For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Weight Loss Tips: వర్కవుట్స్ చేస్తున్నా, డైట్ పాటిస్తున్నా బరువు తగ్గడం లేదా?

వర్కవుట్స్ చేస్తున్నా, నోరు కట్టేసుకుని డైట్ పాటిస్తున్నా ఎందుకు బరువు తగ్గడం లేదన్న ప్రశ్న చాలా మందిని వేధిస్తుంది. బరువు తగ్గకపోవడం అనే నిరాశను కలిగిస్తుంది. బరువు తగ్గాలన్న కోరికను ఇది క్రమంగా చంపేస్తుంది. ఫలితం కనిపి

|

Weight Loss Tips: చాలా మంది బరువు తగ్గాలని ప్రయత్నించే వారు ఎప్పుడూ ఒక మాట చెబుతుంటారు. బరువు తగ్గాలన్న లక్ష్యంతో కొందరు వ్యాయామాలు చేస్తుంటారు, నోటిని అదుపులో పెట్టుకుంటూ కచ్చితమైన డైట్ పాటిస్తుంటారు. కానీ ఎన్ని చేసినా బరువు మాత్రం తగ్గరు.

Reasons you are not losing weight even if you follow diet and do workouts in Telugu

వర్కవుట్స్ చేస్తున్నా, నోరు కట్టేసుకుని డైట్ పాటిస్తున్నా ఎందుకు బరువు తగ్గడం లేదన్న ప్రశ్న చాలా మందిని వేధిస్తుంది. బరువు తగ్గకపోవడం అనే నిరాశను కలిగిస్తుంది. బరువు తగ్గాలన్న కోరికను ఇది క్రమంగా చంపేస్తుంది. ఫలితం కనిపించకపోతే కష్టపడి ఏం ప్రయోజనం అనే భావన వచ్చేస్తుంది.

అన్ని చేస్తున్నా.. అసలెందుకు బరువు తగ్గడం లేదు అనేందుకు చాలా కారణాలు ఉంటాయి.

అసలెలా బరువు తగ్గుతారు?

అసలెలా బరువు తగ్గుతారు?

కేలరీ డెఫిసిట్ అంటే తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల మాత్రమే బరువు తగ్గుతారు. ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్‌ను కరిగించడం అనేది తర్వాత. బరువు తగ్గాలనుకునే వారు పోషకాలు, విటమిన్లు తీసుకుంటూ కేలరీలు తక్కువగా తీసుకున్నప్పుడే బరువు తగ్గడం సాధ్యం అవుతుంది. శరీరానికి కావాల్సిన కేలరీలు అందకపోతే ఒంట్లో ఉన్న కేలరీలను కరగడం మొదలు అవుతుంది. కొవ్వు లేదా కండరాలు కోల్పోవడం జరుగతుంది. ఇలా బరువు తగ్గుతారు.

బరువు తగ్గడానికి ముందు మీకు రోజుకు ఎన్ని కేలరీలు అవసరం, మీరు ఎన్న కేలరీలు తీసుకుంటున్నారో తెలుసుకోవాలి. బాడీ మాస్ ఇండెక్స్ ఎంతో తెలుసుకోవాలి. తర్వాత క్రమంగా వెయిట్ లాస్‌పై దృష్టి పెట్టాలి.

 బరువు తగ్గకపోవడానికి కారణాలేంటి?

బరువు తగ్గకపోవడానికి కారణాలేంటి?

బరువు ఎందుకు తగ్గడం లేదు అనే ప్రశ్నకు జవాబు వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది. అయితే బరువు తగ్గాలని శ్రమించే వారికి బరువు తగ్గుతుందన్న రిజల్ట్ కనిపించకపోవడం వల్ల నిరాశ వచ్చేస్తుంది.

బరువు తగ్గకపోవడానికి కారణాలు:

1. కొవ్వు కాకుండా ఇంకేదో..

బరువు తగ్గడానికి పెరగడానికి ఒంట్లోని కొవ్వు, కండరాలు, ద్రవాలు, ఆహారం కారణం అవుతాయి. మీరు అధిక బరువు ఉన్నారనుకుంటే అది కొవ్వు వల్ల వచ్చిన బరువో, లేదా కండరాల వచ్చిన బరువో లేక ఇంకేదో ముందుగా తెలుసుకోవాలి.

నీటి బరువు

కొవ్వు కరిగించడం మొదలు అయినప్పుడు ఒంట్లో నీరు ఎక్కువ అవుతుంది. ఈ నీరే బరువు తగ్గకుండా చేస్తుంది. కొవ్వు తగ్గినా దాని స్థానంలోకి నీరు రావడంతో బరువు తగ్గరన్నమాట.

శరీరానికి శక్తి కావాలంటో కొవ్వు ఉండాల్సిందే. పిండి పదార్థాలు, ప్రోటీన్ల కంటే శరీరానికి కొవ్వుల నిల్వలే అత్యంత ప్రధానం. అన్ని శారీరక విధులు సక్రమంగా సాగాలంటే కొవ్వు అవసరం. అందుకే ప్రతి ఒక్కరూ శక్తి నిల్వలను కలిగి ఉండాలి.

