Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
8 Hour Diet: ఈ 8 గంటల డైటింగ్ తో కేవలం 3వారాల్లో 10కిలోల బరువు తగ్గవచ్చు
8 Hour Diet: ఈ 8 గంటల డైటింగ్ తో కేవలం 3వారాల్లో 10కిలోల బరువు తగ్గవచ్చు
ఎలాంటి డైటింగ్ పాటించకుండా, కేవలం 3 వారాల్లో 10కిలోల బరువు తగ్గడం సాధ్యమేనా ? అంటే అవుననే అంటున్నాయి కొన్ని పరిశోధనలు..!
బరువు తగ్గడం కోసమని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అనేక డైట్ టిప్స్ ను పాటిస్తుంటారు. అయితే కఠినమైన డైట్ టిప్స్ తో ఆరోగ్య పరంగా ఇతర దుష్ప్రభావాలను కూడా గుర్తించుకోవాలి. కాబట్టి, ఎలాంటి దుష్ప్రభావాలు కలగకుండా బరువు తగ్గడానికి కొన్ని సాధారణ ఆహార పద్ధతులు కూడా ఉన్నాయి. అయితే వీటి గురించి చాలా మందికి తెలియదు. సులభంగా బరువు తగ్గడానికి 8 గంటల డైట్ ఒకటి.
8గంటల డైట్ అంటే అప్పుడప్పుడు ఉండాల్సిన ఉపవాస పద్దతి. ఈ డైట్ తో మీరు కేవలం 3 వారాల్లో 10 కిలోల వరకు బరువు తగ్గించుకోవచ్చు. ఈ డైట్ రక్తపోటును నియంత్రించడానికి మరియు పొట్ట వద్ద చేరిన కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. ఈ 8గంటల డైట్ ను ఎలా అనుసరించాలో ఈ వ్యాసం ద్వారా మీరు తెలుసుకోవచ్చు.

8 Hour Diet:
ఈ 8 గంటల డైట్ అంటే అడపాదడపా ఉపవాసం చేయటం వంటిది. ఈ 8గంటలలో మీకు కావల్సినది తినవచ్చు మరియు మిగిలిన 16 గంటలు ఏమీ తినకుండా ఉండాలి. బరువు తగ్గాలనుకునే వారికి ఈ 8గంటల డైట్ చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. ఈ విధానంలో మీరు ఆకలిని లేదా మీ ఆరోగ్యం విషయంలో రాజీ పడాల్సిన అవసరం ఉండదు.

ఇది ఎలా పనిచేస్తుంది?
ఈ 8 Hour Diet మైటోకాండ్రియా పనితీరును ప్రేరేపిస్తుంది. మైటోకాండ్రియా అనేది మన శరీరంలోని గ్లూకోజ్ ను శక్తిగా మార్చే కణ అవయవం. 16 గంటలు ఏమీ తినకపోవడం వల్ల మైటోకాండ్రియాను ప్రేరేపించడానికి సహాయపడుతుంది మరియు చెడు ఆహారం వల్ల కణాంతర నష్టాన్ని తగ్గిస్తుంది. గ్లైకోజెన్ మీ కండరాలు మరియు కాలేయంలో నిల్వ చేయబడిన గ్లూకోజ్ అణువు. ఉపవాసం ఉన్నప్పుడు, మీ శరీరం మొదట మరమ్మత్తు కోసం గ్లైకోజెన్‌ను ఉపయోగిస్తుంది మరియు తరువాత కొవ్వును ఉపయోగించడం ప్రారంభిస్తుంది.

మోటిఫ్
ఈ 8 Hour Diet వల్ల మీ జీవక్రియల పనితీరును పెంచుతుంది. మీ శరీరంలో గ్లైకోజెన్ మరియు కొవ్వును వేగంగా కరిగిస్తుంది. ఇది మీ శరీరానికి ఆహారాన్ని జీర్ణం చేయడానికి మరియు శరీరంలో విషపదార్థాలను(వ్యర్థాలను) తొలగించడానికి తగినంత సమయాన్ని అందిస్తుంది. మీకు కావలసినది ఏదైనా తినడానికి మిమ్మల్ని మీరు అనుమతించుకోవడం వల్ల ఆహారం పట్ల మీకున్న మక్కువ సజీవంగా ఉంటుంది.

