For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మానవులపై దాడి చేస్తున్న ప్రాణాంతక కీ స్టోన్ వైరస్

|

మానవ జాతి అత్యంత ఉత్తమమైనది. మానవుడు తన తెలివితేటలతో ఎంతో ముందుకు వెళుతున్నాడు. అనేక కొత్త విషయాలను కనుగొంటున్నాడు. ఈ ప్రపంచంలో మిగతా జీవుల కంటే మానవుడు అత్యంత తెలివైనవాడు. నిజమే కదా?

ఈ విషయం నిజమే అయినా కొన్ని చిన్న కీటకాలు మాత్రం మానవుడిని అమితంగా ఇబ్బందికి గురిచేస్తున్నాయి. ప్రాణాపాయాన్ని కలిగిస్తున్నాయి. చూడడానికి చిన్నగానే ఉన్నా మానవునికి దడ పుట్టిస్తున్నాయి.

ఉదాహరణకు, పాము మెదడు మానవుడి మెదడంత వృద్ధి చెందినది కాకపోయినా ఒక పాము కాటు ద్వారా మానవుడి శరీరంలోకి విషం చేరి ప్రాణాపాయం కలుగుతుంది. నిమిషాల్లో ప్రాణం పోతుంది!

Keystone Virus: Know About The Deadly New Virus Affecting Humans

అదే విధంగా, వైరస్ మరియు బాక్టీరియా వంటి సూక్ష్మజీవులను సాధారణ కంటితో చూడలేకపోయినా అవి మన శరీరంలోకి చొచ్చుకుపోయి అనారోగ్యాన్ని కలిగిస్తాయి.

నిజానికి, ఈ ప్రపంచంలోని అతి ప్రమాదకర వ్యాధి అయిన ఎయిడ్స్ అనేది అత్యంత సూక్ష్మ వైరస్ ద్వారా సంభవిస్తుంది.

కాబట్టి, ఈ విషయాల్ని పరిశీలిస్తే మానవుడిని కూడా హడలెత్తించే సూక్ష్మజీవుల శక్తి అర్థమవుతుంది. కీటకాల్లో కొన్ని జాతుల ద్వారా తలెత్తే ప్రాణాపాయ స్థితుల గురించి తలచుకుంటేనే వణుకు పుడుతుంది.

డెంగ్యూ, మలేరియా, జికా వంటి వ్యాధుల గురించి మనందరికీ ఈ పాటికే తెలిసి ఉంటుంది. ఇవన్నీ వైరస్ ద్వారా తలెత్తి చివరికి ప్రాణాల్ని తీసేస్తాయి.

సాధారణంగా, ఈ డెడ్లీ వైరల్ వ్యాధులన్నీ దోమలు, ఇన్ఫెక్షన్ కు గురైన ఇతర వ్యక్తులు, కలుషితమైన గాలి, నీళ్లు మరియు ఆహారం వంటి ద్వారా వ్యాప్తి చెందుతాయి.

వీటితో పాటు మరికొన్ని ప్రాణాంతక వైరస్ లు కూడా ఈ మధ్య కాలంలో కొన్ని ప్రాంతాల్లో తమ విశ్వరూపాన్ని చూపిస్తున్నాయి. ఇవి మెల్ల మెల్లగా ప్రపంచమంతా వ్యాప్తి చెందేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఇటువంటి కొన్ని వ్యాధుల నిర్మూలనకు ఔషధాలను ఇంకా కనుగొనలేదు. కాబట్టి, వీటి బారిన పడితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం తలెత్తవచ్చు!

నిజానికి, ఇండియా, ఆఫ్రికా వంటి డెవలపింగ్ కంట్రీస్ లో వైరల్ డిసీస్ లు సర్వసాధారణం. జనాభా ఎక్కువవడం వలన అలాగే హైజీన్ ఇష్యూస్ వలన ఈ సమస్య తలెత్తుతుంది.

ఇటీవలే, శాస్త్రవేత్తలు ఇంకొక భయంకరమైన వైరస్ గురించి తెలుసుకున్నారు. కీ స్టోన్ అనే ఆ వైరస్ కు చెందిన కొన్ని విషయాలను ఈ ఆర్టికల్ లో ప్రస్తావించాము.

కీస్టోన్ వైరస్ పుట్టుక:

కీస్టోన్ వైరస్ పుట్టుక:

యునైటెడ్ స్టేట్స్ లోని టెక్సాస్ లో 1964వ సంవత్సరంలో ఈ వైరస్ ను జంతువులలో మొదటగా గుర్తించారు. అప్పటినుంచి, ఈ వైరస్ బారిన పడిన జంతువులను ఎగ్జామిన్ చేసిన నిపుణులు ఈ వైరస్ ప్రభావం కేవలం జంతువులకు మాత్రమే పరిమితమని భావించారు. మనుషులపై ఈ వైరస్ ప్రభావం ఉండకపోవచ్చని భావించారు.

