For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిపా వైరస్: ట్రాన్స్మిషన్, లక్షణాలు, మరియు రోగ నిర్ధారణ

|

1998 లో మొట్టమొదటిసారిగా మలేషియాలో పందులను కాచే రైతులలో ఈ నిఫా వైరస్ కనుగొనడం జరిగింది. ఆ తర్వాత దీని ప్రభంజనాన్ని ఎదుర్కొన్న ప్రాంతంగా కేరళ నిలిచింది. తాజాగా ఈ నిఫా కేసు ఎర్నాకుళం జిల్లా, కేరళలోని 23 ఏళ్ల విద్యార్థికి సోకినట్లుగా నివేదించబడింది. క్రమంగా ఈ విదార్దికి సంబంధించిన 86 మంది సన్నిహిత సంబంధీకులను ఇన్ఫెక్షన్ పరిశీలన నిమిత్తం, ఆరోగ్యశాఖ పరిశీలనలో ఉంచడం జరిగింది.

అసలు నిఫా వైరస్ అంటే ఏమిటి :

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం నిఫా వైరస్ (NiV) అనేది ఒక వైరల్ సంక్రమణగా చెప్పబడుతుంది. క్రమంగా దీనిని జూనోసిస్ వర్గం క్రింద చేర్చబడింది. జూనోసిస్ అంటే, ఈ వైరస్ మనుషులను మాత్రమే కాకుండా, ఇతర రకాల జంతువులను కూడా ప్రభావితం చేయగలదు. ఈ వైరస్ ప్రభావానికి గురైన జంతువుల నుంచి మనుషులకు నిఫా వైరస్ సంక్రమిస్తుంది. ఇది సంక్రమించే మానవుల నుండి ప్రత్యక్ష, పరోక్ష కారణాల ద్వారా ఇతరులకూ ఈ వ్యాధి సంక్రమించవచ్చు.

Nipah Virus

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం, నిఫా వైరస్ యొక్క ప్రధాన వాహకంగా టెరోపోడిడే కుటుంబానికి చెందిన ఒకరకమైన గబ్బిలంగా(ఫ్రూట్ బాట్) నివేదించబడింది.

నిఫా వైరస్ సంక్రమణ విధానం :

వైరస్ సోకిన గబ్బిలం లేదా పంది (గబ్బిలాలు ప్రాథమిక కారణంగా పరిగణించడం జరిగినప్పటికీ) ద్వారా మానవులకు వ్యాప్తి చెందుతాయి. అదేవిధంగా ఇతర నిఫా వైరస్ సోకిన వ్యక్తుల నుండి కూడా వ్యాపించవచ్చు.

వ్యాధిసోకిన గబ్బిలాల లాలాజలం లేదా మూత్రంతో కలుషితమైన పండ్లు లేదా పండ్ల ఉత్పత్తులను తీసుకోవడం అనేది ఈ వ్యాధి యొక్క ప్రాథమిక వనరుగా భావించబడుతుంది. మొదట్లో వచ్చిన కేసుల్లో, జంతువులతో సన్నిహితంగా ఉన్న మనుషుల నుంచి మనుషులకు సోకే అంటువ్యాధిగా పరిగణించినప్పటికీ, ఆ తర్వాతి కాలంలో గబ్బిలాలు, మరియు పందులు కూడా వాహకాలుగా ఉన్నాయని నిర్ధారణకు రావడం జరిగింది. ఈ వైరస్ సోకిన గబ్బిలాలు తిన్న పండ్లను స్వీకరించడమనేది ఇన్ఫెక్షన్ విస్తృతంగా వ్యాపించడానికి గల ప్రధాన కారణంగా ఉంది.

Nipah Virus

నిఫా వైరస్ సోకిన రోగుల యొక్క కుటుంబం మరియు సంరక్షకులలో అనేకమందికి, హ్యూమన్-టు-హ్యూమన్ సంక్రమణ (ట్రాన్స్మిషన్స్) జరిగినట్లు నివేదించబడింది కూడా. క్రమంగా, 2001 సమయంలో నమోదుకాబడిన సుమారు 75 శాతం కేసుల్లో ప్రధానంగా ఆసుపత్రి సిబ్బంది, హెల్త్ కేర్ ప్రొవైడర్స్, మరియు సందర్శకులు ఉన్నారని అధ్యయనాలు తేల్చాయి.

నిఫా వైరస్ సంక్రమణ లక్షణాలు :

ఈ వైరస్ సంక్రమణ ప్రారంభ చిహ్నాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి :

  • జ్వరం
  • తలనొప్పి
  • కండరాల నొప్పి
  • గొంతునొప్పి
  • వాంతులు
  • తిరగడం
  • మగత
  • ఆలోచనా శక్తి మందగించడం
  • తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు.
Nipah Virus

ఈ సంక్రమణలు, తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత సమస్యల నుండి, ప్రాణాంతకమైన ఎన్సెఫలిటిస్ మరియు అసిమ్ప్టోమాటిక్ సంక్రామ్యతల వరకు వ్యాప్తి చెందుతాయి. నిఫా వైరస్ సోకిన పక్షంలో, మెదడువాపు లేదా మెదడులో విపరీతమైన మంటను అనుభవించవచ్చు.

