ఆహార నియంత్రణ లేకుండా బరువు తగ్గడం ఎలానో మీకు తెలుసా ?

Written By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ఆహార నియంత్రణ ద్వారా మాత్రమే బరువు తగ్గవచ్చు అని అనుకుంటే పొరబడినట్లే.

అసలు నిజం ఏమిటంటే, బరువు తగ్గడానికి ఇది ఒక చెత్త చిట్కా అని చెప్పవచ్చు. ఎందుకంటే, ఇలా చేసిన వారికి ఏమి జరిగింది అని గతాన్ని గనుక పరిశీలిస్తే ఈ విషయం మనకు అవగతం అవుతుంది. ఆహార నియంత్రణ పాటించడం వల్ల బరువు తగ్గుతారు. ఎప్పుడైతే ఆహార నియంత్రణ ఆపేస్తారో, ఇక అప్పటి నుండి విపరీతంగా బరువు పెరుగుతారు.

ఇలా చేయకుండా, కొన్ని నిర్దిష్టమైన ప్రత్యామ్నాయ వ్యూహాల ద్వారా బరువుని సులువుగా తగ్గవచ్చు. ఇలా చేస్తే సమయం ఎక్కువ తీసుకోవచ్చు. కానీ, ఇలా చేయడం వల్ల మీకు మంచి అలవాట్లు అలవాడుతాయి మరియు శాశ్వతంగా ఊబకాయానికి దూరం అవుతారు. ఆహార నియంత్రణ పాటించకుండా బరువు ఎలా తగ్గవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

1. పౌష్టికాహార అల్పాహారాన్ని తీసుకోండి :

1. పౌష్టికాహార అల్పాహారాన్ని తీసుకోండి :

సాధారణంగా వైద్యులు అందరూ, అల్పాహారాన్ని ఎప్పుడు కానీ మానివేయకండి అని సూచిస్తూ ఉంటారు. ఇలా చెప్పడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. అదేమిటంటే, మనం ఉదయాన్నే తీసుకొనే ఆహారం రాత్రంతా పొట్టలో విడులయిన ఆమ్లాల యొక్క ప్రభావాన్ని తగ్గించి, సమతుల్యతతో ఉండేలా చూస్తుంది. అంతేకాకుండా, మధ్యాహ్న భోజన సమయంలో అవసరానికి మించి, స్రుతి మించి తినకుండా మనల్ని నియంత్రిస్తుంది.అంటే దీనర్ధం, మీ అల్ఫాహారంలో విపరీతమైన కొవ్వు పదార్ధాలను, వేయించిన పదార్ధాలను మరియు మాంసం పదార్ధాలను తినమని కాదు.

దీనికి బదులుగా, పౌష్టికాహారం ఎక్కువగా ఉండే పీచు పదార్ధాలు ఎక్కుగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. ధాన్యపు జాతితో చేసినటువంటి పదార్ధాలు లేదా కాల్చబడిన అవొకాడో తో పాటు గిలగొట్టిన గుడ్లు తినడం, ఇలా ఇటువంటి ఆహారం తినడం వల్ల మీ కడుపు మధ్యాహ్నం భోజనం తినే వరకు నిండుగా ఉంటుంది మరియు మీ పనులు చేసుకునేందుకు శక్తి మీకు లభిస్తుంది మరియు మీ శరీరంలోకి కొవ్వు చేరనివ్వదు.

2. రోజుకు 5 సార్లు భోజనం చేయడం :

2. రోజుకు 5 సార్లు భోజనం చేయడం :

ఎన్నో అధ్యయనాలు చెబుతున్న విషయం ఏమిటంటే, ఎక్కువసార్లు చిన్న చిన్న మొత్తలుగా రోజు మొత్తం భోజనం చేయడం ద్వారా బరువు తగ్గవచ్చని, రోజు మొత్తం మూడు సార్లు విపరీతంగా భోజనం చేసేవారికంటే కూడా, ఇలా 5 సార్లు భోజనం చేసినవారు బరువు పెద్దగా పెరగలేదని చెబుతున్నారు.

మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, అల్ఫాహారం మరియు మధ్యాహ్న భోజన మధ్య సమయంలో మరియు సాయంత్రం పూట అల్ఫాహారం తీసుకొనే సమయంలో పండ్లను తినండి. ప్రతిరోజూ 7 గంటల లోపే భోజనాన్ని తినడం పూర్తి చేయండి. ఇలా చేయడం ద్వారా మీ జీర్ణ వ్యవస్థకు ఆహారాన్ని జీర్ణం చేయడానికి తగినంత సమయం దొరుకుతుంది.

3. నీరు ఎక్కువగా త్రాగండి :

3. నీరు ఎక్కువగా త్రాగండి :

దీని వెనుక మూడు రకాల కారణాలు ఉన్నాయి.

మొదటిది, మనలో చాలా మంది దాహం వేసే సమయంలో కూడా ఆహారాన్ని తింటుంటారు. ఇలా చేయడం వల్ల కూడా దాహం తగ్గుతుంది. ఎందుకంటే, ఆహార పదార్ధాల్లో కూడా కొంతమేర నీరు ఉంటుంది, కానీ ఇలా చేయడం వల్ల బరువు పెరుగుతారు.

రెండవది, నీరు ఎక్కువగా త్రాగటం వల్ల, మన పొట్ట ఎప్పుడు నిండుగా ఉంటుంది మరియు సమయం కాని సమయంలో మనల్ని ఆకలిగా ఉండనివ్వకుండా నియంత్రిస్తుంది. మన లో చిరాకుని తగ్గిస్తుంది.

మూడవది, అవసరమైన మేర నీరు త్రాగటం వల్ల మన శరీరం సరైన రీతిలో ఉంటుంది. ముఖ్యంగా కాలేయం, మూత్ర పిండాలు మరియు జీర్ణ కోసం ప్రాంతం బాగా పనిచేస్తాయి.

4. మీ అడుగు దిశల యొక్క జాడను తెలుసుకోండి మరియు మీ మెదడు కి శిక్షణ ఇవ్వండి :

4. మీ అడుగు దిశల యొక్క జాడను తెలుసుకోండి మరియు మీ మెదడు కి శిక్షణ ఇవ్వండి :

అమెరికాలో జరిగిన ఈ ఆకర్షిణీయ అధ్యయనం ఒక హోటల్లో పనిచేసేవారి పై జరిగింది. ఇందులో సగం మంది ఏమని చెప్పారంటే, వారి ఇంట్లో చేసుకొనే పనులు వల్ల, దాదాపు జిమ్ కు పొతే ఎంత శక్తి ఖర్చవుతుందో ఇలా చేయడం వల్ల కూడా అంతే ఖర్చవుతుందని చెప్పారు మరియు మరో సగం మంది ఈ అభిప్రాయాన్ని వ్యతిరేకించారు. ఇది శాస్త్రీయంగా చేసిన అధ్యయనంగా తెలుస్తోంది.

ఒక నెల తర్వాత ఈ పనివాళ్ల అందరి బరువు పరీక్షించారు. ఈ మొత్తం బృందంలో 60% మంది వారి యొక్క పనులు రోజు చేయడం ద్వారానే, వ్యాయామం చేస్తే ఎంత బరువు తగ్గుతారో, అంత బరువు తగ్గారని గుర్తించారు.

ఈ అధ్యయనం ఏమి చెబుతుందంటే, మీరు ప్రతిరోజూ చేసే పనులను కొత్తగా చేసే విధంగా మరియు వాటిని కొత్తగా చూసే విధంగా మీ మెదడుకు శిక్షణ ఇవ్వాలంట. సాధారణంగా ఫిట్ నెస్ ట్రాకర్స్ కు ఇదే సూత్రం పై పనిచేస్తుంది. ఎన్ని కిలో మీటర్లు మీరు ఒక రోజులో నడిచారు అనే విషయాన్ని మీరు ఆరోజు వేసిన అడుగులని లెక్కించి చెప్పడం జరుగుతుంది.

సగటున ఒక నెలలో, ప్రతి రోజు గనుక పది వేల అడుగులు నడిచినట్లైతే మీరు ఖచ్చితంగా బరువు తగ్గుతారని, ఇదే పెద్ద వ్యాయామం అని చెబుతున్నారు.

5. ఉత్తమమైన ఆహారాలను ఎక్కువగా తినండి :

5. ఉత్తమమైన ఆహారాలను ఎక్కువగా తినండి :

కొన్ని రకాల ఆహారాలను ఉత్తమమైన ఆహారాలుగా చెబుతారు. ఎందుకంటే, వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల వ్యాధులు మీ దరి చేరకుండా ఉంటాయి. మీ జీర్ణ క్రియ మెరుగుపడుతుంది మరియు బరువు కూడా తగ్గుతారు.

బెర్రీ లు, అవొకాడో లు, ధాన్యపు జాతి వస్తువులు, చేప మరియు వాల్ నట్ లను ఉత్తమమైన ఆహారాలుగా చెబుతారు.

6. ఏదైనా ఒక ఆటను ఆడండి :

6. ఏదైనా ఒక ఆటను ఆడండి :

ఎంతో మంది వ్యక్తిగత అనుభవం ద్వారా చెబుతున్న విషయం ఏమిటంటే, ఏదైనా ఆటను ఆడటం ద్వారా లేదా నృత్యాన్ని చేయడం ద్వారా బరువు ఉత్తమంగా తగ్గవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా ఆటల్లో మీకు నచ్చినవి ఆడటం, ఈత వంటి ఆటలను ఆడితే మరింత మంచి ఫలితాలు ఉంటాయి.

మీరు దేనిని ఎంచుకున్నా సరే, దానిని క్రమం తప్పకుండా చేయాలి, దీని యొక్క ఫలితాలు కొన్ని నెలల తర్వాత కనబడతాయి. కానీ, ఆ ఫలితాలు అలాగే ఉండిపోతాయి.

7.విపరీతమైన చక్కెర తినడం ఆపేయండి :

7.విపరీతమైన చక్కెర తినడం ఆపేయండి :

అస్సలు సందేహం లేకుండా ఎన్నో అధ్యయనాలు చెబుతున్న విషయం ఏమిటంటే, చక్కెర విపరీతమైన కొవ్వు ని పెంచుతుంది మరియు వ్యసనపరులుగా మారుస్తుంది. అందుచేతనే ఏమో ప్రపంచం లో ఎప్పుడు లేనంతగా ఊబకాయ వ్యాధిగ్రస్థులు పెరిగిపోయారు.

కాబట్టి, మీ అంతకు మీరు చేసుకోవాల్సిన పని ఏమిటంటే, చక్కెరను తినడం పూర్తిగా ఆపివేయండి. మీరు మరీ పూర్తిగా ఒకేసారి నిలిపివేయాల్సి అవసరంలేదు. నెమ్మదిగా తినటం ఆపివేయండి. ఇందుకు మీ నాలుక అలవాటు పడేలా చూసుకోండి. ఇందుకోసం సహజసిద్ధంగా తీయగా ఉండే పదార్ధాలను ఎంచుకోండి.

8. కండరాలను కొద్దిగా పెంచండి :

8. కండరాలను కొద్దిగా పెంచండి :

స్త్రీలు ఈ విషయాన్ని విస్మరించేముందు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రాధమికంగా స్త్రీలు మరియు పురుషులు శారీరికంగా విభిన్నంగా నిర్మితమై ఉంటారు. అందుచేత, మీరు బరువు ఎత్తే వ్యాయామాలు చేసినప్పటికీ కూడా, మీ శరీరం వారి అంత ఎక్కువగా పెరగదు.

మీరు బరువులు ఎత్తే వ్యాయామాన్ని ఖచ్చితంగా చేయండి మరియు మీ శరీరాకృతిని సరిచూసుకోండి. ఇలా చేయడం వల్ల రోజు మొత్తంలో కండరాలు ఎంతో శక్తిని తీసుకుంటాయి, ఖర్చు చేస్తాయి. దీని వల్ల మీ జీర్ణ క్రియ పెరుగుతుంది మరియు శరీరంలో పేరుకుపోయి ఉన్న కొవ్వు కరుగుతుంది.

English summary

How to Lose Weight Without Dieting (Simple Weight Loss Tips)

Most lose-weight-quick tactics don't work, as you regain all your lost pounds within the span of a week or more. Instead, you should focus on holistically losing your weight over time by playing your favourite sport or dancing, eating more superfoods, and wearing a fitness tracker to train your mind.