For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేడి ఆవిర్లను తగ్గించే 10 సులభమైన ఇంటి చిట్కాలు

వేడి ఆవిర్లను తగ్గించే 10 సులభమైన ఇంటి చిట్కాలు

|

స్త్రీలలో మెనోపాజ్ దశ దాటుతూ ఉన్నప్పుడు వళ్ళంతా వేడి సెగలు లేదా ఆవిర్లు వస్తాయి. ఇది శరీరమంతా వెచ్చగా ఉంచుతుంది అనుకుంటారు. దీనితోపాటు కొన్నిసార్లు ఫ్లషింగ్ (చర్మం ఎర్రగా మారిపోవటం) మరియు ఆపలేనంత చెమట పట్టడం జరుగుతుంది.

ఈ స్థితి కొన్నిసార్లు ఇతర వైద్య స్థితుల వలన కూడా కలగవచ్చు.

దీని కోసం అనేక సంక్లిష్ట హార్మోనల్ థెరపీలు, మందులు ఉన్నా కూడా, ఇంట్లోనే సులభంగా వేడి ఆవిర్లను తగ్గించే చిట్కాలను ఇక్కడ అందించాం, పైగా ఇవి చాలా సహజమైనవి!

#1 చల్లని వాతావరణం

#1 చల్లని వాతావరణం

పడుకునేటప్పుడు చల్లని, ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించుకోండి. అధ్యయనాల ప్రకారం చల్ల ప్రదేశంలో పడుకోవటం వలన వేడి ఆవిర్ల ప్రభావాన్ని నియంత్రించవచ్చని తేలింది. ఇంకా, కాటన్ దుప్పట్లను వాడటం వేడి సెగలను చాలా తగ్గిస్తుంది.

#2 సోయా మరియు మొక్కల నుంచి వచ్చే సహజ పదార్థాలు

#2 సోయా మరియు మొక్కల నుంచి వచ్చే సహజ పదార్థాలు

సోయా మరియు ఇతర మొక్కల పదార్థాలు కూడా వేడి ఆవిర్లను తగ్గించటంలో ప్రభావం చూపిస్తయి. సోయాలో ఉండే ఐసోఫ్లేవోన్స్ మరియు సెనగలు, ఇతర పప్పులలో ఉండే రసాయన పదార్థాలు శరీరం సహజంగా ఉత్పత్తి చేసే ఈస్ట్రోజెన్ వలె ఉంటాయి. ఈ పదార్థాలు వేడి ఆవిర్ల ప్రభావానికి ఉపశమనాన్నిస్తాయి.

#3 బ్లాక్ కొహోష్ అద్భుతాలు చేస్తుంది!

#3 బ్లాక్ కొహోష్ అద్భుతాలు చేస్తుంది!

అమెరికన్ మహిళల్లో బ్లాక్ కొహోష్ దాని అద్భుత ప్రభావానికి చాలా పాపులర్ అయింది. వక్షోజాలు, గర్భాశయ క్యాన్సర్లు కలగచేసే ఈస్ట్రోజెన్ ను ఉత్పత్తి చేసే పదార్థాల లాగా కాకుండా, బ్లాక్ కొహోష్ సురక్షితమైనదని ఏళ్ళ నుంచి వాడుతూ వస్తున్నారు. ఇది కూడా వేడి ఆవిర్లను తగ్గించే సహజ చిట్కాలలో మేటిది.

#4 ఎర్ర లవంగం ప్రభావం

#4 ఎర్ర లవంగం ప్రభావం

ఎరుపు క్లోవర్ వేడి ఆవిర్లను తగ్గించటంలో సాయపడుతుందా లేదా అని అధ్యయనం చేసారు. కానీ కొంతమంది స్త్రీలు ఇది కూడా వేడి ఆవిర్లను తగ్గించటంలో చాలా ముఖ్యపాత్ర పోషిస్తుందని తెలిపారు. కానీ ఇది హార్మోన్ సంబంధ సున్నిత కణజాలంపై చెడు ప్రభావం చూపిస్తుందని మర్చిపోవద్దు.

#5 యాపిల్ సిడర్ వెనిగర్ !

#5 యాపిల్ సిడర్ వెనిగర్ !

యాపిల్ సిడర్ వెనిగర్ తినటం వేడి సెగలను తగ్గిస్తుందని నిరూపించబడింది. ఒక చెంచా డైల్యూట్ చేసిన యాపిల్ సిడర్ వెనిగర్ ను అరచెంచా వంటసోడాతో పాలల్లో కలపండి. ఈ మిశ్రమాన్ని ప్రతి భోజనానికి అరగంట ముందుగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

#6 చేస్ట్ చెర్రీ అద్భుతాలు!

#6 చేస్ట్ చెర్రీ అద్భుతాలు!

వేడి ఆవిర్లను తగ్గించటానికి ఛేస్ట్ చెర్రీ చాలా ముఖ్యమైన విధానం. పరిశోధకులు రోజూ ఛేస్ట్ చెర్రీ మీ ఆహారంతో పాటు తీసుకోవటం వలన వేడి సెగలు నెమ్మదిగా తగ్గిపోతాయని తెలిపారు. ఇది ఈస్ట్రోజెన్ స్థాయిని తగ్గించి ప్రొజెస్టరాన్ స్థాయిని పెంచటంలో సాయపడుతుంది. దీన్ని మీరు టాబ్లెట్ల రూపంలో లేదా టింక్చర్ల రూపంలో తీసుకోవచ్చు. సరైన డోస్ కోసం మీ ఫార్మసిస్టును తప్పక సంప్రదించండి.

