Latest Updates
-
వ్యాయామం చేసటప్పుడు విపరీతంగా చెమట.. కొవ్వు కరిగిపోతుందని అస్సలు సంబరపడొద్దు.! -
ఉదయం లేవగానే ఒళ్లు నొప్పులు, జాయింట్స్ పట్టేస్తున్నాయా? -
పప్పులు నానబెట్టే పనిలేదు,రుబ్బే శ్రమలేదు..అటుకులు,బంగాళదుంపలతో క్షణాల్లో కరకరలాడే అప్పడాలు.. -
ప్రెగ్నెన్సీలో చర్మం ఎందుకు నల్లబడుతుందో తెలుసా.. పిగ్మెంటేషన్‌ను ఇలా పోగొట్టుకోండి.! -
ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం.. శివయోగం ప్రభావంతో కాసుల వర్షం ఖాయం! -
గర్భస్రావం తర్వాత సంతాన సామర్థ్యం పెరుగుతుందా.. ఇందులో నిజమెంత.? -
జూన్ 24న శివ యోగం: ఈ సమయం నుంచి మీ కెరీర్, అదృష్టం మారుతుందా? -
ఇంట్లో శ్రీ చక్రం ఉంటే ఏమవుతుంది? ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన విషయాలు -
జూన్ 24 నుంచి తులా రాశిలో చంద్ర సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ధన లాభం ఖాయం! -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026
గొంతు నొప్పిని నివారించే హోం రెమిడీస్
వాటర్ చేంజ్ అయ్యాయంటే చాలు గొంతు నొప్పి సమస్య మొదలవుతుంది. కొన్ని సందర్భాల్లో బ్యాక్టీరియా, స్టెప్టోకోకస్ వంటివి గొంతులో చేరడం వల్ల ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. ఇలాంటి సమయంలో గొంతులో తీవ్ర నొప్పి వేధిస్తుంది. ఏది తినాలన్నా.. తాగాలన్నా.. గొంతులో ఇబ్బందిగా ఉంటుంది.
గొంతులో తీవ్రమైన నొప్పి వల్ల జ్వరం కూడా వస్తుంది. టాన్సిల్స్ లలో ఇన్ఫెక్షన్ లు కూడా గొంతు నొప్పికి కారణమని చెప్పవచ్చు. ఇలాంటి ఇన్ఫెక్షన్ ల వల్ల ఉన్నట్టుండి శరీర రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి గొంతులో వచ్చే నొప్పి నివారించడానికి ఇంట్లోనే పరిష్కార మార్గాలున్నాయి.

వేడి పదార్థాలు తాగడం
గొంతులో నొప్పిని తగ్గించాలంటే.. వేడిగా ఉండే టీ, కాఫీ, నీళ్లు తాగితే.. మంచి ఔషధంలా పనిచేస్తాయి. వేడి ద్రావణాలు తాగడం వల్ల మంచి రిలాక్సేషన్ అందుతుంది. హెర్బల్ టీ, కాఫీ, చికెన్ సూప్, నిమ్మరసం, తేనె కలిపిన వేడి నీళ్లు మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.

ఉప్పు కలిపిన వేడి నీళ్లు
ఉప్పు కలిపిన వేడి నీళ్లు మంచి ఫలితాన్నిస్తాయి. గొంతులో వచ్చే ఇన్ఫెక్షన్ లు మరియు గాయాలను తగ్గించుటలో ఇది శక్తివంతంగా పని చేస్తుంది. ఈ నీటితో పుక్కిలించటం వల్ల గొంతు భాగంలో కలిగే ఇన్ఫెక్షన్, నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. ఇలా రోజుకి 3 లేదా 4 సార్లు చేయడం మంచిది.

అల్లం
గొంతులో కలిగే నొప్పులను తగ్గించుటలో అల్లం పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. రోజంతా కొన్ని అల్లం ముక్కలను నమలుతూ ఉండాలి.. లేదా అల్లం టీ తాగినా.. వెంటనే ఉపశమనం కలుగుతుంది.

చెక్క, మిరియాలు: ఒక చెంచా దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, తేనెలను ఒక గ్లాసు వేడి నీటికి కలపాలి. ఈ మిశ్రమాన్ని నెమ్మదిగా తాగటం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది.
తులసి ఆకులు: తులసి ఆకులను నీటిలో కలిపి వేడి చేయాలి. చల్లారిన తర్వాత ఈ నీటితో పుక్కిలిస్తే మంచి ఫలితం ఉంటుంది. లేదా పసుపు కలిపిన వేడి పాలను, పడుకోవడానికి ముందు తాగాలి. ఇది గొంతులో ఉండే ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications