బ్రెస్ట్ పెయిన్ ను తగ్గించే 10 అద్భుతమైన హోమ్ రెమెడీస్

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

మహిళల్లో బ్రెస్ట్ పెయిన్ అనేది వివిధ కారణాల వలన తలెత్తుతుంది. బ్రెస్ట్ లో షార్ప్ గా మొదలయ్యే నొప్పి ఇబ్బందికి గురిచేస్తుంది. ఇది మెన్స్ట్రువల్ సైకిల్ లో సాధారణంగా కనిపిస్తుంది. 50 నుంచి 70 శాతం మహిళలు ఈ నొప్పితో ఇబ్బంది పడుతున్నారని కేలిఫోర్నియా పెసిఫిక్ మెడికల్ సెంటర్ స్పష్టం చేస్తోంది.

బ్రెస్ట్ లో సిస్టస్ లు ఏర్పడటం, హార్మోన్స్ ప్రభావం, బ్రెస్ట్ ఫీడింగ్, అమ్మాయిలలో ప్యూబర్టీ త్వరగా రావడం, మెనోపాజ్, బ్రెస్ట్ సర్జరీ, సరైన బ్రాను ధరించకపోవడం వంటివి బ్రెస్ట్ పెయిన్ కి కారణమవుతాయి.

బ్రెస్ట్ పెయిన్ అనేది రెండు రకాలు. సైక్లిక్ బ్రెస్ట్ పెయిన్ మరియు నాన్ సైక్లిక్ బ్రెస్ట్ పెయిన్ గా బ్రెస్ట్ పెయిన్ ను పరిగణించవచ్చు. సైక్లిక్ బ్రెస్ట్ పెయిన్ అనేది పీరియడ్స్ కి ముందు ఆ తరువాత తలెత్తుతుంది. నాన్ సైక్లిక్ బ్రెస్ట్ పెయిన్ అనేది ఇంజ్యూరీస్, క్యాన్సరేస్ లంప్స్ మరియు నెర్వ్ కాంప్లెక్సిటీ వలన తలెత్తుతుంది.

 10 Home Remedies To Cure Breast Pain

బ్రెస్ట్ లో తీవ్రమైన నొప్పి, టెండర్నెస్ వంటివి బ్రెస్ట్ పెయిన్ లక్షణాలు. ఈ పెయిన్ ను భరించలేని వారు హోమ్ రెమెడీస్ ను ప్రయత్నిస్తే కాస్తంత ఉపశమనాన్ని పొందవచ్చు.

ఈ రెమెడీస్ ను ప్రయత్నించి బ్రెస్ట్ పెయిన్ నుంచి ఉపశమనం పొందండి మరి.

మసాజ్

బ్రెస్ట్ ని మసాజ్ చేయడం ద్వారా బ్లడ్ సర్క్యూలేషన్ మెరుగై ఇంఫ్లేమేషన్ తగ్గుముఖం పడుతుంది.

రెండు టేబుల్ స్పూన్ల వెచ్చటి ఆలివ్ ఆయిల్ ను తీసుకుని బ్రేస్ట్స్ ని రోజుకు రెండుసార్లు మసాజ్ చేయండి.

క్యాస్టర్ ఆయిల్

క్యాస్టర్ ఆయిల్ లో రిసినోలీక్ యాసిడ్ లభ్యమవుతుంది. ఇది యాంటీ ఇంఫ్లేమేటరీ మరియు అనాల్జేసిక్ ప్రాపర్టీలు కలిగినది. ఇది బ్రెస్ట్ పెయిన్ నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

ఒక టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ ను 2 టీస్పూన్ల కొబ్బరి నూనెలో లేదా ఆలివ్ నూనెలో బాగా కలపాలి.

ఈ బ్లెండ్ తో బ్రెస్ట్స్ ని మసాజ్ చేయాలి.

ఈ పద్దతిని రోజూ పాటించాలి.

చేస్ట్ బెర్రీ

ఈ హెర్బ్ అనేది పిఎమ్ఎస్ లక్షణాలను అలాగే బ్రెస్ట్ పెయిన్ ను తగ్గించడంలో ముందుంటుంది. ఇది పిట్యూటరీ గ్లాండ్ పై ప్రభావవంతంగా పనిచేస్తుంది. తద్వారా ప్రొలాక్టిన్ అనే హార్మోన్ విడుదలను సప్రెస్ చేస్తుంది. ఈ హార్మోన్ పిఎంఎస్ లక్షణాలను కలిగించడానికి కారణమవుతుంది.

చేస్ట్ బెర్రీని ద్రవం కింద తీసుకోవచ్చు. ఒక గ్లాసుడు నీళ్లలో దాదాపు 40 చుక్కల చేస్ట్ బెర్రీ ఎక్స్ట్రాక్ట్ ని వేసి ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని సేవించాలి.

ఈవెనింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్

ఈవెనింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్ లో బ్రెస్ట్ పెయిన్ ను తగ్గించే ముఖ్య పదార్థం కలదు. అందువలన, ఈ ఆయిల్ ను వాడటం ద్వారా బ్రెస్ట్ పెయిన్ నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు.

కొన్ని చుక్కల ఈవెనింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్ ను బ్రేస్ట్స్ పై అప్లై చేయండి.

దాదాపు 5 నిమిషాల పాటు బ్రెస్ట్స్ ని మసాజ్ చేయండి.

మెంతులు

బ్రెస్ట్ పెయిన్ ను తగ్గించే లక్షణాలు మెంతులలో కలవు. ఫిమేల్ హార్మోన్స్ ని బాలన్స్ చేసి వాటర్ రిటెన్షన్ ని తగ్గించడానికి మెంతులు తోడ్పడతాయి.

ఒక టీస్పూన్ మెంతిగింజలను ఒక కప్పుడు వేడినీటిలో కలపాలి.

ఈ నీటిని పది నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తరువాత వడగట్టి ఈ టీని తీసుకోవాలి.

ఆపిల్ సిడర్ వినేగార్

బ్రెస్ట్ పెయిన్ ని క్యూర్ చేయడానికి ఆపిల్ సిడర్ వింగర్ తోడ్పడుతుంది. హార్మోన్స్ ని నియంత్రించి బ్రెస్ట్ పెయిన్ ను అలాగే టెండర్నెస్ ను తగ్గిస్తుంది.

రెండు టీస్పూన్ల ఆపిల్ సిడర్ వినేగార్ ను ఒక గ్లాసుడు వెచ్చటి నీటిలో కలపాలి.

ఇందులో కొన్ని తేనె చుక్కలని కలిపి తాగాలి.

ఈ విధంగా రోజుకు రెండుసార్లు చేయాలి.

విటమిన్ ఈ

బ్రెస్ట్ పెయిన్ ను తగ్గించేందుకు విటమిన్ ఈ తోడ్పడుతుంది. హార్మోన్స్ ని నియంత్రించి బ్రెస్ట్ పెయిన్ ను తగ్గిస్తుంది.

విటమిన్ ఈ పుష్కలంగా కలిగిన సన్ ఫ్లవర్ సీడ్స్, ఆల్మండ్స్, ఆలివ్ ఆయిల్, స్పినాచ్, అవొకాడో, బీట్రూట్ , గ్రీన్స్ వంటివి తీసుకోవడం ద్వారా విటమిన్ ఈ ను పొందవచ్చు.

మెగ్నీషియం

మెన్స్ట్రువేషని సమయంలో బ్రెస్ట్ పెయిన్ మరియు టెండర్నెస్ ను తగ్గించే సామర్థ్యం మెగ్నీషియంకి కలదు. మెగ్నీషియం పుష్కలంగా కలిగిన డార్క్ లీఫీ గ్రీన్స్, నట్స్, సీడ్స్, అవొకాడోస్, బనానాస్ మరియు డార్క్ చాకొలేట్ ను తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

ఐస్ ప్యాక్

బ్రెస్ట్ పెయిన్ ను తగ్గించడానికి ఐస్ ప్యాక్ తోడ్పడుతుంది. చల్లటి ఉష్ణోగ్రతకు ఇంఫ్లేమేషన్ ను అలాగే పెయిన్ ను తగ్గించే సామర్థ్యం కలదు.

ఒక టవల్ లో కొన్ని ఐస్ క్యూబ్స్ ని అమర్చండి.

ఈ టవల్ ని బ్రెస్ట్స్ పై పదినిమిషాల పాటు ఉంచండి.

ఈ పద్దతిని రోజులో కొన్ని సార్లు పాటించండి.

దాండేలియన్

బ్రెస్ట్ పెయిన్ ను మరియు టెండర్నెస్ ను డీల్ చేయడానికి దాండేలియన్ తోడ్పడుతుంది. ఇందులో పొటాషియం లభిస్తుంది. ఇంకా ఇది న్యాచురల్ డైయూరేటిక్ గా పనిచేస్తుంది.

ఒక టీస్పూన్ ఎండిన దాండేలియన్ రూట్ ని ఒక కప్పుడు నీటిలో కలపండి.

ఈ నీటిని పదిహేను నిమిషాలపాటు మరిగించండి.

రోజుకు ఒకసారి ఈ నీటిని తాగండి.

English summary

10 Home Remedies To Cure Breast Pain

Breast pain affects 50 to 70 percent of women, according to the California Pacific Medical Center. It mainly occurs due to menstruation, but there are home remedies that can treat breast pain. These include evening primrose oil massage, massage with olive oil, castor oil, chasteberry, vitamin E oil, ice pack, etc.