For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Chandra Namaskar: చంద్ర నమస్కారాలు చేస్తే ఇట్టే బరువు తగ్గుతారు

సూర్య నమస్కారాల గురించి అందరికీ తెలిసిందే. అయితే చంద్ర నమస్కారాల గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. సూర్య నమస్కారం ఉదయం వేళ సూర్యోదయం సమయంలో చేస్తే.. చంద్ర నమస్కారాలు సాయంత్రం వేళ చేసే యోగాసన క్రమం. రోజూ సాయంత్రం

|

Chandra Namaskar: సూర్య నమస్కారాల గురించి అందరికీ తెలిసిందే. అయితే చంద్ర నమస్కారాల గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. సూర్య నమస్కారం ఉదయం వేళ సూర్యోదయం సమయంలో చేస్తే.. చంద్ర నమస్కారాలు సాయంత్రం వేళ చేసే యోగాసన క్రమం. రోజూ సాయంత్రం వేళ చంద్ర నమస్కారాలు చేస్తే బరువు తగ్గుతారు.

Chandra Namaskar

చంద్ర నమస్కారాల వల్ల కేవలం బరువు తగ్గడమే కాకుండా ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు వైద్యులు. అసలు చంద్ర నమస్కారం ఎలా చేయాలి.. ఎప్పుడు చేయాలి.. ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Chandra Namaskar

చంద్ర నమస్కారం ప్రయోజనాలు:
* చంద్ర నమస్కారాలు మిమ్మల్ని చల్లబరుస్తాయి. శరీరానికి విశ్రాంతిని ఇస్తాయి. అలాగే వీపును బలంగా తయారు చేస్తాయి.
* రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
* రక్త ప్రసరణ మెరుగుపడటం వల్ల అంతర్గత అవయవాలు సక్రమంగా పని చేస్తాయి.
* సూర్య నమస్కారం లాగే, చంద్ర నమస్కారం చేయడం వల్ల వెన్నెముక బలపడుతుంది.
* స్నాయువులపై పని చేస్తుంది. కాలు, చేయి, వీపు, కడుపు కండరాలని బలోపేతం చేస్తుంది.

Chandra Namaskar

చంద్ర నమస్కారాలు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలు:

* చంద్ర నమస్కారం ప్రారంభించే ముందు మనస్సును, శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి. నిటారుగా నిలబడి, పాదాలను ఒక దగ్గర ఉంచాలి. మీ చేతులను పక్కకు ఉంచి, నెమ్మదిగా ఊపిరి పీల్చుకోవాలి.
* చంద్ర నమస్కారం చేసే సమయంలో నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. ఆసనం వేసే సమయంలో శ్వాసపై దృష్టి పెట్టాలి.

Chandra Namaskar

చంద్ర నమస్కారం స్థానాలు:

మొదటి దశ:

1. ప్రణమాసనం
2. హస్త ఉత్థాసన
3. పాదతాసనం
4. అశ్వ సంచలనాసనం
5. అర్ధ చంద్రాసనం
6. పర్వతాసనం
7. అష్టాంగ నమస్కారం
8. భుజంగాసనం
9. పర్వతాసనం
10. అశ్వ సంచలనాసనం
11. అర్ధ చంద్రాసనం
12. పాదస్థాసనం
13. హస్త ఉత్థానాసనం
14. ప్రణమాసనం

Chandra Namaskar

రెండో దశ:

15. ప్రణమాసనం
16. హస్త ఉత్థాసనం
17. పదశాసనం
18. అశ్వ సంచలనాసనం
19. అర్ధ చంద్రాసనం
20. పర్వతాసనం
21. అష్టాంగ నమస్కారం
22. భుజంగాసనం
23. పర్వతాసనం
24. అశ్వ సంచలనాసనం
25. అర్ధచంద్రాసనం
26. పదస్థానం
27. హస్త ఉత్థానాసనం
28. ప్రణమాసనం

Chandra Namaskar

వీటిని గుర్తుంచుకోండి:
* ఏదైనా అభ్యాసాన్ని ప్రారంభించే ముందు అర్హత కలిగిన యోగా శిక్షకుడి వద్ద శిక్షణ తీసుకోవాలి.
* హెర్నియా, హైబీపీ, పక్షవాతం, వెన్నెముక సమస్యలు, నడుము నొప్పి, సయాటిక, జ్వరం, గుండె జబ్బులు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ఆసనాలకు దూరంగా ఉండటం మంచిది.

చంద్ర నమస్కారాలు ఎప్పుడు చేయాలి?
* చంద్ర నమస్కారాలను రాత్రి పూట చంద్రుడు కనిపించే సమయంలో చేయాలి. ఇతర ఆసనాల మాదిరిగానే ఖాళీ కడుపుతోనే చేయాలి.
* చంద్ర నమస్కారం పూర్తి చేసిన తర్వాత కొంత సమయం పాటు శవాసనం చేయాలి.

English summary

Weight loss and other health benefits of chandra namaskar in Telugu

read on to know Weight loss and other health benefits of chandra namaskar in Telugu
Story first published:Friday, December 2, 2022, 18:05 [IST]
Desktop Bottom Promotion