For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

8 నెలల్లో 46 కిలోలు తగ్గిన దిల్లీ పోలీసు అధికారి, ఏం తిన్నాడు, ఏం వర్కవుట్స్ చేశాడంటే..

దిల్లీకి చెందిన ఓ పోలీసు అధికారి కేవలం 8 నెలల్లో 46 కిలోలు తగ్గారు. ఆయన ఏం తిన్నారు, ఎలాంటి వ్యాయామాలు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.

|

మనకు రోజూ కనిపించే పోలీసుల్లో ఎక్కువ మంది ఎలా ఉంటారు. భారీ దేహం, పెద్ద పొట్ట కామన్‌గా ఉంటుంది. కొందరు పోలీసులు ఫిట్‌గా ఉంటారు కానీ ఎక్కువ మంది భారీ పొట్టతో ఉండటం మనకు కనిపిస్తూనే ఉంటుంది. దిల్లీలోని మెట్రో డీసీపీ జితేంద్ర మణి కూడా అలాగే ఉండేవారు. భారీ దేహం, పెద్ద పొట్ట ఉండేది. ఆయన 130 కిలోల బరువుతో ఉండే వారు. కానీ ఇప్పుడాన బరువు 84 కిలోలు. కేవలం 8 నెలల్లో 46 కిలోలు తగ్గారు.

Delhi Police Officer Sheds 46 Kg In 8 Months. Know His Diet, Exercise Plan in telugu

(image: twitter/JITENDRA MANI IPS)

బరువు తగ్గిన మెట్రో డీసీపీ జితేంద్ర మణి ఇప్పుడు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన కృషిని గుర్తించిన పోలీసు కమిషనర్ సంజయ్ ఆరోరా డీసీపీ జితేంద్ర మణికి ప్రత్యేక రివార్డు అందించారు. ఒకప్పుడు 130 కిలోల బరువుతో ఉన్న జితేంద్రకు, ఇప్పటి జితేంద్రకు అసలు ఏమాత్రం పోలికే లేదు.

130 కిలోలు ఉన్నప్పుడు జితేంద్ర అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. మధుమేహం, అధక రక్తపోటు, విపరీతమైన కొలెస్ట్రాల్ స్థాయిలు లాంటి ఇబ్బందులు ఉండేవి.

మారాలని నిర్ణయించుకున్న జితేంద్ర మణి:

మారాలని నిర్ణయించుకున్న జితేంద్ర మణి:

(image: twitter/JITENDRA MANI IPS)

విపరీతమైన బరువు, బరువుతో పాటు వచ్చిన రోగాలు వీటన్నింటిని మార్చుకోవాలని బలంగా నిర్ణయించుకున్నారు జితేంద్ర మణి. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ప్రారంభించారు. రోజూ 15వేల అడుగులు నడవాలన్నది మొదటి లక్ష్యం. దీనితో పాటు సమతుల్య ఆహారం తీసుకోవడం ప్రారంభించారు. అన్నం, రోటీలు తీసుకోవడం పూర్తిగా తగ్గించారు. సూప్‌లు, సలాడ్‌లు, పండ్ల వంటి పోషకాహారాలపై దృష్టి పెట్టారు.

కఠినమైన డైట్ పాటించారు. ప్రతి నెలా 4.5 లక్షల అడుగులు నడవాలని లక్ష్యంగా పెట్టుకుని అందకు కష్టపడ్డారు. డైట్ తో పాటు శారీరక శ్రమ ఉండటంతో 8 నెలల్లో 46 కిలోలు తగ్గారు. గతక 8 నెలల్లో డీసీపీ జితేంద్ర మణి 32 లక్షలకు పైగా అడుగులు వేశారు.

