Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీ డ్యామేజ్ కి అసలు రీజన్స్ ఏంటి ??
హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవడం వల్ల.. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా.. హెల్తీగా ఉండవచ్చు. ఇది నిజమే అయినా.. ఎవరూ దీన్ని పక్కాగా ఫాలో అవలేరు. చాలా సందర్భాల్లో మనం అనారోగ్యానికి మన లక్, ఇతర కారణాలను చూపిస్తూ ఉంటాం. కానీ మనం ఫాలో అయ్యే హానికర అలవాట్లే.. మన శరీరంలోని వివిధ భాగాలపై దుష్ర్పభావం చూపుతాయని ఎవరూ గ్రహించడం లేదు.
మనకు తెలియకుండా మనం పాటించే అలవాట్లు.. అవయవాల్లో.. డ్యామేజ్ కి కారణమవుతాయి. మనుషుల శరీరంలో కిడ్నీ అనేది చాలా ముఖ్యమైనదని మనందరికి తెలుసు. ఇది రక్తంలో ఎలక్ట్రోలైట్స్ ని రెగ్యులేట్ చేసి, టాక్సిన్స్, మలినాలను శరీరం నుంచి బయటకు పంపుతుంది.
కిడ్నీ డ్యామేజ్ లేదా నెఫ్రోపతీ అనేది.. కిడ్నీల పనితీరు సజావుగా లేనప్పుడు వస్తుంది. ఇది కిడ్నీ ఫెయిల్యూర్ కి కూడా కారణమవుతుంది. కిడ్నీ ఫెయిల్యూర్ కి చాలా కారణాలుంటాయి. గాయాలు, లో బ్లడ్ ప్రెజర్, అంతర్గతంగా రక్తస్రావం, సర్జరీల సైడ్ ఎఫెక్ట్స్, సెప్టిక్ షాక్ వంటి కారణాల వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది.
అలాగే మనం రోజూ ఫాలో అయ్యే కొన్ని రకాల అలవాట్లు కూడా కిడ్నీ డ్యామేజ్ కి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి అలాంటి డేంజర్ హ్యాబిట్స్ ఏంటో చూద్దాం..

సరిపడా నీళ్లు తాగకపోవడం
మనలో చాలామంది.. సరిపడా నీళ్లు తాగడం మరిచిపోతూ ఉంటాం. రోజుకి కనీసం 2 లీటర్లు తాగాలి. కానీ.. ఇన్ని నీళ్లు తాగకపోవడం వల్ల.. డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. కిడ్నీల్లో స్టోన్స్, డ్యామేజ్ అవడానికి డీహైడ్రేషన్ ప్రధాన కారణం.

యూరిన్ లో సమస్య
పనిలో ఉన్నప్పుడు, జర్నీలో ఉన్నప్పుడు.. యూరిన్ కి వెళ్లాలని ఉన్నా.. వెళ్లకుండా ఉంటారు చాలామంది. దీనివల్ల.. కిడ్నీల్లో బ్యాక్టీరియా పేరుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణమై.. కీడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశాలుంటాయి.

ప్రొటీన్స్ ఎక్కువగా తీసుకోవడం
హైప్రొటీన్ ఉండే ఆహారాలను మితిమీరి తీసుకోవడం లేదా ప్రొటీన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల.. కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంది. ఇలా కిడ్నీ ఫెయిల్యూర్ కి కారణమవుతుంది.

సాల్ట్ ఎక్కువగా తినడం
రెగ్యులర్ గా ఎక్కువగా ఉప్పు ఉన్న ఆహారం తినడం వల్ల.. కిడ్నీలు చాలా కష్టపడి పనిచేసి..ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఇలా.. కిడ్నీ ఫెయిల్యూర్ కి అవకాశాలుంటాయి.

పెయిన్ కిల్లర్స్ రెగ్యులర్ గా తీసుకోవడం
చాలా మంది ఏ చిన్న నొప్పి వచ్చినా.. పెయిన్ కిల్లర్స్ పై ఆధారపడతారు. ఈ అలవాటు కిడ్నీలకు కూడా మంచిది కాదు. తరచుగా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల కిడ్నీలకు బ్లడ్ ఫ్లో తక్కువగా అందుతుంది. దీనివల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది.

ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం
మోతాదుకి మించి అతిగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల.. బ్లడ్ స్ట్రీమ్ లో యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుంది. ఇది కిడ్నీ డ్యామేజ్ కి కారణమవుతుంది.

ఇన్ఫెక్షన్స్ ని నిర్లక్ష్యం చేయడం
కామన్ ఇన్ఫెక్షన్స్ అయిన వైరల్ ఫ్లూ, టాన్సిల్స్, పొట్టకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కిడ్నీలు డ్యామేజ్ అవడానికి ఆస్కారం ఉంటుంది.



Click it and Unblock the Notifications