For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిడ్నీలు ఎవరికైనా ఫెయిల్ అవుతాయి జాగ్రత్త! ఈ జాగ్రత్తలు పాటిస్తే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవొచ్చు

డ్నీ బాగుందా..లేదా అని తెలుసుకోవ‌డానికి ఏఏ ప‌రీక్ష‌లు చేయించుకోవాలి..ఏ వ‌య‌స్సు వారు చేయించుకోవాలో చాలా మందికి తెలియదు. కిడ్నీలు ఎవరికైనా ఫెయిల్ అవుతాయి జాగ్రత్త! కిడ్నీలు ఆరోగ్యం

|

మన శరీరంలో మూత్ర పిండాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మన శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను తొలగించడంలో వాటి పాత్ర అమోఘమైంది. కానీ నేటి తరుణంలో అనేక కారణాల వల్ల చాలా మంది కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. పిన్న వయస్సులోనే కొందరికి కిడ్నీలు ఫెయిలై పరిస్థితి తీవ్రంగా మారుతున్నది.

ఏఏ పరీక్షలు చేయించుకోవాలి

ఏఏ పరీక్షలు చేయించుకోవాలి

కిడ్నీ బాగుందా..లేదా అని తెలుసుకోవ‌డానికి ఏఏ ప‌రీక్ష‌లు చేయించుకోవాలి..ఏ వ‌య‌స్సు వారు చేయించుకోవాలో చాలా మందికి తెలియదు. కిడ్నీ సంబంధిత వ్యాధులు చాలా వేగంగా పెరిగిపోతున్నాయి. అయితే కిడ్నీ పాడ‌వుతుంద‌ని తెలిపే ల‌క్ష‌ణాలు బ‌య‌టికి క‌నిపించ‌వు. మ‌నంత‌టమ‌నం కిడ్నీ ఎలా ఉందో తెలుసుకునేందుకు అవ‌స‌ర‌మ‌య్యే ప‌రీక్ష‌ల‌ను చేయించుకుంటేనే కిడ్నీ ఎలా ఉందో తెలుస్తుంది.

ఎవరు చేయించుకోవాలి

ఎవరు చేయించుకోవాలి

ఈ కిడ్నీ ప‌రీక్ష‌లు ఎవ‌రు చేయించుకోవాల‌న్న ప్ర‌శ్న అంద‌రికీ వ‌స్తుంది. కిడ్నీ ప‌రీక్ష‌లు ముఖ్యంగా డ‌యాబెటీస్ ఉన్న వారు త‌ప్ప‌ని స‌రిగా ప్ర‌తి ఆరు నెల‌లు..సంవ‌త్స‌రానికి ఒకసారి కిడ్నీకి సంబంధించిన ప‌రీక్ష‌ల‌ను చేయించుకోవాలి .షుగ‌ర్ వ్యాధి ఏ వ‌య‌స్సు వారికి వ‌చ్చినా వ్యాధి వ‌చ్చిన‌ప్పుడు మొట్ట‌మొద‌టిసారిగా కిడ్నీ ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. అనంత‌రం ప్ర‌తి ఆరు నెల‌ల‌కి కిడ్నీకి సంబంధించిన ప‌రీక్ష‌ల‌ను చేయించుకోవాలి.

హై బ్లెడ్‌ప్రెష‌ర్ ఉన్న‌వారు

హై బ్లెడ్‌ప్రెష‌ర్ ఉన్న‌వారు

కిడ్నీ ప‌రీక్ష‌ల విషయంలో నిర్ల‌క్ష్యం వ‌హించ‌టం స‌రికాదు. హై బ్లెడ్‌ప్రెష‌ర్ ఉన్న‌వారు బ్లెడ్‌ప్రెష‌ర్‌కి మందులు వాడుతున్న వారు కూడా కిడ్నీకి సంబంధించిన ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. కిడ్నీ ఆరోగ్యంగా లేక‌పోతేనే బ్లెడ్‌ప్రెష‌ర్ పెరుగుతుంది. కాబ‌ట్టి కిడ్నీకి..బ్లెడ్ ప్రెష‌ర్‌కి ఉన్న అవినాభావ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని బిపి ఉన్న‌వారు..బిపికి మందులు వేసుకుంటున్న వారు..బిపి సూఛాయ‌గా పెరుగుతుంద‌నుకుంటున్న‌వారు, బిపి అస‌లు కంట్రోల్ కావ‌డం లేద‌ని అనుకుంటున్న‌వారు త‌ప్ప‌ని స‌రిగా కిడ్నీ ప‌రీక్ష‌లు చేయించుకోవాలి.

