For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక్క కిడ్నీతో ఎలా మనుగడ సాగించాలి? మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలివే...!

|

మనలో అనేకమంది ఆరోగ్యకరమైన మరియు పూర్తిగా పనిచేసే మూత్రపిండాలతో జన్మించినప్పటికీ, కొందరు వ్యక్తులు వివిధ కారణాల వలన కేవలం ఒక మూత్రపిండానికే పరిమితమవుతున్నారు. దీనికి యాక్సిడెంట్స్, డొనేషన్, ఆరోగ్య సమస్యలు మొదలైన అంశాలు ప్రధానంగా ఉన్నాయి. అరుదైన పరిస్థితుల్లో, కొందరు పుట్టుకతోనే ఒకే ఒక మూత్రపిండాన్ని కలిగి ఉంటున్నారు కూడా.

ఈ సమస్యను రెనెల్ ఎజెనిసిస్ అని పిలుస్తారు. మీరు ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించినట్లయితే ఒకేఒక మూత్రపిండము ఉన్నా కూడా ఎటువంటి ఆరోగ్య సంబంధ సమస్యలకు దారితీయదు. కానీ అనారోగ్యకర జీవనశైలి దీర్ఘకాలిక ఆరోగ్యం మీద తీవ్రప్రభావాన్ని చూపుతుంది.

Surviving On One Kidney: Things You Should Know

ఒక వ్యక్తి ఒకే ఒక పనిచేసే మూత్రపిండాన్ని కలిగి ఉండటానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి.

1. రెనెల్ ఎజెనిసిస్ -

1. రెనెల్ ఎజెనిసిస్ -

ఇది ఒక వ్యక్తి ఒకే ఒక మూత్రపిండంతో జన్మించిన పరిస్థితులను సూచిస్తుంది. ప్రతి 750మందిలో ఒకరికి ఇటువంటి సమస్య ఉంటుందని అంచనా. వీరిలో సాధారణంగా కుడి వైపున మూత్రపిండాన్ని కలిగి ఉండి, ఎడమ వైపు లేని పరిస్థితి ఉంటుంది. మహిళల కంటే పురుషులలో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంది. కానీ ఈ సమస్య వేరే ఇతర పరీక్షల ద్వారా మాత్రమే బయటపడే అవకాశాలు ఉన్న కారణంగా, అనేకులకు తమ పరిస్థితి మీద కనీస అవగాహన కూడా ఉండదు. ఎక్స్ -రే, సోనోగ్రామ్ పరీక్షలు ద్వారా ఈ పరిస్థితిని కనుగొనే వీలుంది.

2. రెనెల్ డిస్ప్లాసియా -

2. రెనెల్ డిస్ప్లాసియా -

ఇది ఒక వ్యక్తి రెండు మూత్రపిండాలతో జన్మించిన స్థితి, కానీ వాటిలో ఒకటి మాత్రమే పనిచేస్తుంది. రెండవది చాలా తక్కువగా పని చేయడం లేదా పూర్తిగా పనిచేయని స్థితిలో ఉంటాయి.

3. నెఫ్రెక్టమీ - మూత్రపిండాల్లో ఒకదాన్ని, శస్త్రచికిత్స కారణంగా కొంత భాగం తొలగించబడిన పరిస్థితిని నెఫ్రెక్టమీగా సూచిస్తారు. క్యాన్సర్ వంటి వ్యాధుల కారణంగా, గాయాలు లేదా ఇతర ఆరోగ్య సమస్యల వలన ఇది సంభవించవచ్చు.

డొనేషన్-

డొనేషన్-

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వేలమంది ప్రజలు తమ మూత్రపిండాల్లో ఒక ఆరోగ్యకరమైన మరియు పనిచేసే మూత్రపిండాన్ని అవసరం ఉన్నవారికి విరాళంగా ఇస్తారు. కానీ ఇది చాలా అరుదైన సందర్భాలలోనే జరుగుతుంటుంది. ముఖ్యంగా, గ్రహీత కుటుంబ సభ్యుడు, స్నేహితుడు, లేదా ఒక పరిచయకుడు అయి ఉండే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.

