For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గేమింగ్ అడిక్షన్ అంటే ఏమిటి? దాని లక్షణాలు, చికిత్స ఏమిటి?

గేమింగ్ అడిక్షన్ అంటే ఏమిటి? దాని లక్షణాలు, చికిత్స ఏమిటి?

|

“వ్యసనం ఒక ప్రత్యేకమైన నరకం, అది వ్యక్తిలోని అసలు మనిషిని బయటకి లాగేసి, అతన్ని ప్రేమించినవారి మనస్సులను బాధపెడుతుంది.”

పైన చెప్పిన కొటేషన్ ఏ రకమైన వ్యసనానికైనా వర్తిస్తుంది, ఇది వ్యసనపరుడి జీవితాన్నే కాదు, అతని చుట్టుపక్కలవారి జీవితాలు కూడా పాడుచేస్తుంది, ఎందుకంటే వారే పరిణామాలను అనుభవించేది కాబట్టి.

వ్యసనం అనే పదం వినగానే మనం దాన్ని సాధారణంగా మద్యం, సిగరెట్లు, డ్రగ్స్, మోసం, సెక్స్ వంటి వాటితో కలిపేస్తాం.

కానీ అంతగా తెలీని వ్యసనాల రకాలు కూడా ఉన్నాయి, అవి కూడా మద్యం లేదా డ్రగ్స్ అంత నాశనాలు సృష్టించగలవు.

 What Is ‘Gaming Addiction’? What Are Its Symptoms & Treatment?

ఉదాహరణకి, కొంతమంది వారికి అవసరం లేకపోయినా దొంగతనాలు చేస్తుంటారు, కేవలం ఆ థ్రిల్ కోసం, చేసాక సంతృప్తి కోసం చేస్తుంటారు. ఇది ఒక తీవ్రమైన మానసిక సమస్య క్లెప్టోమేనియా.

అందుకని ఏ విషయాన్ని అయినా, పదార్థాన్నైనా అతిగా చేస్తే, తీసుకుంటే, వ్యసనాలకి దారితీస్తుంది.

వ్యసనాలు సాధారణంగా ఒక వ్యక్తి జీవితాన్ని నియంత్రణలోకి తీసేసుకుంటాయి, ఎందుకంటే వారు అనుక్షణం దేనికి బానిస అయ్యారో దాని గురించే ఆలోచిస్తుంటారు.

వ్యసనాల వలన అనారోగ్యం, డబ్బు,బంధాలు పోవటం, గౌరవం తగ్గిపోవటం, చాలామటుకు వ్యసనాలు చట్టవ్యతిరేకం కూడా అవుతాయి. అందుకన్ని ఈ అన్ని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇటీవల మనలో చాలామంది డబ్యూహెచ్ ఓ(ప్రపంచ ఆరోగ్య సంస్థ) ఆటల వ్యసనం కూడా మానసిక సమస్యగా గుర్తించటం గమనించే ఉంటాం.

గేమింగ్ నిజంగానే అంత అపాయకరమా? కింద తెలుసుకోండి.

గేమింగ్ అంటే ఏమిటి?

మొదటగా గేమింగ్ అంటే ఇక్కడ కంప్యూటర్ గేములు, లేదా వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే ఫోనులు, లాప్ టాప్ లు, ప్లే స్టేషన్స్ మొదలైనవాటిల్లో ఆడే ఆటలని అర్థం.

బయట ఆడే ఆటలు, వివిధ క్రీడలని అర్థం కాదు. నిజానికి ఇవి ఆరోగ్యకరమైనవి.ఈ కాలంలో మనం చాలామందిని, నిజానికి ఆరేళ్ళ పసిపిల్లల నుంచి 40ఏళ్ళ పెద్దవారి వరకూ కంప్యూటర్ గేములు, వారి ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఆన్ లైన్ గేములు ఆడటం చూస్తున్నాం.

మామూలు మనిషికి ఈ గేములు అంత అపాయకరంగా కన్పించకపోవచ్చు కానీ నిజానికి, గేమింగ్ మనుషులను అనారోగ్యకరమైన వ్యసనం వైపుకి తీసుకెళ్తోంది.

పిల్లలు ఇంట్లో తమ పరికరాలపై ఆడుకోవటం కోసం బయటకెళ్ళి ఆటలు ఆడుకోటానికి నిరాకరిస్తున్నారు. దీని వలన వారు శారీరకంగా ధృఢంగా ఉండకుండా, స్కూలు పనిలో కూడా ఏకాగ్రత పెట్టలేరు.