కుటుంబంలో ఎవ‌రికైనా కిడ్నీ జ‌బ్బులు ఉంటే

కుటుంబంలో ఎవ‌రికైనా కిడ్నీ జ‌బ్బులు ఉంటే

అంతేకాదు కుటుంబంలో అమ్మ‌..నాన్న‌..అక్క‌చెలెళ్లు..అన్న‌ద‌మ్ముల‌కి ఎవ‌రికైనా కిడ్నీ జ‌బ్బులు ఉంటే వారు కూడా త‌ప్ప‌నిస‌రిగా కిడ్నీకి సంబంధించిన ప‌రీక్ష‌ల‌ను చేయించుకోవాల్సిన అవ‌స‌రం ఉంటుంది. చాలా మంది తల్లిదండ్రుల‌కి కిడ్నీ జ‌బ్బులు ఉంటే వారి పిల్ల‌ల‌కి కూడా ఉందేమో అని ప‌రీక్ష‌ల‌ను చేయించుకోమంటే వారు బాధ‌ప‌డ‌తారు. కాని మేం ఆల్రెడీ సెకండ్ జ‌న‌రేష‌న్ వాళ్ల‌ని కూడా చూస్తున్నాం. చాలా ఏళ్లుగా మా వ‌ద్ద కిడ్నీ స‌మ‌స్య‌కి ట్రీట్‌మెంట్‌(చికిత్స‌) తీసుకుంటున్న త‌ల్లిదండ్రుల పిల్ల‌లు కూడా కిడ్నీ జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. అందుకే వారు కూడా చెక్ చేయించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

స్థూల‌కాయం(ఒబిసిటీ) ఉన్నవారు

స్థూల‌కాయం(ఒబిసిటీ) ఉన్నవారు

ప్ర‌స్తుతం చాలా మంది స్థూల‌కాయులుగా ఉంటున్నారు. బాడీ మాస్‌ ఇండెక్స్ మోర్‌దెన్ 30 ఉన్నవారు త‌ప్ప‌నిస‌రిగా కిడ్నీ ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. అలాగే సిగ‌రెట్‌ స్మోకింగ్‌(పొగ‌తాగేవారు)..ఎప్పుడైనా కిడ్నీలో స‌మ‌స్యలు..కిడ్నీలో రాళ్లు వ‌చ్చిన‌వారు..మూత్ర స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు..దుర‌దృష్ట‌వ‌శాత్తు ఒక కిడ్నీ ఉన్న‌వారు త‌ప్ప‌కుండా కిడ్నీ ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డేవారు..ముఖ్యంగా చ‌ర్మ సంబంధిత వ్యాధులు..కీళ్ల వ్యాధుల‌తో బాధ‌ప‌డేవారు చాలా సంవ‌త్స‌రాలుగా మందులు వాడుతుంటారు. ఎక్కువ‌గా పెయిన్‌కిల్ల‌ర్స్ వాడితే అవి కిడ్నీల‌ను పాడు చేసే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి వీరంద‌రూ కిడ్నీకి సంబంధించిన స‌మ‌స్య‌లు ఉన్నాయా..లేదా.. మొద‌టిద‌శ‌లోనే ప్రాధ‌మికంగా ఏమైనా స‌మ‌స్య‌లు ఉన్నాయా..లేదా తెలుసుకోవ‌డానికి కిడ్నీ ప‌రీక్ష‌లు త‌ప్ప‌నిస‌రి.

మూత్ర ప‌రీక్ష

మూత్ర ప‌రీక్ష

కిడ్నీ ప‌రీక్ష‌లో ప్ర‌ధానంగా చేసేది మూత్ర ప‌రీక్ష..దీనిని సాధార‌ణ మూత్ర ప‌రీక్ష అంటారు. వాటిని కంప్యూట్‌యూనిర్ ఎగ్జామినేష‌న్ అంటారు. కంప్యూట్‌యూనిర్ ఎగ్జామినేష‌న్‌లో రెండు భాగాలు ఉంటాయి. వాటిల్లో ఒక‌టి డిప్‌స్టిక్స్ అంటూ మూత్రంలో ఒక చిన్న ఇండికేట‌ర్ లా చిన్న ట్యూబ్ ఇది పుల్ల‌లాగ ఉంటుంది. దానిని డిప్ చేసి చూస్తారు. డిప్ స్టిక్స్‌లో ప్రొటీన్ ఎంత ఉంది..ర‌క్తం ఏమైనా ఉందా..నైట్రేస్ లాంటి ప‌దార్థాల్లో ఇన్ఫ్‌క్ష‌న్ ఏమైనా ఉందా అని తెలుస్తుంది. అలాగే షుగ‌ర్ ఉంటే కూడా తెలుస్తుంది. రెండ‌వ‌ది మైక్రోస్కోప్..ఈ మైక్రోస్కోప్‌లో తెల్ల‌ర‌క్త‌క‌ణాలు..ఎర్ర ర‌క్త క‌ణాలు..కాసులు లాంటివి ఉన్నాయా..లేదా అని తెలుస్తుంది.

