For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముక్కు నుంచి రక్తం ఎందుకు కారుతుంది ? దానిని అడ్డుకోవడానికి మనమేమి చేయాలి?

ముక్కు నుంచి రక్తం ఎందుకు కారుతుంది ? దానిని అడ్డుకోవడానికి మనమేమి చేయాలి?

|

ముక్కు నుంచి రక్తం కారడమనేది మీరు అనుకున్న దానికన్నా చాలా ఎక్కువగా సంభవించే అవకాశాలను కలిగి ఉంటాయి. ఇది మనకు హఠాత్తుగా సంభవించే ఒక చర్య. ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా మన ముక్కు ద్వారం నుంచి ఎర్రటి రక్తం బయటకు వస్తుంది. ఇంకా బాధాకరమైన విషయమేమిటంటే, ఇది మనిషి జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా సంభవించే చర్యగా ఉంటూ, చాలా మర్మమైనదిగా ఉంటుంది.

అయితే, ఇది మీకు ఒక శుభవార్త. మీ ముక్కు నుంచి రక్తస్రావం అయినప్పుడు చూడటానికి భయంకరంగా ఉండడంతో పాటు అది ఎందుకు జరిగిందో మీకు ఖచ్చితంగా తెలియకపోతే - అది ఏమాత్రం ప్రమాదకరమైనది కాదని మేము మీకు భరోసా ఇస్తున్నాము. మీ ముక్కు నుండి రక్తస్రావం జరిగినప్పుడు దానికి గల కారణాలను తెలుసుకోవడంతో పాటు, దానిని ఎలా అడ్డుకోవాలో & దాని నివారణ మార్గాలు ఏమిటో కూడా మీరు తెలుసుకోవాలి. ఈ వ్యాసంలో, ఇప్పుడు మనము "ముక్కు నుంచి రక్తస్రావమవడానికి" గల అన్ని అంశాల గురించి మాట్లాడుకోబోతున్నాం.

*

* "ముక్కు నుంచి రక్తం కారటం" అంటే ఏమిటి ?

మన ముక్కు ముందు ద్వారం నుండి రక్తం బయటకి వచ్చే చర్యను "యాంటీరియర్ నోస్-బ్లీడ్" అని అంటారు. ఇక్కడ, మీ ముక్కు లోపల రక్తనాళాలు దెబ్బతిన్న కారణంగా రక్తస్రావమనేది జరుగుతుంది.

"పోస్టీరియర్ నోస్-బ్లీడ్" లో మీ ముక్కు రంధ్రం నుంచి రక్తం బయటకు రావడానికి బదులు, వెనుక వైపు నుంచి మీ గొంతు గుండా ప్రసరిస్తుంది. ఇది తరచుగా పెద్దవారిలో (లేదా) ముఖానికి / ముక్కుకి గాయాలు తగిలిన వారిలో సాధారణంగా కనిపిస్తుంది.

నోస్-బ్లీడింగ్ అవ్వడానికి గల కారణాలేమిటి

నోస్-బ్లీడింగ్ అవ్వడానికి గల కారణాలేమిటి

నోస్-బ్లీడింగ్ అవ్వడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. వాటిలో పొడిగాలి, జలుబు, సైనసైటిస్, అలర్జీలు & ముక్కుని గట్టిగా లాగడం వంటి ఇతర చర్యలు కూడా ఉన్నాయి.

కొన్నిసార్లు వాతావరణం బాగా వేడిగా (లేదా) తేమగా ఉన్న కారణంగా మీ చుట్టూ ఆవరించి ఉన్న గాలి పొడిగా ఉంటుంది. దీనివల్ల మీ ముక్కులో వున్న పొరలు చాలా పొడిగా మారడం వల్ల, ముక్కులో ఏర్పడే వ్యర్థం దురదపెట్టేలా తయారు అవుతుంది. అలాంటప్పుడు మీ ముక్కుని గోకడం వల్ల అది రక్తస్రావానికి దారితీస్తుంది. మీ ముక్కులో ఉండే సున్నితమైన పొరలు ఎలర్జీకి, జలుబు (లేదా) సైనసిటిస్ వంటి రుగ్మతల బారిన పడటం వల్ల మీకు చికాకును కలిగిస్తాయి. అలాంటి సందర్భాలలో, మీరు ఊపిరి పీల్చుకోవడం వల్ల పదేపదే రక్తస్రావాన్ని కలిగిస్తుంది.

ముక్కు నుంచి రక్తస్రావం జరగటం వల్ల మరణించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, మీరు ఎక్కువ రక్తాన్ని నష్టపోవచ్చు దీనివల్ల మీరు రక్తహీనతకు గురవ్వచ్చు.

