For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వారంలో అన్ని సార్లు శృంగారంలో పాల్గొంటే మంచి లాభం, ఎక్కువ మందితో పాల్గొంటే మాత్రం..

చాలా మంది మగవారు రాత్రి కాగానే భార్యతో అందులో పాల్గొనాలని ఆరటాపడుతుంటారు. కొందరు రోజుకు రెండు మూడు సార్లు కూడా శృంగారంలో పాల్గొంటూ ఉంటారు. కొత్తగా పెళ్లయినా వారికి అయితే అసలు కౌంట్ ఉండదు.

|

చాలా మంది మగవారు రాత్రి కాగానే భార్యతో అందులో పాల్గొనాలని ఆరటాపడుతుంటారు. కొందరు రోజుకు రెండు మూడు సార్లు కూడా శృంగారంలో పాల్గొంటూ ఉంటారు. కొత్తగా పెళ్లయినా వారికి అయితే అసలు కౌంట్ ఉండదు. ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు శృంగార యుద్ధం చేస్తుంటారు.

శృంగారాన్ని ఎవరూ తప్పు పట్టరు

శృంగారాన్ని ఎవరూ తప్పు పట్టరు

భార్యాభర్తల శృంగారాన్ని ఎవరూ కూడా తప్పు పట్టరు. అయితే ఇటీవల విడుదలైన ఒక సర్వే ప్రకారం శృంగారం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుందట. వారంలో రెండు నుంచి నాలుగు సార్లు శృంగారంలో పాల్గొంటే ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడే అవకాశం అంతగా ఉండదట. అయితే ఎక్కువ మందితో లైంగిక కార్యకళాపాలు జరిపే మగవారు మాత్రం ఈ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది.

చిన్న వయస్సులోనే అనుభవం ఉంటే

చిన్న వయస్సులోనే అనుభవం ఉంటే

అంతేకాదు చిన్న వయస్సులోనే శృంగార అనుభవం చూసిన పురుషులు కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. ఈ విషయాలన్నీ ఇటీవల నిర్వహించిన ఒక అధ్యాయనంలో బయటపడ్డాయి.

లైంగిక కార్యకళాపాలు పెరగడం వల్ల

లైంగిక కార్యకళాపాలు పెరగడం వల్ల

చైనాలోని సిచువాన్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఒక పరిశోధన నిర్వహించారు. గతంలో నిర్వహించిన 22 అధ్యయనాల్లోని అంశాలను ప్రధానంగా తీసుకుని 55,490 మందిపై యూనివర్సిటీ చెందిన వారు పరిశోధన చేప్టటారు. లైంగిక కార్యకళాపాలు పెరగడం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ తగ్గుముఖం పడుతుందని వారు కనుగొన్నారు.

అధిక సెక్స్ కూడా ప్రమాదకరం

అధిక సెక్స్ కూడా ప్రమాదకరం

వారానికి రెండు నుంచి నాలుగు సార్లు అందులో పాల్గొనేవారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయని తేలింది. అలాగే లిమిట్ లో హస్త ప్రయోగం చేసుకునే అబ్బాయిలు కూడా దీని బారిన పడరు. అయితే అధిక సెక్స్ కూడా ప్రమాదకరం. ఎక్కువ సెక్స్ లో పాల్గొనడం వల్ల కూడా ప్రొస్టేట్ క్యాన్సర్ కు గురయ్యే అవకాశం ఉంది.

శృంగార అనుభవం లేట్ గా పొందితే

శృంగార అనుభవం లేట్ గా పొందితే

తక్కువ మంది లైంగిక కార్యకళాపాలు సాగించేవారు, మొదటి శృంగార అనుభవాన్ని కాస్త లేట్ గా పొందిన వారు ప్రోస్టేట్ క్యాన్సర్ భారిన పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని కూడా పరిశోధనలో తేలింది. లిమిట్ లో సెక్స్ లో పాల్గొనడం, ఒక్కరితోనే సెక్స్ చేయడం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోవొచ్చు.

English summary

Having sex two to four times a week reduces prostate cancer risk

Having sex two to four times a week reduces prostate cancer risk
Desktop Bottom Promotion