#7లేడీ మాంటిల్స్ మాయ !#7లేడీ మాంటిల్స్ మాయ !

#7లేడీ మాంటిల్స్ మాయ !#7లేడీ మాంటిల్స్ మాయ !

లేడీ మాంటిల్ అనే మరో మొక్క నుంచి వచ్చిన పదార్థం వేడి ఆవిర్లనే కాదు భారీ రక్తస్రావం, కండరాలు పట్టేయడం నుంచి ఉపశమనం కూడా అందిస్తుంది. మెనోపాజ్ సమయంలో హార్మోన్ల స్థాయిని కూడా నియంత్రిస్తుంది ( వేడి సెగలను తగ్గించటానికి ఇది కూడా చాలా ముఖ్యం.)

#8 చైనీస్ పద్ధతి (డోంగ్ క్వాయ్)

#8 చైనీస్ పద్ధతి (డోంగ్ క్వాయ్)

డోంగ్ క్వాయ్ అనే చైనీస్ మొక్క వేడి ఆవిర్లను తగ్గించటంలో చాలా ప్రభావం చూపిస్తుంది. ఈ మొక్కలో ఉండే ఫైటో ఈస్ట్రోజెన్లు మెనోపాజ్ సమయంలో తగ్గే ఈస్ట్రోజెన్ స్థాయిని సమతుల్యం చేస్తాయి. రక్తనాళాలను శాంతపర్చి, వేడి ఆవిర్ల లక్షణాలకు ఉపశమనాన్నిస్తుంది.

#9 ఎక్సోటిక్ లావెండర్ టీ

#9 ఎక్సోటిక్ లావెండర్ టీ

లావెండర్ టీ పదం ఎంత ఎక్సోటిక్ గా అన్పిస్తుమ్దో, అంత ఆరోగ్య లాభాలను కూడా కలిగి ఉంటుంది. ఇది వేడి ఆవిర్ల సమస్యలను తగ్గించటంలో సాయపడటమే కాక ఆరోగ్యకర జీవన విధానానికి కూడా ఉపయోగపడుతుంది. నిద్రపోయే ముందు ఒక కప్పు లావెండర్ టీ తాగటం వలన వేడి ఆవిర్ల అవకాశాలను సగానికి తగ్గిస్తుంది. ఇది మానసిక ఆందోళన, కండరాల నొప్పులను, తలనెప్పులు మొదలైన వాటి మెనోపాజ్ లక్షణాలను, హార్మోన్ స్థాయిలలో మార్పులను తగ్గిస్తుంది.

ప్రభావవంతమైన సింపుల్ చిట్కాలు చేయదగినవి ;

ప్రభావవంతమైన సింపుల్ చిట్కాలు చేయదగినవి ;

పైన చెప్పిన ప్రత్యేక మొక్కల ఉత్పత్తులు మాత్రమే కాక ఇక్కడ కింద తెలిపిన సింపుల్ విధానాలలో కూడా మీరు వేడి ఆవిర్లను తగ్గించుకోవచ్చు ;

విటమిన్ డి ఎక్కువ ఉండే ఆహారం తినండి. ఎందుకంటే అందులో ఉండే కాల్షియం వేడి ఆవిర్లను తొందరగా తగ్గిస్తుంది. విటమిన్ సి మరియు ఇ కూడా అదనపు లాభాన్ని అందిస్తాయి.

చల్లటి నీరు మెల్ల మెల్లగా తాగటం కూడా వేడి ఫీలింగ్ ను మొదటగా తగ్గిస్తుంది. ఇది అప్పటికప్పుడు వేడి ఆవిర్లనుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

రాత్రిపూట తేలికపాటి దుస్తులు, ఎసి ఉన్న గదుల్లో పడుకోవటం వంటికి వేడి ఆవిర్లు రాకుండా చేస్తాయి.

తేలికపాటి వ్యాయామాలు అన్నిరకాల సమస్యలు తగ్గించటానికి ఎలాగో ఉపయోగపడతాయి. ప్రత్యేకంగా వ్యాయామాలు, యోగా మరియు ధ్యానం వేడి ఆవిర్లను తగ్గించటంలో చాలా సాయపడతాయి. ఎందుకంటే స్థూలకాయులు తరచుగా ఈ వేడి ఆవిర్ల బారిన పడతారు.

వేడినీళ్ల బదులు చల్లనీటి స్నానం చేయటం వేడి ఆవిర్లను తగ్గించే మరో సింపుల్ చిట్కా.

వేడి ఆవిర్లు వస్తున్న సమయంలో తగ్గించడానికి చేయకూడనివి ఏమిటి?

మానసిక ఆందోళనకు గురవకండి

మానసిక ఆందోళనకు గురవకండి

ఇది వేడిసెగలను మరింత పెంచుతుంది.

కెఫీన్ ఉన్న పానీయాలను తాగకుండా, విటమిన్లు ఎక్కువ ఉండే పళ్ళరసాలను తాగండి.

పొగతాగడం, మద్యం తీసుకోవడం వంటి అనారోగ్యకర జీవనవిధానాలకు దూరంగా ఉండండి.

టైటుగా ఉండే దుస్తులు, సింథటిక్ దుస్తులు వంటి వాటికి వేడి ఆవిర్లను తగ్గించుకోటానికి దూరంగా ఉండండి.

English summary

Easy home remedies to get rid of hot flashes effectively.

Hot flashes are a common occurrence in women undergoing menopause. Here are a few simple yet effective home remedies to get rid of hot flashes, naturally.
Desktop Bottom Promotion