దిల్లీ పోలీసు కమిషనర్‌ సన్మానించారు:

దిల్లీ పోలీసు కమిషనర్‌ సన్మానించారు:

(image: twitter/JITENDRA MANI IPS)

జితేంద్ర మణి ఆరోగ్యంలో అనూహ్యమైన అభివృద్ధిని చూసి, దిల్లీ పోలీసు కమిషనర్ మెచ్చుకున్నారని జితేంద్ర మణి చెప్పారు. ఆరోగ్యం మెరుగుపడాలనే సంకల్పానికి మరియు దానిని నిజం చేయడానికి చేసిన కృషికి పెద్ద 90 వేల మంది ముందు ప్రశంసాపత్రం కూడా ఇచ్చారని డీసీపీ మణి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు, వేలాది మంది సైనికులు పాల్గొన్నారు.

ఒకప్పుడు జితేంద్ర మణి నడుము కొలత 46 ఇంచులు ఉండేది. ప్రస్తుతం నా నడుము కొలత 34కు తగ్గింది. పోలీసు యూనిఫాం, ఇతర బట్టలు అన్నీ మార్చాల్సి వచ్చింది.

బీపీ, బ్లడ్‌ షుగర్‌ అదుపులో ఉన్నాయి:

బీపీ, బ్లడ్‌ షుగర్‌ అదుపులో ఉన్నాయి:

(image: twitter/JITENDRA MANI IPS)

డీసీపీ మణి కేవలం ఎనిమిది నెలల్లోనే 130 కేజీల నుంచి 84 కేజీలకు బరువు తగ్గారు. ఈ సమయంలో, ఆయన తన హై బ్లడ్ షుగర్ మరియు హై బిపిని కూడా తగ్గించుకున్నారు. ఐపీఎస్ జితేంద్ర కొలెస్ట్రాల్ స్థాయి 500 దాటి ఉండేది. ట్రైగ్లిజరైడ్ కూడా 490 వద్ద ఉంది. ప్రస్తుతం ఆయన కొలెస్ట్రాల్ 150కి తగ్గించబడింది. ట్రైగ్లిజరైడ్ 120కి లాక్ చేయబడింది. ఇదంతా ఆయన సంకల్పం, కృషి వల్లే సాధ్యమైంది.

జితేంద్ర మణి డైట్, వర్కవుట్ ప్లాన్:

జితేంద్ర మణి డైట్, వర్కవుట్ ప్లాన్:

(image: twitter/JITENDRA MANI IPS)

* రోజుకు 15000 అడుగులు నడిచారు

* కార్బోహైడ్రేట్ లేని ఆహారమే తీసుకున్నారు.

* సొరకాయ, చేదు రసాన్ని రోజూ తీసుకున్నారు.

* అల్పాహారంలో పండ్లు (యాపిల్, బొప్పాయి, కివి, జామ) మాత్రమే తిన్నారు.

* మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనానికి ముందు సలాడ్ తీసుకున్నారు.

* మధ్యాహ్నం కొబ్బరి నీళ్లు, పెరుగు లేదా మజ్జిగ తాగేవారు.

* పచ్చి కూరగాయలు, పప్పులు తిన్నారు.

* మధ్యాహ్న భోజనంలో బ్రెడ్. అన్నాన్ని తినడం పూర్తిగా మానేశారు.

* సాయంత్రం 5 గంటలకు సెవ్ లేదా కాల్చిన పప్పు తీసుకున్నారు.

* రాత్రి భోజనం కోసం వెజిటబుల్ సూప్ లేదా చిల్లీ పనీర్ మాత్రమే భాగం చేశారు.

* రోజుకు రెండుసార్లు ప్రోటీన్ పౌడర్ తీసుకునేవారు.

English summary

Delhi Police Officer Sheds 46 Kg In 8 Months. Know His Diet, Exercise Plan in telugu

read this to know Delhi Police Officer Sheds 46 Kg In 8 Months. Know His Diet, Exercise Plan in telugu
Story first published:Thursday, December 29, 2022, 14:32 [IST]
Desktop Bottom Promotion