కొవ్వు కరగడం మొదలు కాగానే ఫ్యాట్ సెల్స్ వాటిలోని ఫ్యాట్‌ను కోల్పోతాయి. అయితే మళ్లీ కొవ్వు కోసం వెయిట్ చేస్తూ అప్పటి వరకు ఫ్యాట్ సెల్స్ వాటిలో నీళ్లను నింపుకుంటాయి. ఇలా చేయడం వల్ల బరువు తగ్గలేరు. కానీ ఇలా కేలరీలను తక్కువ తీసుకోవడాన్ని కొన్ని రోజుల పాటు కొనసాగిస్తే ఫ్యాట్ సెల్స్ క్రమంగా నీటిని వదిలేస్తాయి.

బరువు తగ్గే క్రమంలో వాటర్ రిటెన్షన్ అవుతోందా..

బరువు తగ్గే క్రమంలో వాటర్ రిటెన్షన్ అవుతోందా..

నీళ్లు ఎక్కువగా తాగాలి:

నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పుష్కలంగా నీరు తాగితే ఒంట్లోని వ్యర్థాలు బయటకు పోతాయి. నీళ్లు ఎక్కువగా తాగితే క్రమంగా బరువు తగ్గుతారి.

ఉప్పు, సోడియం తక్కువ తీసుకోవాలి:

అధిక సోడియం స్థాయిలు నీటిని నిలుపుకోవడానికి కారణం అవుతాయి. ఉప్పు, బ్రెడ్, మాంసం, సాస్‌లు, ప్యాకెజ్డ్ ఫుడ్‌లో సోడియం అధికంగా ఉంటుంది.

పోటాషియం, మెగ్నీషియం ఎక్కువగా తీసుకోవాలి:

ఒంట్లో వాటర్ రిటెన్షన్‌ను తగ్గించడానికి పొటాషియం, మెగ్నీషియం చక్కగా పని చేస్తాయి. కాయలు, గింజలు, ఆకుకూరలు, డార్క్ చాక్లెట్లలో మెగ్నీషియం ఉంటుంది.

చెమట చిందించాలి:

ఒంట్లోని అదనపు నీరు బయటకు పోవడానికి వ్యాయామం మంచి ఎంపిక. ఆవిరి స్నానం చేసినా ప్రయోజనం ఉంటుంది.

చక్కెర తగ్గించాలి:

చక్కెర ఇన్సులిన్ స్పైక్‌కు కారణం అవుతాయి. ఇది సోడియం మరియు ఎక్కువ ద్రవాన్ని నిల్వ చేయడానికి కారణం అవుతుంది.

ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి:

కార్బోహైడ్రేట్లకు బదులు ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఆహారాలను తీసుకోవాలి. వీటి వల్ల ఒంట్లో అధిక నీరు చేరదు.

ఓపిక:

కొత్త డైట్‌కు శరీరం అలవాటు పడటానికి కొంత సమయం కావాలి. ఆ సమయం వరకు ఓపికగా ఎదురుచూస్తుండాలి. హార్మోన్లు ఆకలిని ప్రేరేపిస్తాయి.. ఏదైనా తినాలని చెబుతుంటాయి. వాటిని కంట్రోల్‌లో ఉంచుకోవాలి. బరువు తగ్గడం మొదలయ్యే వరకు వెయిట్ చేయాలి.

2. స్థిరత్వం లేకపోవడం వల్లే..

2. స్థిరత్వం లేకపోవడం వల్లే..

డైట్ పాటించే సమయంలో స్థిరత్వం చాలా ముఖ్యం. కొన్ని రోజులు డైట్ పాటించి, విపరీతమైన ఆకలి వల్ల తిరిగి సాధారణంగా లేదా అధికంగా తినడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. డైట్ పాటించడం మొదలు పెట్టిన తర్వాత దానిని కొనసాగించడం చాలా చాలా ముఖ్యం.

వారం మొత్తం డైట్ పాటించి వారం చివర్లో ఒక్కరోజే కదా అని కడుపు నిండుగా జంక్ ఫుడ్స్ తినడం వల్ల వారం అంతా చేసినదానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. శరీరం అలవాటు పడే వరకు స్థిరత్వం చాలా ముఖ్యం.

డైట్ పాటించడం కష్టమైన పని. ఇది శారీరకంగా కంటే మానసికంగా ఎక్కువ దృఢంగా ఉండాలి.

3. ఒక్కటి గుర్తుంచుకోండి

3. ఒక్కటి గుర్తుంచుకోండి

బరువు తగ్గడానికి ప్రయత్నం మొదలు పెట్టిన సమయంలోనే బాడీ కంపోజిషన్ టెస్టు చేయించుకోవడం ఉత్తమం. ఒంట్లో ఎంత కొవ్వు ఉందో దీని వల్ల తెలుస్తుంది. అలాగే కచ్చితమైన డైట్, రోజూ వ్యాయామం చేస్తూ కొన్ని రోజులు అయ్యాక మరోసారి టెస్టు చేయించుకుంటే శరీరంలోని ఎంత కొవ్వు కరిగిపోయిందో తెలుసుకోవచ్చు.

English summary

Reasons you are not losing weight even if you follow diet and do workouts in Telugu

read on to know Reasons you are not losing weight even if you follow diet and do workouts in Telugu
Story first published:Friday, December 9, 2022, 13:00 [IST]
Desktop Bottom Promotion