For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంతాన లేమికి గురిచేసే ఓవేరియన్ సిస్ట్ లను నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ...!

|

ఓవేరియన్ సిస్ట్ లేదా అండాశయ తిత్తి చిన్న సంచి మాదిరిగా ఉండి, స్త్రీ అండాశయంలో ఉంటుంది. ఇందులో ద్రవపదార్ధం ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతం చాలా మంది ఆడవారు ఇలాంటి సమస్యలకు గురవుతున్నారు. ఇలాంటి తిత్తిల వలన సాధారణంగా ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే, కొన్ని సమయాలలో వీటి వలన రక్తస్రావం, రాపిడి, నొప్పి కలుగుతుంది. ఓవేరియన్ సిస్ట్ చిన్నగా ఉంటుంది మరికొన్ని సందర్భాల్లో పెద్దగా కూడా ఉంటాయి . ఓవేరియన్ సిస్ట్ సమస్యలు ఏ వయస్సు వారికైనా రావచ్చు. ముఖ్యంగా చిన్న ఎగ్ ఆకారంలో ఏర్పడి తర్వాత పెద్దగా మారుతుంటాయి. ఓవేరియన్ సిస్టుల వల్ల సంతానంకు అంతరాయం కలుగుతుంది. ఓవెరిలో సిస్టులున్నప్పుడు, అండాలను విచ్ఛిన్నం చేయడంలో వీటి పాత్ర ఉంటుందంటే అతిశయోక్తి కాదు.

అలాంటప్పుడు శస్త్ర చికిత్స చేయటం ద్వారా ఇలాంటి ఓవేరియన్ సిస్టులను తొలగించవలసి వస్తుంది. ఇలాంటి వాటిలో కొన్ని ప్రాణాంతకంగా మరియు కేన్సర్ లాంటి వ్యాధికి దారి తీయవచ్చు. ఓవరీస్ లో ఎక్కువ సిస్టులు కనుక ఉన్నట్లైతే ఇవి హార్మోనుల అసమతుల్యత వల్ల ఏర్పడుతాయి. వీటినే పాలీసిస్టిక్ ఓవరీ డిసీజ్ అని పిలుస్తాము. ఇవి ఎలాంటి హాని చేయకపోయినా.. పెద్దగా మారక ముందే తగిన చికిత్సను తీసుకోవాలి. ఇలాంటి వ్యాధిని నయం చేయటానికి ఆధునిక అల్లోపతి ఔషదాలతో పాటూ, పలు రకాలైన ఆయుర్వేద మందులు అండాశయ తిత్తికి సంబంధించిన వ్యాధులను ఎలాంటి హాని కలగకుండా నయం చేస్తాయి.

వీటితో పాటు ప్రారంభదశలో కొన్ని లక్షణాలను గుర్తించినప్పుడు కొన్నిహోం రెమెడీస్ కూడా గ్రేట్ గా సహాయపడుతాయి. మోడ్రన్ మెడిసిన్స్ తో పోల్చితే హోం రెమెడీస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవి ఓవేరియన్ సిస్టులను చాలా గ్రేట్ గా నయం చేస్తాయి. కాబట్టి హోం రెమెడీస్ ను ఉపయోగించడం సురక్షితమైనవి.

ఓవేరియన్ సిస్టులున్నప్పుడు రుతుక్రమంలో ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం, రుతుక్రమంలో లోపాలు, బ్రెస్ట్ పెయిన్, పెల్విక్ పెయిన్, బ్రెస్ట్ టెండర్ నెస్, కడుపుబ్బరం, కడుపు ఉదయం వాపు మొదలగు లక్షణాలు కనబడుతాయి. మరి ఈ లక్షణాలన్నింటికి చెక్ పెట్టాలంటేఈ క్రింది తెలిపిన హోం రెమెడీస్ ను ఫాలో అవ్వాల్సిందే..!

ఆముదం నూనెతో ప్యాక్ :

ఆముదం నూనెతో ప్యాక్ :

ఆముదం నూనె అత్యధిక శక్తివంతమైన రెమెడీ. ఎందుకంటే ఆముదం నూనెను అప్లై చేయడం వల్ల ఆ ప్రదేశంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఓవేరియన్ సిస్ట్ ను నివారించడంలో ఇది పాపులర్ రెమెడీ. కాటన్ క్లాత్ ను ఆముదం నూనెలో డిప్ చేసి, సిస్ట్ వల్ల నొప్పిగా ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి.

