ అధికంగా తీసుకోండి

English summary

Diet during and post Typhoid - What to eat and what to avoid.

Typhoid is a potentially deadly disease that affects millions of people per year. Follow these 7 things if you are on a diet for typhoid: Eat and drink more healthy fluids frequently, consume a protein-carb-rich diet, include more foods easy to digest, try to avoid foods containing insoluble fibre& spicy, fatty, oily foods, and consume more vitamins.
Story first published:Saturday, July 14, 2018, 12:58 [IST]
Desktop Bottom Promotion