ఎక్కువ కాలం ఆ ఇబ్బంది ఉంటే అది కిడ్నీ ఫెయిల్యూర్

ఎక్కువ కాలం ఆ ఇబ్బంది ఉంటే అది కిడ్నీ ఫెయిల్యూర్

అల్ట్రా స్కాన్ మూత్ర ప‌రీక్ష‌తో పాటు ర‌క్త ప‌రీక్ష అవ‌స‌రం

అందుకే సాధార‌ణ మూత్ర‌ప‌రీక్ష అనేది ముఖ్య‌మైన ప‌రీక్ష

అని గుర్తించాలి. మూత్ర‌ప‌రీక్ష‌తో పాటు ర‌క్త ప‌రీక్ష కూడా చేయించుకోవాలి. అల్ట్రాసౌండ్‌లో కిడ్నీ ఆకారం ఎలా ఉందో తెలుస్తుంది. రీనోగ్రామ్ ప‌రీక్ష ద్వారా ఎడ‌మ వైపు..కుడివైపు కిడ్నీ ఎలా ప‌ని చేస్తుందో తెలుస్తుంది. మూత్ర‌పిండాల ప‌నిలో విఫ‌లం లేదా కిడ్నీ వ్యాధుల‌ను ర‌క్త లేదా మూత్ర ప‌రీక్ష ద్వారా గుర్తిస్తారు. ఎక్కువ‌కాలం ఈ స‌మ‌స్య ఉంటే దానినిన కిడ్నీ ఫెయిల్యూర్‌గా ప‌రిగ‌ణిస్తారు. కిడ్నీల విధి నిర్వ‌హ‌ణ‌లో ఏవైనా ఇబ్బందులు ఉండి ..ఎక్కువ కాలం ఆ ఇబ్బంది ఉంటే అది కిడ్నీ ఫెయిల్యూర్ లేదా పూర్తిగా మూత్ర పిండం ప‌ని చేయ‌కుండా పోవ‌చ్చు.

కిడ్నీలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలంటే

కిడ్నీలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలంటే

ఆక‌లి కోల్పోవ‌టం..అనారోగ్యంగా ఉండ‌టం..తొంద‌ర‌గా అల‌సిపోవ‌టం లేదా నీర‌సం..త‌ర‌చుగా త‌ల‌నొప్పి రావ‌టం..దుర‌ద‌లు..చ‌ర్మం పొడిబార‌టం..వికారం..వాంతులు..అనుకోని విధంగా బ‌రువు త‌గ్గ‌టం లాంటివి కిడ్నీ ప‌నితీరు స‌రిగా చేయ‌డం లేద‌ని తెలుపుతాయి. కిడ్నీలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలంటే ఎవరైనా సరే తమ కిడ్నీల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. అందుకు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

7 నుంచి 8 గ్లాసుల నీటిని కచ్చితంగా తాగాలి

7 నుంచి 8 గ్లాసుల నీటిని కచ్చితంగా తాగాలి

నిత్యం 7 నుంచి 8 గ్లాసుల నీటిని కచ్చితంగా తాగాలి. దీంతో శరీరంలో ఉండే మలినాలు బయటకు వెళ్లిపోతాయి. కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. లేదంటే అవి మన శరీరంలో ఇతర అవయవాలకు కూడా హాని కలిగిస్తాయి. కిడ్నీ వ్యాధులను తెచ్చి పెడతాయి.

ఎరుపు రంగులో ఉండే క్యాప్సికం

ఎరుపు రంగులో ఉండే క్యాప్సికం

ఎరుపు రంగులో ఉండే క్యాప్సికంను తరచూ తినాలి. వీటిల్లో ఉండే విటమిన్ ఎ, సి, పొటాషియం తదితర పోషకాలు కిడ్నీల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. నిత్యం వెల్లుల్లిని ఏదో ఒక రూపంలో తీసుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. దీని వల్ల శరీరంలో ఉండే విష పదార్థాలు కూడా బయటకు వెళ్లిపోతాయి.

రోజుకో యాపిల్ పండు

రోజుకో యాపిల్ పండు

రోజుకో యాపిల్ పండును తింటే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. యాపిల్ పండ్లలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. కిడ్నీ వ్యాధులు రాకుండా చూస్తాయి. పుట్టగొడుగుల్లో ఉండే విటమిన్ బి, డి లు కిడ్నీ వ్యాధులు రాకుండా చూడడంతోపాటు కిడ్నీలను సంరక్షిస్తాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

స్ట్రాబెర్రీ, ఓట్స్, కాలిఫ్లవర్, ఉల్లిపాయలు

స్ట్రాబెర్రీ, ఓట్స్, కాలిఫ్లవర్, ఉల్లిపాయలు

స్ట్రాబెర్రీలలో ఫైబర్, విటమిన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే మలినాలను బయటికి పంపి కిడ్నీలను ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. వీటిని తరచూ తింటుంటే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఓట్స్, కాలిఫ్లవర్, ఉల్లిపాయలు, పైనాపిల్స్ కూడా కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. కిడ్నీ వ్యాధులు రాకుండా చూస్తాయి. వీటిని రోజూ తింటుంటే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

English summary

20 signs you may have kidney disease and best foods for healthy kidneys

20 signs you may have kidney disease and best foods for healthy kidneys
Story first published:Tuesday, July 10, 2018, 14:47 [IST]
Desktop Bottom Promotion