హీట్ ప్యాడ్ :

హీట్ ప్యాడ్ :

హీటింగ్ ప్యాడ్స్ తో ఓవరీస్ ఉన్న పొట్టబాగంలో కాపాడం పెట్టుకోవడం వల్ల ఓవేరియన్ సిప్ట్స్ నుండి ఉపశమనం కలుగుతుంది. ఇది చాలా సింపుల్ అండ్ పవర్ ఫుల్ రెమెడీ. ఇది మజిల్ టెన్షన్స్ నివారిస్తుంది. కండరాల సలుపు, నొప్పిని కూడా తగ్గిస్తుంది. క్రమంగా ఒవేరియన్ సిస్ట్స్ లు కూడా తగ్గుతాయి.

యాపిల్ సైడర్ వెనిగర్ :

యాపిల్ సైడర్ వెనిగర్ :

యాపిల్ సైడర్ వెనిగర్ నేచురల్ రెమెడీ. ఎందుకంటే ఇది ఆల్కలైన్ నేచర్ కలిగి ఉంటుంది. ఇది పొటాషియంగా మార్పు చెందుతుంది. అంతే కాదు ఓవరీస్ లోని ఒవేరియన్ సిస్టులను ష్రింక్ చేస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ను బ్లాక్ స్ట్రాప్ మొలసెస్ తో తీసుకుంటే మరింత ఎఫెక్టివ్ రిజల్ట్ పొందవచ్చు.

బీట్ రూట్ :

బీట్ రూట్ :

బీట్ రూట్ లో బీటా సైయనిన్లు అత్యధికంగా ఉన్నాయి . ఇవి కేవలంలో బీట్ రూట్ లోనే అత్యధికంగా ఉన్నాయి. వీటిని ఆల్కలైన్ ఏజెంట్స్ అని కూడా పిలుస్తాము. ఓవేరియన్ సిస్ట్స్ వల్ల వచ్చే క్రాంప్స్ ను నివారించడానికి బీట్ రూట్ లోని ఆల్కలైన్ ఏజెంట్స్ గ్రేట్ గా సహాయపడుతాయి.

చమోమొలి టీ :

చమోమొలి టీ :

ఓవేరియన్ సిస్టుల వల్ల మహిళలల్లో వచ్చే అసౌకర్యం, నొప్పిని తగ్గించడానికి, విశ్రాంతి కలిగించడానికి చమోమొలీ టీ గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ ఏజ్ ఓల్డ్ ఎఫెక్టివ్ రెమెడీ నేచురల్ రిలాక్సెంట్ గా పనిచేస్తుంది. ఇది ఓవేరియన్ సిస్ట్స్ వల్ల వచ్చే పొట్టలో క్రాంప్స్ ను నివారిస్తుంది.

శరీరంను కదల్చాలి:

శరీరంను కదల్చాలి:

ఓవేరియన్ సిస్ట్ లను నుండి ఉపశమనం పొందడానికి, పెయిన్ ఫుల్ సిప్టమ్స్ ను నివారించడానికి చిన్న పాటి వ్యాయామాలు చేయడం, యోగ చేయడం వల్ల మీ శరీరంలో రిలాక్స్ అవుతుంది. సిస్ట్ సమస్యలుండవు. కూర్చొన్న ప్రదేశంలోనే అటు ఇటు కదలడం, లేచి స్ట్రెచ్ అవ్వడం, వంగడం వంటి చిన్న పాటి వ్యాయామాల వల్ల హార్మోనుల బ్యాలెన్స్ అవుతాయి. దాంతో సిస్ట్ సమస్యలుండవు.

 నీళ్ళు ఎక్కువగా తాగాలి:

నీళ్ళు ఎక్కువగా తాగాలి:

రోజులో మన శరీరానికి సరిపడా ద్రవాలను తీసుకోవాలి. ముఖ్యంగా సాధ్యమైనంత నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ ను బయటకు నెట్టివేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది చాలా ఎఫెక్టివ్ రెమెడీ. మరియు ఖర్చులేని రెమెడీ. కాబట్టి, సాధ్యమైనంత వరకూ నీరు ఎక్కువగా తాగాలి.

హెర్బ్స్:

హెర్బ్స్:

హెర్బల్ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల హార్మోనులు బ్యాలెన్స్ అవుతాయి. మూలికల్లో థెస్టిల్, బ్లాక్ కోహోస్ మొదలగు హెర్బ్స్ లో ఓవేరియన్ సిస్ట్ లను నివారించే శక్తి సామర్థ్యాలున్నాయి . అలాగే వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కొత్తగా సిస్టులు ఏర్పడకుండా నివారిస్తాయి .

English summary

Try These 8 Home Remedies For Ovarian Cysts

the women who experience the symptoms of ovarian cysts may encounter pain and discomfort in the abdominal area, irregularity in periods, etc. And these distressing symptoms can be hard to deal with. Fortunately, there are quite a few medicines and also natural remedies that are considered to be effective in dissolving these cysts and in preventing them from further recurring.
Desktop Bottom Promotion