ఎవరైనా ఒకే ఒక ఫంక్షనల్ కిడ్నీతో జన్మిస్తే జరిగే పరిణామాలేంటి?

ఎవరైనా ఒకే ఒక ఫంక్షనల్ కిడ్నీతో జన్మిస్తే జరిగే పరిణామాలేంటి?

ఒకే ఒక పనిచేసే మూత్రపిండం ఉన్న చాలామంది తమ జీవితంలో ఆరోగ్య సమస్యలను తక్కువగా కలిగి ఉంటారు, లేదా అసలు ఏ సమస్యా లేకుండా జీవితాన్ని నడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఒకే ఒక్క మూత్ర పిండంతో జన్మించిన వారిలో, లేదా ఏదైనా సమస్య కారణంగా చిన్నతనంలోనే ఒక మూత్రపిండము తొలగించబడి ఉన్నట్లయితే, 25 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయసు తరువాత దశలో మూత్రపిండపు పని తీరు మందగిస్తుంది. కావున సమస్య గురించి తెలిసిన వారు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసినదిగా సూచిస్తుంటారు.

కానీ అది వారి జీవితకాలాన్ని ఏమాత్రమూ ప్రభావితం చేయదు కానీ ఒక దశ తరువాతి భాగంలో అధిక రక్తపోటును అభివృద్ధి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తంమీద, ఆరోగ్యకరమైన జీవనశైలినిని కలిగి ఉంటే, ఒకేఒక మూత్రపిండం ఉన్నా కూడా ఎటువంటి సమస్య లేకుండా జాగ్రత్తపడవచ్చు.

మూత్ర పిండాల మార్పిడి తర్వాత పనితీరు?

మూత్ర పిండాల మార్పిడి తర్వాత పనితీరు?

మార్చబడిన మూత్రపిండం కలిగి ఉన్నా కూడా సాధారణ మూత్రపిండాల వలెనే పనిచేస్తాయి. అందులో ఎటువంటి సందేహమూ లేదు. పిన్న వయసులోనే ఈ శస్త్రచికిత్స జరిగి ఉంటే, దాని గురించిన ఆందోళన అవసరంలేదు కూడా. ఎందుకంటే మూత్రపిండము దాని పరిమాణంలో, పనితీరులో సమయానుసారం మార్పులు చెందుతూ ఆరోగ్యంగా ఉంటుంది.

కానీ కిడ్నీ మార్పునకు గురైన వారు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించాలని సూచించబడింది. క్రమంగా మీ మూత్రపిండాల పనిభారం సాధ్యమైనంత తక్కువగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారాలు తినడం, తగినంత నీరు త్రాగటం, వ్యాయామం, తరచుగా డాక్టర్ పర్యవేక్షణలు కలిగి ఉండడం మరియు మీ డాక్టర్ సూచిస్తున్న జాగ్రత్తలను పాటించడం మొదలైనవి ఎంతగానో సహాయం చేస్తాయి.

ఎందుకు మరియు ఎప్పుడు మీరు మీ వైద్యుని సంప్రదించాలి?

ఎందుకు మరియు ఎప్పుడు మీరు మీ వైద్యుని సంప్రదించాలి?

మీ మూత్రపిండపు పనితీరుని కనీసం సంవత్సరానికి ఒకసారైనా తనిఖీ చేసుకోవడం ముఖ్యం. మీరు వైద్యుడిని సందర్శించినప్పుడు, ఒక సాధారణ రక్త మరియు మూత్ర పరీక్షల ద్వారా మీ మూత్ర పిండాల పనితీరుని అంచనా వేసి, పరిస్థితిని బట్టి సూచనలు సలహాలు ఇస్తారు.

మీరు కేవలం ఒక ఒక పనిచేసే మూత్రపిండాన్నికలిగి ఉన్న ఎడల, మీ వైద్యుని తరచుగా సంప్రదించాలి అనడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మూడింటి గురించి ఇక్కడ పొందుపరచబడింది.

