For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ చలికాలం చెవి ఇన్ఫెక్షన్లను నియంత్రించడానికి 8 అద్భుతమైన పద్దతులు

వెచ్చని కాఫీ సమయాలకి శీతాకాలం అందంగా కన్పించవచ్చు కానీ అదొక్కటే కాదు. వణికించే చలితోపాటు, శీతాకాలం అనేక ఇన్ఫెక్షన్లు, రోగాలను కూడా వెంటబెట్టుకు వస్తుంది. సరైన సమయంలో వాటికి సంరక్షణ తీసుకోకపోతే, అవి తీ

|

వెచ్చని కాఫీ సమయాలకి శీతాకాలం అందంగా కన్పించవచ్చు కానీ అదొక్కటే కాదు. వణికించే చలితోపాటు, శీతాకాలం అనేక ఇన్ఫెక్షన్లు, రోగాలను కూడా వెంటబెట్టుకు వస్తుంది. సరైన సమయంలో వాటికి సంరక్షణ తీసుకోకపోతే, అవి తీవ్రమైన ఆరోగ్య సమస్యలుగా మారే అవకాశం ఉంది.

మొదటగా, చలికాలంలో చెవి ఇన్ఫెక్షన్లు ఎందుకు పెరుగుతాయో తెలుసుకుందాం.

ఇది ముఖ్యంగా చెవుల్లో సున్నితత్వం ఎక్కువగా ఉండి, చలికి, చలిగాలి తగిలినప్పుడు మరింతగా పెరుగుతుంది. అది చికాకును పెంచి, లోపల పేరుకునే తేమ లేదా బ్యాక్టీరియా తీవ్ర నొప్పి స్థితిని కలుగచేస్తుంది. దీన్ని ఓటిటిస్ మీడియా (మధ్యచెవిలో వాచే వ్యాధి) అంటారు.

how to prevent ear infections in winter

చలికాలంలో చెవి ఇన్ఫెక్షన్లను ఎలా నివారించాలి

అయితే ఏమవుతుందంటే, ఇన్ఫెక్షన్ సోకిన పదార్థం యూస్టాషియన్ ట్యూబ్ కు అడ్డం పడి, కర్ణభేరి వెనకాల పెరగటం ప్రారంభిస్తుంది. ఇది చాలా నొప్పి మరియు ఇన్ఫెక్షన్ పెరిగేలా చేస్తుందని యశ్వంతపూర్ కి చెందిన కొలంబియా ఏషియా రిఫరల్ హాస్పిటల్ కి చెందిన డా. శ్రీనివాస మూర్తి అభిప్రాయపడ్డారు.

సరైన సమయంలో సంరక్షణ తీసుకోకపోతే చెవుడుకి కూడా దారితీయవచ్చు. అందరికన్నా పిల్లల్లో ఇది తీవ్రప్రభావం చూపిస్తుంది ఎందుకంటే పెద్దవారిలో కన్నా వారి యూస్టాషియన్ ట్యూబ్ చిన్నగా, అడ్డంగా ఉంటుంది.

తీవ్ర చెవినొప్పి, వినికిడి సమస్యలు, చెవుల్లోంచి చీము లేదా రక్తం కారడం, చెవుల్లో గింగురుమంటూ శబ్దాలు, జ్వరం, ఆకలి తగ్గిపోవటం వంటివి పెద్ద చెవి సంబంధ ఇన్ఫెక్షన్ల లక్షణాలు. ఇవి ముఖ్యంగా శీతాకాలాల్లో వస్తాయి.

చలికాలాల్లో చెవి ఇన్ఫెక్షన్లను నివారించుకోవడానికి ఇక్కడ కొన్ని పద్ధతులు వివరించాం. చదవండి.

1.చెవులను వెచ్చగా మరియు పొడిగా ఉంచుకోండి

1.చెవులను వెచ్చగా మరియు పొడిగా ఉంచుకోండి

బయటకి వెళ్ళినపుడు ముఖ్యంగా మీ చెవులను మూసి ఉంచుకోవాలని గుర్తుంచుకోండి. వణికించే చలిగాలుల మధ్య మీ చెవులలో చేరే తేమ మరియు బ్యాక్టీరియా వల్ల చికాకు, నొప్పి కలగవచ్చు, అందుకని చెవులను ఎప్పుడూ వెచ్చగా, పొడిగా ఉంచుకోండి.