నోస్-బ్లీడింగ్ జరుగుతున్నప్పుడు మీరేమి చేయాలి

నోస్-బ్లీడింగ్ జరుగుతున్నప్పుడు మీరేమి చేయాలి

ముక్కు నుంచి రక్తస్రావమవుతున్నప్పుడు మొదటగా మీరు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. మీరు ఒకచోట ప్రశాంతంగా కూర్చుని, టవల్తో రక్తాన్ని పూర్తిగా తుడవాలి. ఇలాంటి సమయంలో మీ నోటితో శ్వాసను తీసుకోవడానికి ప్రయత్నిస్తూ 10-15 నిమిషాల వరకు ఇలానే చేయాలి. అప్పటికీ రక్తస్రావం తగ్గకపోతే మరొక 15 పాటు నోటితోనే శ్వాస తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి.

అప్పటికీ ఈ రక్తస్రావం ఆగకపోతే ఏమి చేయాలి

అప్పటికీ ఈ రక్తస్రావం ఆగకపోతే ఏమి చేయాలి

ముక్కు నుండి ఏర్పడే రక్తస్రావం, దానికి అదే ఆగిపోతుంది (లేదా) ఈ క్రింది తెలిపిన అంశాలను అనుసరించడం ద్వారా ఆగిపోవచ్చు. ముక్కు నుండి రక్తస్రావం 30 నిమిషాలకు మించి కొనసాగితే వెంటనే డాక్టర్ను సంప్రదించండి. ఈ రక్తస్రావాన్ని నివారించేందుకు డాక్టర్లు ప్రత్యక్ష ఒత్తిడి విధాన పద్ధతులను ఉపయోగిస్తారు.

మీరు తరచుగా పునరావృతమయ్యే ఇలాంటి రక్తస్రావాన్ని కలిగి ఉన్నప్పుడు నాసల్ డీ-కంజస్టంట్ స్ప్రేలను (లేదా) వాసలైన్, పెట్రోలియం జెల్లీ వంటి లూబ్రికెంట్స్ను ఉపయోగించాలి.

డ్రై-నోస్తో బాధపడేవారు లూబ్రికేషన్ చేయడానికి, నువ్వుల నూనె ఆధారితమైన నాసల్ స్ప్రే లను ఉపయోగించవచ్చు. ఇది మీ ముక్కు నుంచి రక్తస్రావమవడానికి సంబంధమున్న అనేక ఆనవాళ్లను పూర్తిగా తొలగిస్తుంది.

మీరు సుదీర్ఘంగా 20 నిమిషాలపాటు రక్తస్రావాన్ని కలిగి ఉన్నప్పుడు (లేదా) గాయం కారణంగా మీరు తీవ్ర రక్తస్రావంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే అత్యవసర చికిత్స కోసం వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.

మీరు తరచుగా ఇలాంటి రక్తస్రావాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఏం చేస్తారు

మీరు తరచుగా ఇలాంటి రక్తస్రావాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఏం చేస్తారు

మీరు వారంలో ఒకటి కంటే ఎక్కువ సార్లు ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలి. డాక్టర్ మీకు చికిత్స ప్రారంభించే ముందు, మీ కుటుంబానికి చెందిన ఇతర సభ్యులు ఈ నోస్-బ్లీడింగ్ (లేదా) రక్తస్రావము వంటి సమస్యలను కలిగి ఉంటే గనుక, ఆ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటారు. కొన్నిసార్లు రక్తహీనతను & రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలను పరిష్కరించడానికి మీకు రక్త పరీక్ష చేయవలసి ఉంటుంది. ఈ చికిత్సా విధానమనేది ప్రధానంగా గాయాలు, అలర్జీలు, రక్తం గడ్డకట్టడం, ఇన్ఫెక్షన్స్ వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది.

ముక్కునుంచి రక్తస్రావమవడాన్ని సాధారణ చికిత్సా విధానాలతో నయం చేయవచ్చు. ఒకవేళ ఈ సమస్య మీకు తరచుగా పునరావృతమైనప్పుడు (లేదా) తీవ్రమైనప్పుడు దానికి కారణమైన మూలాలను వెతికి పట్టుకుని, సమర్థవంతమైన చికిత్సా విధానాలను పాటిస్తూ మీ సమస్యను పరిష్కరించుకోండి.

English summary

Nose Bleeds: Why Do We Get It And What Should We Do?

Nosebleeds are more common than you think. It happens to us suddenly. Without any obvious cause, bright red blood starts to stream from one nostril. And what's even worse? To majority of us who have had it at least once in our lifetime, nosebleeds or medically called epistaxes are often a mystery. However, there's good news. Although it seems scary while your nose is bleeding and you're not sure why it's happening, let us tell you that a nosebleed isn't usually dangerous. You just need proper information on why a nosebleed happens, how to treat it and ways to prevent it. In this article we're going to talk about all these aspects of nosebleeds. Read on to find out.
Desktop Bottom Promotion