అయితే, ఇటీవల, 2016లో, యునైటెడ్ స్టేట్స్ లోని ఫ్లోరిడాకు చెందిన ఒక టీనేజర్ తీవ్రమైన జ్వరంతో అలాగే బాడీ ర్యాష్ తో హాస్పటల్ కి తరలించబడ్డాడు.

జికా వైరస్ ప్రభావిత ప్రాంతం కాబట్టి ఆ బాలుడు జికా వైరస్ బారిన పడ్డాడని తొలుత వైద్యులు అనుమానించారు. జికా వైరస్ లక్షణాలు లేకపోవడంతో ఆ బాలుడు కీ స్టోన్ వైరస్ బారిన పడ్డాడని వైద్యులు నిర్ధారించారు.

అప్పటి నుంచి కీ స్టోన్ వైరస్ మనుషులపై కూడా తన ప్రభావం చూపుతుందని స్పష్టమైంది.

కీ స్టోన్ వైరస్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది?

కీ స్టోన్ వైరస్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది?

డెంగ్యూ, మలేరియా, జికా వంటి వైరస్ ల లాగానే కీ స్టోన్ వైరస్ కూడా దోమకాటు ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది దోమల ద్వారా వ్యాప్తి చెందే వైరస్.

అడ దోమ కీ స్టోన్ వైరస్ ను క్యారీ చేసి మానవుల బ్లడ్ స్ట్రీమ్ లోకి దోమకాటు ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తుంది.

ఈ వైరస్ అప్పట్నుంచి మానవుల బ్లడ్ స్ట్రీమ్ లో విస్తరింపబడుతుంది.

యునైటెడ్ స్టేట్స్, ఆఫ్రికా మరియు ఇండియాలో ఈ కీ స్టోన్ వైరస్ అనేది ప్రబలిస్తోంది. యూఎస్ లో ఇప్పటికే ఈ వైరస్ కు చెందిన కొన్ని కేసెస్ ను డిటెక్ట్ చేశారు.

 కీ స్టోన్ వైరస్ లక్షణాలు

కీ స్టోన్ వైరస్ లక్షణాలు

ఈ కీ స్టోన్ వైరస్ లక్షణాలు రెగ్యులర్ వైరల్ ఫ్లూ లక్షణాలతో పోలి ఉంటాయి. ఫీవర్, తలనొప్పి, జలుబు వంటి లక్షణాలు ఎదురవుతాయి. టెస్ట్ లు చేసేవరకు ఈ వ్యాధి గురించి ఒక నిర్ధారణకు రావడం కష్టం.

శరీరంపై ర్యాషెస్, నిరంతర జ్వరం వంటి కొన్ని లక్షణాలు ఈ వైరస్ అనేది మరింత ముదిరిందని తెలుపుతాయి. ఈ సమయంలో బ్రెయిన్ సెల్స్ పై దుష్ప్రభావం పడుతుంది. ఏన్కెఫలైటిస్ అనే స్థితి ఎదురవుతుంది. ప్రాణాలు పోయే ప్రమాదం ఎక్కువవుతుంది.

చికిత్స

చికిత్స

డెంగ్యూ మరియు జికా వైరస్ లాగానే కీ స్టోన్ వైరస్ కు ఎటువంటి చికిత్సా లేదు. ఔషధాలు కూడా ఇంకా కనుగొనబడలేదు. ఫీవర్ ని తగ్గించేందుకు మెడికేషన్స్ ని ఇవ్వటం జరుగుతుంది. విశ్రాంతిని ఎక్కువగా తీసుకోవాలి. ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇమ్మ్యూన్ సిస్టమ్ ను పెంపొందించే మెడికేషన్స్ ను వైద్యులు సిఫార్సు చేయడం జరుగుతుంది.

కీస్టోన్ వైరస్ ను అరికట్టడమెలా?

కీస్టోన్ వైరస్ ను అరికట్టడమెలా?

కీ స్టోన్ వైరస్ ను నివారించేందుకు ఇంటి వద్దా అలాగే వర్క్ ప్లేస్ లలో దోమలు రాకుండా జాగ్రత్తపడాలి. మస్కిటో రిపేలెంట్స్ ను బాడీ స్ప్రే రూపంలో గాని లేదా కాయిల్స్ రూపంలో గాని వాడాలి. అదనంగా, నిలువ ఉండే నీటిని చెత్తను ఎప్పటి కప్పుడు తొలగించాలి. లేదంటే, అవి దోమల వ్యాప్తికి నివాసంగా మారతాయి. ఈ జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా కొంతవరకు ఈ ప్రాణాంతక వైరస్ ను నివారించవచ్చు.

English summary

Keystone Virus: Know About The Deadly New Virus Affecting Humans

A mosquito-borne deadly viral disease known as the Keystone virus has been detected in humans for the first time. Fever, headache, cold, etc. are some of its common symptoms. It can be treated with the help of medication & consuming fluids. To prevent this viral disease, make sure there are no mosquitoes around,
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more