2.పొగ తాగకండి

2.పొగ తాగకండి

పొగతాగడం ఆరోగ్యానికి హానికరం. అది కూడా ముఖ్యంగా చలికాలంలో మరింత ఎక్కువ. పొగతాగడం వలన యూస్టాషియన్ ట్యూబులో వాపు వచ్చి వినికిడి సమస్య తలెత్తవచ్చు. సరైన సమయంలో గుర్తించకపోతే, శాశ్వతంగా చెవుడు రావచ్చు కూడా.

3.ఆరోగ్యకరమైన ఆహారం

3.ఆరోగ్యకరమైన ఆహారం

మంచి ఆరోగ్యకర ఆహారం చాలా ముఖ్యం, అది కూడా చలికాలం వస్తున్నప్పుడు. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచి , మీ శరీరంపై అనేక ఇన్ఫెక్షన్ల దాడిని నియంత్రిస్తుంది. ఆరోగ్యకర ఆహారం రక్తప్రసరణను స్థిరంగా ఉంచి మిమ్మల్ని ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది.

4. క్రమంగా వ్యాయామం

4. క్రమంగా వ్యాయామం

ఆరోగ్యకర ఆహారంతో పాటు, క్రమం తప్పకుండా వ్యాయామం తప్పనిసరి, ప్రత్యేకంగా చలికాలంలో మరింత ముఖ్యం. ఇది మంచి రక్తప్రసరణతో పాటు ఆరోగ్యంగా ఉంచుతుంది. వ్యాయామం అంటే జిమ్ కి వెళ్ళటం మాత్రమే కాదు, నడక, జాగింగ్, సైక్లింగ్ వంటివి రోజుకి కనీసం 30 నిమిషాల పాటు అయినా చేస్తే మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

5.వ్యక్తిగత శుభ్రత

5.వ్యక్తిగత శుభ్రత

మీరు ఆరోగ్యంగా ఉండి ఇన్ఫెక్షన్ల నుండి దూరంగా ఉండాలంటే వ్యక్తిగత శుభ్రత తప్పనిసరి. తినేముందు మీ చేతులు కడుక్కోవటం వలన జలుబు, అలర్జీలకి దూరంగా ఉండవచ్చు. జలుబు, అలర్జీల వలన ద్రవాలు చెవిలో పేరుకుపోయి, చెవి ఇన్ఫెక్షన్లకి దారితీస్తుంది. ఇది చెవినొప్పి కలుగచేసి చెవి సరిగా వినపడదు.

6.మంచి నిద్ర

6.మంచి నిద్ర

ఆరోగ్యకరమైన ఆహారమేకాక, మంచి నిద్ర కూడా మీ రోగనిరోధక శక్తిని బలంగా మార్చి, ఇన్ఫెక్షన్లను నియంత్రిస్తుంది. చెవి ఇన్ఫెక్షన్లు, చికాకు రాకుండా ఉండాలంటే జలుబు, దగ్గు, అలర్జీలు, ఫ్లూ జ్వరాలను దూరంగా ఉంచుకోవటం చాలా ముఖ్యం.

7.ఒంట్లో బాలేని వారి చుట్టూ ఉండకండి.

7.ఒంట్లో బాలేని వారి చుట్టూ ఉండకండి.

ఫ్లూ అంటుకునే జ్వరం. అందుకని జలుబు, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లతో బాధపడేవారి చుట్టూ ఉండకండి. ఎందుకంటే మీకు ఫ్లూ అంటుకుంటే, చెవి ఇన్ఫెక్షన్ కి కూడా దారి తీయవచ్చు.

8.వైద్యుని సంప్రదించండి

8.వైద్యుని సంప్రదించండి

చెవిలో చికాకు, నొప్పి చాలా సమయం వరకు ఉండి తగ్గకపోతే, వైద్యుని సంప్రదించి అవసరమైన మందులు తీసుకోవటం మంచిది. అది అలా పట్టించుకోకుండా వదిలేస్తే మరింత తీవ్రమైన చెవి సమస్యలకి దారితీసి, చెముడు రావచ్చు.

English summary

Tips To Prevent Ear Infections In Winter

Ear infections is on the rise during the winter season. Ear pain and problem in hearing are major problems faced by many when exposed to cold and chilly wind. A few preventive measures like avoiding smoking, taking up a healthy diet and exercise helps prevent ear infections..
Desktop Bottom Promotion