8 Hour Diet సురక్షితమా?
పరిశోధనలు సురక్షితమనే చెబుతున్నాయి. ఉపవాసం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. పరిశోధనల్లో ఈ డైట్ లో పాల్గొన్నవారు వారిలో ఎలాంటి మజిల్ మాస్ నష్టం జరకుంగా బరువు తగ్గినట్లు కనుగొన్నారు. అంతేకాదు, అదే సమయంలో వారి శరీరంలో కొలెస్ట్రాల్ వెల్స్ మెరుగుపడ్డాయి, ఇంకా ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగింది దాంతో డయాబెటిస్ రిస్క్ తగ్గింది . అలాగే మెటబాలిక్ వ్యాధులు కూడా తగ్గినట్లు గుర్తించారు.

8 గంటల షెడ్యూల్
మొదట, రోజు విడిచి రోజు ఈ 8 Hour Dietను ప్రారంభించవచ్చు. తర్వాత దీన్ని ప్రతి రోజూ ఫాలో అవ్వొచ్చు. లేదా రెండు రోజులకొకసారి ప్లాన్ చేసుకోవచ్చు. అది మీరు ఆరోగ్యంగా ఫీలవుతున్నట్లు, బరువు తగ్గుతున్నట్లు అనిపిస్తే ఇలా చేయవచ్చు. దాని ప్రకారం మీ జీవనశైలిని ప్లాన్ చేసుకోవాలి. మీకు ఎప్పుడు ఎక్కువ ఆకలిగా అనిపిస్తుంది? మీ కార్యాలయంలో ఎంత సేపు మీరు పనిచేస్తునారు? అలాగే మీరు వ్యాయామానికి ఎంత సమయం కేటాయిస్తున్నారు? ఇవన్నీ పరిగణించండి. ఉదాహరణకు, మీకు ఇష్టమైనదాన్ని ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు తినండి. ఆ తర్వాత ఏమి తినకూడదు. తిరిగి మరుసటి రోజూ ఉదయం 10గంటలకే.

ఏమి తినాలి
అన్ని రకాల పండ్లు, కూరగాయలు తినండి. ప్రోటీన్ బీన్స్, సోయా, డైరీ ప్రొడక్ట్స్, గుడ్లు, చేపలు, చికెన్ బ్రెస్ట్ తినవచ్చు. మీరు గోధుమలు, బ్రౌన్ రైస్ మరియు క్వినోవా తినవచ్చు. అన్ని రకాల పాల ఉత్పత్తులను తినండి. మీకు అలెర్జీ కలిగించని మసాలా దినుసులను ఉపయోగించవచ్చు. అలాగే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, వెజిటేబుల్ జ్యూస్, కొబ్బరి నీళ్ళు, డిటాక్స్ డ్రింక్స్, గ్రీన్ టీ, బ్లాక్ టీ, మరియు కాఫీ కూడా తాగొచ్చు.

ఏమి తినకూడదు?
కొవ్వు పదార్థాలు మరియు నూనెలకు దూరంగా ఉండాలి. కొబ్బరి నూనె, ఫ్యాట్ ఆయిల్స్ మరియు వెన్న ముఖ్యంగా మానుకోండి. మీరు మద్యపానం అయితే, కొంత మొత్తాన్ని మాత్రమే తాగండి. శీతల పానీయాలు మరియు కృత్రిమ స్వీటెనర్లను మానుకోండి.

8 Hour Diet వల్ల కలిగే ప్రయోజనాలు
- ఈ డైట్ మీకు చాలా ప్రయోజనాలను అందిస్తుంది.
- మీ శరీరంలోని ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది
- జీవక్రియను పెంచుంతుంది
- శరీరంలోని టాక్సిన్‌లను తొలగిస్తుంది
- అదనపు వాటర్ వెయిట్ ను తొలగిస్తుంది
- టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందిః
- హార్మోన్ల సమతుల్యతకు సహాయపడుతుంది
- శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
- హార్ట్ డిసీజ్ లను తగ్గిస్తుంది.
- ఈ డైట్ ప్రారంభంలో ఆహారం తీసుకోకపోవడం వల్ల అలసట మరియు తరచుగా మూడ్ స్వింగ్ వంటి సమస్యలకు దారితీస్తుంది.
- కేలరీలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం మరియు స్నాక్స్ తినడం వల్ల బరువు తగ్గడానికి ఆస్కారం లేదు.
- భోజనం తర్వాత మీకు ఏవైనా స్నాక్స్ తినాలన్న కోరకలు కలగవచ్చు.
- మీలో ఈటింగ్ డిజార్డర్స్ పెరగవచ్చు.




Click it and Unblock the Notifications
