For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ రెండు వంటింటి పదార్ధాలు చెవినొప్పిని తగ్గించగలవు

|

మీరు నిరంతరం చెవి నొప్పితో బాధపడుతున్నట్లయితే, ఆందోళన చెందడం పరిపాటిగా ఉంటుంది. అయితే, ఈ సమస్యకు ఇంట్లోనే చికిత్స చేసేలా సహాయపడే ఒక సహజ సిద్దమైన పరిహారం కూడా అందుబాటులోనే ఉంది! చెవులలో నొప్పి రోజుల తరబడి కొనసాగుతూ ఉన్న ఎడల, అది క్రమంగా మీ రోజువారీ కార్యకలాపాలను సైతం దెబ్బతీయవచ్చు.

మీ చెవులలో తీవ్రమైన నొప్పి ఉన్న పక్షంలో, దాని ఫలితంగా తల మరియు ముఖంపై నొప్పి, అలసట మొదలైన ఇతర సమస్యలకు కూడా దారితీయవచ్చు. చెవి నొప్పికి అనేక రకాల కారణాలు ఉంటాయి, బ్యాక్టీరియా సంక్రమణం, సాధారణ జలుబు, అదనపు కొవ్వు, ప్రత్యక్ష ధూమపానం లేదా పరోక్ష ధూమపానం, వాపు, దుమ్ము ధూళి, గొంతు సంక్రమణ, మొదలైన అనేక అంశాలు కూడా సమస్య కారకాలుగా ఉంటాయి.

చెవి నొప్పికి ఇంటి చిట్కాలు : మీ చెవి నొప్పికి కారణం ఏమైనప్పటికీ, అది కొనసాగుతున్న ఎడల, రోజువారీ కార్యక్రమాలలో అసౌకర్యానికి లోనుచేస్తుంది. మీ చెవి నొప్పి ఇతర రుగ్మతలకు సంబంధించిన లక్షణంగా ఉన్న ఎడల, ఆ రోగాలకు చికిత్స తీసుకోవడం అవసరమని మరవకండి. మీ చెవినొప్పిని తగ్గించడానికి ఈ సహజసిద్దమైన గృహ నివారణా చిట్కాను ప్రయత్నించవచ్చు;

2 Kitchen Ingredients To Help Reduce Ear Pain

చెవినొప్పి కోసం వంటింటి చిట్కా:

రెసిపీ తయారీ విధానం, కావలసిన పదార్ధాలు :

బాసిల్ లీఫ్ జ్యూస్ (తులసి) - 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ జ్యూస్ - 1 టేబుల్ స్పూన్

చెవినొప్పిని వదిలించుకోవడానికి ఈ సహజసిద్దమైన చిట్కా ప్రభావవంతంగా ఉంటుంది, మీరు సరైన పరిమాణాన్ని ఉపయోగించి, ప్రతిరోజూ అనుసరించిన ఎడల ఉత్తమ ఫలితాలను పొందగలరు.

ఈ నివారణను ఉపయోగించడంతో పాటు, సమస్యకు చికిత్సను తీసుకోవడం కూడా ముఖ్యమని మరువకండి. ఒక్కోసారి చెవినొప్పి ఇతర వ్యాధులకు లక్షణంగా కూడా ఉంటుంది.

2 Kitchen Ingredients To Help Reduce Ear Pain

బాసిల్ లీఫ్, లేదా తులసి ఆకులు, కొన్నిరకాల ఎంజైములను కలిగి ఉంటాయి, ఇవి బలమైన శోథనిరోధక లక్షణాలతో కూడుకుని వస్తాయి. ఇవి చెవి లోపల వాపును తగ్గించి, క్రమంగా నొప్పిని నిరోధించగలవు. ఉల్లిపాయలో సంక్రమణ మరియు నొప్పిని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉన్న అల్లియం అనే సమ్మేళనం ఉంటుంది.

తయారుచేసే విధానం :

ఒక కప్పులో సూచించిన పదార్థాల మొత్తాలను జోడించండి. మిశ్రమాన్ని రూపొందించడానికి సూచించిన మొత్తంలో ఆకుల రసాన్ని తీసుకుని, ఉల్లిపాయ రసంతో కలపండి. ఇప్పుడు, ఈ మిశ్రమం 2 చుక్కలను డ్రాపర్లో తీసుకొని, మీ చెవి లోపల వేయండి. చెవి నొప్పి ఉన్నప్పుడు మాత్రమే, అదికూడా రోజుకు ఒకసారి మాత్రమే ఈ పరిహారం అనుసరించండి. ఈ పద్దతిని అనుసరించడానికి ముందు వైద్యుని సంప్రదించండి.

2 Kitchen Ingredients To Help Reduce Ear Pain

గమనిక : జ్ఞానేంద్రియాలు అంటేనే అత్యంత సున్నితమైనవిగా ఉంటాయి. వాటిలో కూడా అత్యంత మిక్కిలి సున్నితమైనవి కళ్ళు, చెవులు. చెవిపోటు వచ్చిందంటే, ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. కావున, తప్పనిసరిగా తరచుగా వైద్యుని సంప్రదిస్తూ, చెవిని శుభ్రపరచుకునే విధానాలను అవలంభించవలసి ఉంటుంది. నిజానికి కొందరు నిపుణులు మరియు వైద్యుల అభిప్రాయం ప్రకారం, తరచుగా కనీసం 6 నెలలకు ఒకసారైనా చెవి పరీక్షలకు పూనుకోవలసి ఉంటుంది. ఎందుకనగా, కొన్ని లక్షణాలు ఇతర సమస్యలకు కూడా కారకంగా మారగలవు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవన శైలి, ఆహార,హస్త సాముద్రిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

ఈ రెండు వంటింటి పదార్ధాలు చెవినొప్పిని తగ్గించగలవు

2 Kitchen Ingredients To Help Reduce Ear Pain
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more