For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొద్దిసమయంలో మీ గ్యాస్ ను కడుపునొప్పిని తగ్గించే దివ్య ఔషధం !

By Deepti
|

మీరు ఒక పెళ్ళికి వెళ్ళి అక్కడ విందుభోజనం బాగా ఆనందంగా తినివస్తారు ; తర్వాత రోజు ఉదయం మీకు గ్యాస్, తీవ్రంగా కడుపునొప్పి వస్తుంది !

మీకు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఎదురైందా? అవును అయితే ఇకముందు మళ్ళీ ఏది పడితే అది తినేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు ఇక, అంతేనా?

ఇంకెప్పుడూ ఏది పడితే అది తినకూడదని ఎంత అనుకున్నా సరే, దాన్ని పాటించడం చాలా కష్టం. అందుకే మనకి మళ్ళీ మళ్ళీ కడుపునొప్పులు వస్తూనే ఉంటాయి.

natural remedy for gas

అనారోగ్యకర ఆహారం, వ్యాయామం లేకపోవడం, కడుపులో పుళ్ళు, భోజనం మానేయటం, సరిగా సమయానికి తినకపోవటం వంటివన్నీ కడుపులో అధిక ఆమ్లాలు ఉత్పత్తి అవటానికి కారణమయి, గాస్ట్రైటిస్, యాసిడ్ రిఫ్లక్స్, కడుపు నొప్పి వంటివి వస్తాయి.

పొట్ట ఉబ్బరం..గ్యాస్..ఎసిడిటిని తగ్గించే ఆహారాలు..!పొట్ట ఉబ్బరం..గ్యాస్..ఎసిడిటిని తగ్గించే ఆహారాలు..!

గ్యాస్ ఎక్కువయినపుడు మొదట కన్పించే లక్షణం కడుపునొప్పి. గుండెల్లో మంట, ఆగకుండా గ్యాస్ రావటం, తేపులు, గొంతునొప్పి, వికారం,వాంతులు వంటివి కూడా రావచ్చు.

ఈ అధికగ్యాస్ కి కారణం మానసిక వత్తిడి కూడా కావచ్చు. ఎందుకంటే కార్టిసోల్ అనే హార్మోన్, మీరు అధిక వత్తిడిలో ఉన్నప్పుడు,శరీరంలో పెరిగి కడుపులో అధికంగా యాసిడ్లు ఉత్పత్తి చేస్తుంది.

జీవనవిధానంలో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ సమస్యలు రాకుండానే చూసుకోవచ్చు.

మీరు ఒకవేళ దీన్ని చిన్నదే అని పట్టించుకోకుండా వదిలేస్తే, అది పెద్దదయి, ప్రేగులను తినేయటమో, పెద్దపేగు క్యాన్సర్ కి కూడా దారితీయవచ్చు !

మీకు గ్యాస్ సమస్య తీసుకొస్తున్న ఆహారాలేంటో తెలుసా ? మీకు గ్యాస్ సమస్య తీసుకొస్తున్న ఆహారాలేంటో తెలుసా ?

అందుకని కడుపు పాడయ్యే ఏ పనుల నుంచైనా దూరంగా ఉండటం ముఖ్యం. అంతేకాదు, దానికి త్వరగా చికిత్స తీసుకోవడం కూడా అవసరం.

natural remedy for gas

చాలాసార్లు, మనం కడుపునొప్పికి, గ్యాస్ కు యాంటాసిడ్లు తీసుకుని వెంటనే ఉపశమనం పొందుతాం. అత్యవసర స్థితులలో పెయిన్ కిల్లర్స్ కూడా అవసరమవ్వచ్చు.

అధిక గ్యాస్, కడుపునొప్పికి సహజ చికిత్స కోసం చూస్తున్నట్లయితే, ఈ వంటింటి చిట్కా చూడండి !

కావాలసిన వస్తువులు ;

  • తాజా గుమ్మడికాయ రసం - ½ గ్లాసు
  • యాపిల్ సిడర్ వెనిగర్- 3 చెంచాలు

ఈ పద్ధతిని ఎప్పుడూ సాధారణంగా వాడుతూ ఉంటే, ఈ సహజ చిట్కా కడుపునొప్పి, అధిక గ్యాస్ కు అద్భుతంగా పనిచేస్తుంది.

ఇంకా మీరు ఆరోగ్యకర జీవన విధానాలు పాటించి, మంచి ఆహారం తిని, ఎసిడిటీ వచ్చే పదార్థాలు తినటం మానేయాలి. ఇది బాగా పనిచేయాలంటే రోజూ వ్యాయామం తప్పనిసరి.

natural remedy for gas

గుర్తుపెట్టుకోండి, మీ కడుపునొప్పి గ్యాస్ వల్ల వచ్చినది కాకపోతే, ఈ చిట్కా పనిచేయకపోవచ్చు. అలాంటప్పుడు మీరు వైద్యున్ని సంప్రదించటం మంచిది.

గుమ్మడి రసం సహజ క్షారం, ఇది మీ ప్రేగులకు చల్లగా ఉండి మంట తగ్గించి, ఎసిడిటీ, కడుపునొప్పిని తగ్గిస్తుంది.

యాపిల్ సిడర్ వెనిగర్ కూడా మరొక సహజ పదార్థం. ఇది కడుపులో ఉత్పత్తి అయ్యే అధిక ఆమ్లాలను సమం చేసి, యాసిడ్ రిఫ్లక్స్ ( అంటే ఆమ్లాలు ఆహారనాళంలో వెనక్కి ప్రవహించి గొంతులోకి తన్నుకురావటం), అధిక గ్యాస్, కడుపునొప్పిని తగ్గిస్తుంది. యాపిల్ సిడర్ వెనిగర్ కడుపులో వాపును కూడా తగ్గిస్తుంది.

పొట్ట ఉబ్బరం మరియు గ్యాస్ సమస్యలను నివారించే బెస్ట్ ఫుడ్స్పొట్ట ఉబ్బరం మరియు గ్యాస్ సమస్యలను నివారించే బెస్ట్ ఫుడ్స్

తయారీ విధానం ;

  • సూచించిన అన్ని పదార్థాలను ఒక గ్లాసులో కలపండి.
  • బాగా కలిపి రసంలా చేయండి.
  • మీకు ఎప్పుడు గ్యాస్ లేదా కడుపునొప్పి అన్పించినా వెంటనే ఇది తాగండి.

English summary

Magical Mixture That Can Reduce Gas And Stomach Ache Within Hours!

If you want to treat gastritis right at home, then here is one of the best remedies!
Desktop Bottom Promotion