రక్తపోటును తనిఖీ చేయడం –

రక్తపోటును తనిఖీ చేయడం –

పైన చెప్పినట్లుగా, ఒకే ఒక మూత్రపిండం కలిగి ఉన్న వ్యక్తి అధిక రక్తపోటును కలిగి ఉండి, నిర్లక్ష్యం చేసినట్లయితే, క్రమంగా ఇతర సమస్యలకు నాంది పలకవచ్చు. కావున తరచుగా వైద్యుని సంప్రదించడం మరియు మీ రక్తపోటు నియంత్రణలో ఉంచుకోవడం అనేది ముఖ్యం.

ప్రతిసారి కొత్త వైద్యుని సందర్శించునప్పుడు, మీ పరీక్షల గురించి లేదా మీరు తీసుకున్న మందుల గురించిన పూర్తి వివరాలను రిపోర్టులతో సహా వారికి తెలియజేయాలి. కొన్ని మందులు మూత్రపిండాలపై అదనపు భారాన్ని కలగజేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అవి సరిపడని పక్షంలో మరలా అవే వాడడం ద్వారా కొత్త సమస్యలను తీసుకుని రావొచ్చు.

ప్రోటీన్యూరియా తనిఖీ చేయడం-

ప్రోటీన్యూరియా తనిఖీ చేయడం-

ఇది రక్తం నుండి మూత్రంలోకి లీక్ అయ్యే అసాధారణంగా ఉన్న ప్రోటీన్ పరిస్థితి. రక్తం నుండి లీక్ అయ్యే అధికమైన ప్రోటీన్ ఫలితంగా, శరీరం మరింత సోడియం మరియు ద్రవాలను నిలబెట్టుకోవటంలో సమతుల్యతను కోల్పోతుంది. తద్వారా పొత్తికడుపు లేదా చీలమండలలో వాపు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఒకే ఒక మూత్రపిండముతో నివసించే ప్రజలు ఈవిషయంలో ఎక్కువ శ్రద్ద తీసుకోవలసి ఉంటుంది. మరియు వారి వైద్యుని క్రమం తప్పకుండా సందర్శించాలి. దానికితోడు, వైద్యునిచే సూచించబడిన ఆహారానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండవలసి ఉంటుంది.

జి.ఎఫ్.ఆర్ సమర్థత –

జి.ఎఫ్.ఆర్ సమర్థత –

జి.ఎఫ్.ఆర్ అనగా గ్లోమెర్యులర్ ఫిల్టరేషన్ రేట్. మూత్రపిండాల పనితీరు, రక్తనాళాల నుండి ఎంతమేర మూత్రపిండాలు వ్యర్ధ పదార్ధాలను తొలగించగలుగుతుందో అంచనా వేయడం కోసం దీనిని ఉపయోగిస్తారు. జి.ఎఫ్.ఆర్ లెక్కించేటప్పుడు వైద్యులు రోగి వయస్సు, లింగం, జాతి మరియు సీరం క్రియాటినిన్లను పరిగణనలోకి తీసుకుంటారు.

జి.ఎఫ్.ఆర్ ఫలితాల మీద ఆధారపడి, వైద్యులు వారి రోగులలో మూత్రపిండ వ్యాధులను అంచనా వేయవచ్చు లేదా విశ్లేషించవచ్చు. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవటానికి, రోగి వ్యాధి యొక్క దశను గుర్తించడంలో కూడా ఇది వారికి సహాయపడుతుంది.

అంతేకాక, ఆహారంలో కొన్ని పరిమితులు ఉంటాయి మరియు, రోగి అనుసరించవలసిన ఆహార రకం కూడా వయసుతో పాటు మారవచ్చు లేదా మారకపోవచ్చు. ఒక వైద్యుడు మాత్రమే వైద్య నివేదికల ప్రకారం ఎప్పటికప్పుడు ఆహార ప్రణాళికను సూచించగలడు.

ఒకే ఒక కిడ్నీ ఉన్న వ్యక్తులు క్రీడలు పాల్గొనడానికి అనుమతించబడుతారా?

ఒకే ఒక కిడ్నీ ఉన్న వ్యక్తులు క్రీడలు పాల్గొనడానికి అనుమతించబడుతారా?

