For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమ్మో! ఫిట్ నెస్ కోసం ఆలియా భట్ ఎలాంటి ఫీట్స్ చేస్తుందో మీరే చూడండి...

|

అలియా భట్ ఈ బాలీవుడ్ అందాల భామ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో రెండు వీడియోలను పోస్టు చేసింది. ఆ వీడియోలో వెయిట్ లిఫ్టింగ్ మరియు జంపింగ్ సేషన్లు, కఠినమైన జిమ్ ఎక్సర్ సైజ్ చిత్రాలు ఉన్నాయి. ఇంతకీ అలియా భట్ ఆ వీడియోలను ఎందుకు షేర్ చేసింది.. ఎవరికోసం అంతలా కష్టపడుతోంది.. తన తరువాయి చిత్రంలో పాత్ర కోసమే ఇదంతా చేస్తుందా లేదా ఇంకేదైనా కారణాలున్నాయా తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

చిన్ననాటి నుండే నటిగా పేరు తెచ్చుకున్న ఈ బాలీవుడ్ భామ 1999లో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత 2012లో సిద్ధార్త్ మల్హొత్రా, వరుణ్ ధావన్ హీరోలుగా నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో ముద్దుల సీన్లతో కుర్రకారుకు మత్తెక్కిచ్చింది. అంతేకాదు డ్యాన్స్, తన హావాభావాలతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తరువాత ఆమె వెనుదిరిగి చూడలేదు. వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తోంది.

ఇక విషయానికొస్తే అలియా భట్ తన రాబోయే చిత్రంలో తెరపై మరింత ఉత్తమంగా కనిపించడం కోసమే జిమ్ లో గంటల కొద్దీ సమయాన్ని గడుపుతోందట. అతి కష్టమైన వెయిట్ లిఫ్టింగ్, జంపింగ్ సేషన్లను చెమటోడ్చి పూర్తి చేసిందట. ఆమె ఫిట్ నెస్ గురువుతో పంచుకున్న వీడియోలనే ఆమె పోస్టు చేసింది. ఆమె ఎప్పటిలాగే వైట్ అండ్ బ్లాక్ డ్రెస్ ధరించి 50 కిలోల డెడ్ లిఫ్ట్ లను పది రూపాలలో చేసినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. ఇందుకోసం ఆమె తీవ్రంగా చెమటోడ్చినట్లు కనిపిస్తోంది. ఒక సెలబ్రెటీ అయిన అలియా భట్ ఇప్పటికీ తన ఫిట్ నెస్ కోసం అందరికంటే ఎక్కువగా కష్టపడుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. మానవాతీత ప్రయత్నాలను చేసి ప్రశంసలను సైతం అందుకుంటోంది.

ఇంకో వీడియోలో ఏముందంటే ఆమె ఎటువంటి సపోర్ట్ లేకుండా నేరుగా టేబుల్ మీదకు దూకడం కనిపిస్తుంది. ఆ వీడియో గురించి ఆమె గురువు ఇలా అన్నారు. "గత వారం అలియా భట్ అలా దూకలేనని చెప్పింది. ఆమె చాలా బలహీనంగా కనిపించింది. అయినా ఆమె 50.2 అడుగుల పెట్టే మీదకు దూకింది. అలియా భట్ కు ఆమె భయమే కచ్చితంగా సహాయపడే గొప్ప భాగస్వామ్యం!"

అలియా ఇటీవల తన సొంత యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే తన తాజా వీడియోలలో తాను ప్రతిరోజూ ఉదయం ఏయే పనులు చేస్తుందో వెల్లడించింది. ఆమె ఆచరించే కొన్ని ముఖ్యమైన అలవాట్లలో, ఆమెకు ప్రతిరోజూ ఉదయం లెమన్ వాటర్ తోనే స్టార్ట్ చేస్తారట. ఇంకా రోజంతా చాలా కాఫీ తాగుతుండేదాన్ని, కానీ ప్రస్తుత ఒక సమస్య కారణంగా కెఫిన్ తగ్గించినట్లు ఆమె పేర్కొన్నారు.

అలియా తన మొదటి మ్యూజిక్ వీడియో ప్రాడాను ది డోర్బీన్ ను విడుదల చేసింది. సింగర్ ద్వయం ఓంకార్ సింగ్, లంబెర్జిని ఫేమ్ గౌతమ్ శర్మ, శ్రేయా శర్మ పాడిన ఈ పాట సంగీత ప్రియులను తెగ ఆకట్టుకుంది. దీంతో అది కూడా బాగా హిట్ అయ్యింది. ఆ వీడియోలోని అవతార్ లో ఆమె సంగీతానికి కూడా ఆకర్షితురాలు అయ్యింది.

అలియా భట్ ప్రస్తుతం సడక్ -2 చిత్రీకరణలో బిజీ బిజీగా ఉంది. ఆమె తండ్రి మహేష్ భట్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అలియాకు జోడిగా ఆదిత్య రాయ్ కపూర్ నటించారు. ఒరిజినల్ లో నటించిన పూాజా భట్, సంజయ్ దత్ వంటి నటులు కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఆ తర్వాత ఆమె రాజమౌళి తీస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించనున్నారు. అంతేకాకుండా బ్రహ్మస్త్రా, ఇన్షల్లా, తఖ్త్ వంటి చిత్రాలలో నటించనున్నారు.

English summary

Alia Bhatt Shares A Video Of Her Doing Deadlift, Why You Should Start Doing This Exercise

Alia Bhatt spends hours in the gym looking for the best in her upcoming movie. Complete the most challenging weightlifting and jumping sessions. She posted the videos she shared with her Fit Ness teacher. The video shows that she has always done 50 kg of deadlifts in 10 forms, wearing a white and black dress. She seems to have cheated badly for this.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more