అంతేకాకుండా, కొంత మంది తీవ్రమైన న్యుమోనియా, లేదా తీవ్రమైన శ్వాసకోశ సమస్యలకు కూడా గురికావొచ్చు. పరిస్థితిన్ చేయిదాటిన పక్షంలో ఎన్సెఫలైటిస్ మరియు మూర్ఛలు వంటి సమస్యలను కూడా ఎదుర్కొనవలసి ఉంటుంది. క్రమంగా 24 నుంచి 48 గంటలలోపు కోమాలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అయితే, వైరస్ సంక్రమణ చిహ్నాలు మరియు లక్షణాలు కనిపించడం ప్రారంభించడానికి సుమారు 5 నుండి 14 రోజుల సమయం పడుతుంది. క్రమంగా రోగిని సుమారు 45 రోజులపాటు ఇన్క్యుబేషన్ పీరియడ్లో ఉంచవలసి ఉంటుంది. CDC ప్రకారం, ఈ వైరస్ బారినపడి, బతికి బయటపడ్డ వారిలో దీర్ఘకాలిక దుష్ప్రభావాలు వ్యక్తిత్వపరమైన మార్పులు మరియు మూర్ఛ వంటి సమస్యలు కొనసాగే అవకాశాలు ఉండవచ్చునని చెప్పబడుతుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) యొక్క నివేదికల ప్రకారం ఈ వ్యాధిబారిన పడిన, సుమారు 20 శాతం మంది రోగులు ఇంకనూ శ్వాస సంబంధిత రుగ్మతలు, ఇతరత్రా నరాల బలహీనతలతో కూడిన పరిస్థితులను అనుభవిస్తూ జీవిస్తున్నారు.

Nipah Virus

నిఫా వైరస్ వ్యాధి నిర్ధారణ :

నిఫా వైరస్ యొక్క మొదటి చిహ్నాలు మరియు లక్షణాలు వ్యాధిపరమైన ఖచ్చితత్వాన్ని ఇవ్వలేవు. మరియు వ్యాధి సంక్రమణ ప్రారంభ సమయంలో అనుమానించదగినదిగా కూడా ఉండదు; క్రమంగా ఖచ్చితమైన రోగనిర్ధారణ, మరియు ముందస్తు ఫలితాల విషయంలో సవాళ్లను సృష్టించవచ్చు. అదేవిధంగా, సకాలంలో సమర్థవంతమైన నియంత్రణా చర్యలను తీసుకోవడం ద్వారా, త్వరితగతిన ఈ వైరస్ నుండి బయటపడే అవకాశాలు మెండుగా ఉంటాయి.

రోగుల నుండి ప్రయోగశాలకు రక్త మరియు మూత్ర నమూనాలను బదిలీ చేయడం, ప్రయోగాలు చేయడానికి తీసుకునే సమయం, అవసరమైన నమూనాల పరిమాణం, నాణ్యత, మరియు ప్రయోగశాలల ఫలితాల ఖచ్చితత్వం మొదలైన అంశాలపరంగా వ్యాధినిర్ధారణ ఖచ్చితత్వం ఆధారపడి ఉంటుంది. వ్యాధి యొక్క తీవ్రమైన దశలో, రోగి వ్యక్తిగత క్లినికల్ హిస్టరీని కలిపి ఇన్ఫెక్షన్ గుర్తించడానికి ఆస్కారం ఉంది.

రోగ నిర్ధారణ పరీక్షలలో శరీర ద్రవాలలో, రియల్-టైం పాలిమరేజ్ చైన్ రియాక్షన్స్ (RT-PCR), అదేవిధంగా ఎలిసా(ELISA) ద్వారా యాంటీబాడీ డిటెక్షన్ ప్రధానంగా ఉన్నాయి. పాలీమరేజ్ చైన్ రియాక్షన్ (PCR) ఎస్సే, ఎంజైమ్లతో సంబంధం ఉండే ఇమ్యూనోసోర్బెంట్ ఎస్సే (ELISA) మరియు సెల్ కల్చర్ ద్వారా వైరస్ ఐసోలేషన్ వంటి ఇతర పరీక్షలు కూడా వైరస్ నిర్ధారణలో సహాయం చేస్తాయి.

నిఫా వైరస్ ఇన్ఫెక్షన్ కు చికిత్స :

ప్రస్తుతానికి ఈ నిఫా వైరస్ సోకినా వారికి, ఖచ్చితత్వంతో కూడిన చికిత్సలు లేదా వ్యాక్సిన్ అంటూ అందుబాటులో లేవు. రిబావిరీన్, అనే ఒక యాంటీ వైరల్ డ్రగ్, నిఫా వైరస్ వలన సంభవించే ఎన్సెఫాలిటిస్ బారిన పడిన రోగులలో మరణాలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు నిరూపితమైంది. వ్యాధి సోకిన వ్యక్తులకు సపోర్టివ్ కేర్ తో చికిత్స చేయడం జరుగుతుంది. క్రమంగా ఆ వ్యక్తిని హైడ్రేటెడ్ గా ఉంచడం, వాంతులు మరియు వికారాలను గురికాకుండా చూడడం వంటివి చికిత్సలో ప్రధాన భాగాలుగా ఉంటాయి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Nipah Virus: Transmission, Symptoms And Diagnosis

According to the World Health Organisation, Nipah virus (NiV) is a viral infection which has emerged newly and falls under the zoonosis category. Zoonosis means, this virus can not only affect humans, but it can also affect other types of animals too. The natural host of the Nipah virus is the fruit bat of the Pteropodidae family.
Story first published: Friday, June 7, 2019, 12:15 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more