ఒకే ఒక మూత్రపిండంతో ఉన్న ప్రజలు వారి మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకొనే క్రమంలో తరచుగా వ్యాయామం చేస్తుండాలి. క్రీడల్లో పాల్గొనడం అనేది పూర్తిగా వేరే విషయం., వీటివలన మీ మూత్రపిండంపై భారం గణనీయంగా పెరుగుతుంది. కావున వైద్యుని సలహా మేరకు, క్రీడను అనుసరించి ప్రణాళికలు చేసుకోవడం, లేదా వీలయితే దూరంగా ఉండడం మంచిది.

మీరు ఒకే మూత్రపిండముతో జన్మించినా లేదా శస్త్ర చికిత్స కారణంగా ఒకటి తొలగించినా లేదా మార్పిడి చెందిన మూత్రపిండమును కలిగి ఉన్న ఎడల, మీకుమీరే హాని చేసుకోకుండా ప్రణాళికలు ఎర్పరచుకోవాలి. క్రీడలు, ముఖ్యంగా బాక్సింగ్, రెజ్లింగ్, మార్షల్ ఆర్ట్స్, ఫుట్బాల్, హాకీ మొదలైన క్రీడలతో జాగ్రత్త వహించక తప్పదు. వైద్యులు అయితే, పూర్తిగా వీటి నుండి దూరంగా ఉండమని సూచిస్తుంటారు.

సురక్షిత కవచాలు సైతం గాయాల నుండి కాపాడలేని స్థితులు ఏర్పడుతుంటాయి. ఇవి ప్రమాద తీవ్రతను తగ్గించగలవు కానీ, ప్రమాదాన్ని కాదు. క్రీడలలో చేరడానికి మీకు తప్పనిసరి పరిస్థితులు ఉన్న ఎడల, ఎటువంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు మీ వైద్యునితో మాట్లాడడం మంచిది.

కిడ్నీ ఫంక్షన్ గణనీయంగా తగ్గుముఖం పడితే ఏం చేయాలి?

కిడ్నీ ఫంక్షన్ గణనీయంగా తగ్గుముఖం పడితే ఏం చేయాలి?

మీ మూత్రపిండాల పని తీరు తగ్గినప్పుడు, అది మూత్రపిండాల వైఫల్యం యొక్క చిహ్నం కావచ్చు. ఈ సమస్యను గుర్తించగల లక్షణాలు కొన్ని ఉన్నాయి.

వికారం లేదా వాంతులు (ఏ ఇతర స్పష్టమైన కారణము లేకుండా), అధిక అలసట మరియు అలసట భావన, ఆహార రుచిలో మార్పులు, కాలి వేళ్లు మరియు చేతి వేళ్లలో ఉబ్బినట్లు కనపడడం, చీలమండ లేదా ముఖంలో వాపు, మూత్రం రంగులో మార్పు, లేదా తరచుగా మూత్రం వస్తున్న అనుభూతి లేదా అతిమూత్ర వ్యాధి.

మీరు లేదా మీకు తెలిసిన వ్యక్తి ఈ లక్షణాలను ఎదుర్కొంటున్నట్లయితే, డాక్టర్ని వీలైనంత త్వరగా సందర్శించండి. మూత్రపిండాల పని తీవ్రంగా విఫలమైతే, రోగి ఈ.ఎస్.ఆర్.డి. లేదా ఆఖరి దశ మూత్రపిండ వ్యాధిని అభివృద్ధి చేస్తుంది. అటువంటి పరిస్థితిలో, రోగికి రోజూ డయాలసిస్ చేయవలసి ఉంటుంది లేదా వారికి మూత్రపిండ మార్పిడి అవసరం కూడా కావచ్చు.

ఒకే మూత్రపిండoతో నివసించడం అనేది తీవ్రమైన ప్రాణాంతక స్థితి కాదు, అలాగని విస్మరించదగినది కూడా కాదు.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర అంశాలు, జీవనశైలి, ఆరోగ్య, ఆహార, ఆధ్యాత్మిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Surviving On One Kidney: Things You Should Know

Most of us are born with two healthy & functioning kidneys but some people need to survive with a single kidney due to various reasons. Though having only one kidney doesn't cause problems in the short term, leading an unhealthy life & not taking precautions can lead to serious impact on the health in the long term.
Story first published: Friday, July 20, 2018, 13:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more