For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోకాళ్ళు, కీళ్ళనొప్పులకు స్పెషల్ హోం మేడ్ డ్రింక్

మోకాళ్ళు, కీళ్ళనొప్పులకు స్పెషల్ హోం మేడ్ డ్రింక్ .మోకాలి నొప్పి మరియు ఆర్థరైటిస్ చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఇది చాలా మందికి, ముఖ్యంగా చిన్న వయస్సులోనే చికాకు కలిగిస్తుంది.

|

మోకాలి నొప్పి మరియు ఆర్థరైటిస్ చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఇది చాలా మందికి, ముఖ్యంగా చిన్న వయస్సులోనే చికాకు కలిగిస్తుంది. మోకాలి నొప్పి మరియు ఆర్థరైటిస్ రావడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఇది ప్రమాదం కారణంగా ఎముక సమస్యలకు దారితీస్తుంది.

మోకాలి నొప్పి మరియు ఆర్థరైటిస్ తో చాలా మంది భరించలేని నొప్పిని అనుభవిస్తారు. దీని వల్ల చాలా మందిలో నడవడలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైనా ప్రమాదం వల్ల ఎముక దెబ్బతినడం తరచుగా ప్రారంభంలో గుర్తించబడదు. ఇది దీర్ఘకాలంలో తీవ్ర సమస్యగా మారవచ్చు.

మోకాలి నొప్పి మరియు ఆర్థరైటిస్‌ను నయం చేసుకోవడానికి అనేక హోం రెమెడీస్ ఉన్నాయి. మన వంటగదిలో మనం ఉపయోగించే కొన్ని పదార్థాలు మోకాళ్ళు, కీళ్ళ నొప్పులను నివారించడానికి సహాయపడుతాయియి.

వంటగదిలో మనం తరచూ ఉపయోగించే పదార్థాల నుండి తయారయ్యే ఒక ప్రత్యేక పానీయం మోకాళ్ళు, కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ పానియం 100% ప్రభావంతంగా పనిచేస్తుంది. మరి ఈ పానయం ఏంటో, దాన్ని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం...

మిరియాలు, అల్లం మరియు జీలకర్ర

మిరియాలు, అల్లం మరియు జీలకర్ర

మిరియాలు, అల్లం మరియు జీలకర్ర వంటకు విరివిగా ఉపయోగిస్తుంటారు. ఇవన్నీ గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. ఇవి చాలా రోగాలను నయం చేయడంలో ఒక మంచి ఔషదంగా కూడా పనిచేస్తాయి. ఇందులో ని ఔషధగుణాలు మోకాళ్ళ, కీళ్ళనొప్పులను నివారించడంలో ప్రభావంతంగా పనిచేస్తాయి.

వీటిలో

వీటిలో

బ్లాక్ పెప్పర్ లేదా మిరియాల్లో పెప్పరిన్ అనే ప్రత్యేకమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, సి, ఫ్లేవనాయిడ్లు మరియు కెరోటిన్ కూడా ఉంటాయి. జీలకర్ర ఆరోగ్య ప్రయోజనాలను అందించేవాటిలో ఒకటి. పొట్ట ఆరోగ్యానికి మరియు బరువు తగ్గడానికి ఇది మంచి ఔషధాల్లో ఒకటి. అల్లంలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వాటిలో ముఖ్యంగా మోకాళ్ళ, కీళ్ళ నొప్పులను తగ్గించే గుణాలు కూడా ఉన్నాయి.

వీటిరి పొడి చేసి

వీటిరి పొడి చేసి

మిరియాలు, అల్లం, జీలకర్ర వీటన్నింటిని సమానంగా తీసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇంకా వీటిని పొడి చేయడానికి ముందు గోరెవెచ్చగా వేయించి పొడి చేసుకోవడం ఉత్తమం. నాలుగు టేబుల్ స్పూన్లు మిరియాలు, మూడు టీస్పూన్ల జీలకర్ర, మూడు టీస్పూన్ల బార్లీ , కొద్దిగా అల్లం తీసుకోండి. వీటన్నింటిని కలిపి పొడి చేసుకోవాలి.

వేడినీళ్ళలో

వేడినీళ్ళలో

ఒక గ్లాసు నీళ్ళు తీసుకుని గిన్నెలో పోసి వేడి చేయాలి. నీరు మరుగుతుండగా ఈ పొడిని రెండు టుబుల్ స్పూన్లు కలపాలి. బాగా మిక్స్ చేసి ఉడికించిన తర్వాత వడపోసి గోరువెచ్చగా తాగాలి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, వెన్నునొప్పి, ఆర్థరైటిస్ నుండి ఉపశమనం పొందడానికి ఈ ప్రత్యేకమైన పానీయం చాలా బాగుంటుంది.

ఎప్పుడు తాగాలి:

ఎప్పుడు తాగాలి:

దీన్ని ఎసమయంలో తాగితే మంచి ఫలితాలను ఇస్తుంది అంటే? ఉదయం తాగాలి. అదీ కూడా భోజనానికి అరగంట ముందు తాగాలి. అలాగే రాత్రి భోజనానికి అరగంట ముందు త్రాగాలి. రోజూ ఇలా చేయడం వల్ల మోకాలి నొప్పి, ఆర్థరైటిస్ నుండి ఉపశమనం లభిస్తుంది. కీళ్ళనొప్పులు, వాపులు నుండి ఉపశనం పొందడంలో కూడా ఇది సహాయపడుతుంది. మోకాళ్ళ నొప్పిని కూడా తగ్గిస్తుంది.

ఎముకలను బలోపేతం చేస్తుంది:

ఎముకలను బలోపేతం చేస్తుంది:

శరీరంలో ఎముకలను బలోపేతం చేయడానికి, ఆ ప్రదేశంకు ఎటువంటి హాని కలగకుండా ఉండాలంటే ఇది చాలా మంచిది. ఈ పానియం అన్ని రకాల నొప్పుల నుండి ఉపశమనం కలిగించి ఎముకలను ఆరోగ్యంగా..బలంగా మార్చుతుంది.

శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుతుంది:

శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుతుంది:

ఈ పానీయం రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా గొప్పగా సహాయపడుతుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పొట్టకు సంబంధించిన యాసిడ్స్ మరియు గ్యాస్ సమస్యలకు ఇది మంచి పరిష్కార మార్గం.

English summary

Special Home made Drink To Heal Knee and Joint Pain

Special Home Made Drink To Heal Knee And Joint Pain, Read more to know about,
Story first published:Saturday, September 14, 2019, 13:32 [IST]
Desktop Bottom Promotion