పెద్దవారు సాధారణంగా ఒంటరితనాన్ని,మనుషులకి దూరంగా ఉండటానికి గేమింగ్ చేస్తుంటారు.కానీ వారు కూడా ఇంటిలోపల ఎక్కువసేపు పరికరాలతో గడపటం వలన వారు కూడా ఫిట్ గా ఉండకుండా ఉద్యోగాలు, జీవితంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

 What Is ‘Gaming Addiction’? What Are Its Symptoms & Treatment?

పరిశోధనల్లో స్త్రీలకన్నా పురుషులు ఈ 'గేమింగ్ అడిక్షన్’ బారిన పడతారని తేలింది. కానీ చాలామంది ఆడవారు కూడా గేమింగ్ వలన ఇలాంటి సమస్యలే ఎదుర్కొన్నారు.

గేమింగ్ ఎప్పుడు వ్యసనంలా మారుతుంది?

గేమింగ్ వ్యసనం లక్షణాలు ఎంతసేపటి నుంచి ఆడుతున్నామో అని సమయంపై ధ్యాస లేకపోవటం, జీవితంలో చదువు, ఉద్యోగం, బంధాలు వాటివంటి కన్నా గేమింగ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, నెగటివ్ పరిణామాలు ఎదుర్కున్నాక కూడా గేమింగ్ కొనసాగించడం, 12 నెలలకన్నా ఎక్కువగా వరసగా గేమింగ్ వ్యసనం ఉండటం, ఎక్కువ గేమింగ్ వలన వ్యక్తిగత జీవితం, బంధాల మధ్య బ్యాలెన్స్ లేకపోవటం వంటివి.

అందుకని ఒక వ్యక్తి కేవలం గేమింగ్ కోసం తన జీవితంలో పాజిటివ్ విషయాలన్నీ కోల్పోతుంటే, ఇంకా దీని వలన మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంటే, ఇది వ్యసనం కేటగిరీలోకి వస్తుంది.

మనం ముందే చదివినట్లు వ్యసనం కేవలం దానిబారిన పడిన వారినే కాదు, వారి దగ్గరివారిపై కూడా ప్రభావం చూపిస్తుంది.

గేమింగ్ వ్యసనంపై డబ్యూహెచ్ ఓ అభిప్రాయం

18,జూన్ 2018 నాడు, డబ్యూహెచ్ ఓ గేమింగ్ అడిక్షన్ ను మానసిక ఆరోగ్య స్థితిగా వర్గీకరిస్తూ, లేటెస్ట్ డిఎస్ ఎం (డయాగ్నోస్టిక్ అండ్ స్టాటస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్) లిస్టులో చేర్చింది.

ఇది గేమింగ్ అడిక్షన్ కి సంబంధించి నెగటివ్, అబ్సెసివ్ ప్రవర్తన కారణంగా జరిగింది, ఇంకా నిపుణులు దీనికి వైద్యసాయం, చికిత్స అవసరమని అభిప్రాయపడ్డారు.

మానసిక నిపుణులు ఈ సమస్యని కోగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, డీ అడిక్షన్ థెరపీలు, మందులు నియంత్రణలోకి తెస్తాయని తేల్చారు.

కానీ కొంతమంది నిపుణులు మాత్రం గేమింగ్ అడిక్షన్ ను మానసిక డిజార్డర్ గా వర్గీకరించటం అంత సరైనది కాదని ఎందుకంటే అది ఒక మానసిక సమస్యగా నిరూపించే పరిశోధన ఇంకా సరిగ్గా జరగలేదని వాదిస్తున్నారు.

ఏదేమైనా, గేమింగ్ వ్యసనపరుడి జీవితం, ఆరోగ్యంపై నెగటివ్ పరిణామాలు చూసినవారు మాత్రం దీన్ని మానసిక సమస్య అనే ఒప్పుకుంటూ, చికిత్స కోరుతున్నారు.

మీకు తెలిసినవారెవరైనా ఈ గేమింగ్ అడిక్షన్ లక్షణాలతో కన్పిస్తే, వైద్య సాయం తీసుకోండి, దీన్ని మనం పూర్తిగా మానసిక సమస్య అని నమ్మినా లేకపోయినా!

English summary

What Is ‘Gaming Addiction’? What Are Its Symptoms & Treatment?

What Is ‘Gaming Addiction’? What Are Its Symptoms & Treatment?, "Addiction is a special kind of hell; it takes the soul out of the addict and breaks the heart of everyone who loves them". The above-mentioned quote is very true with regards to any kind of addiction, as it not only destroys the life of the addict, but a
Desktop Bottom Promotion