Latest Updates
-
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా!
యువ భారతీయుల్లో గుండెపోటు సమస్యలు రావడానికి కారణాలేంటో తెలుసా...
యువ భారతీయులు ఎందుకని ఎక్కువగా గుండె పోటు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారో ఎయిమ్స్ డాక్టర్ వివరించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవలే బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ సీజన్-13 విజేత సిద్ధార్థ శుక్లా మరణించిన సంగతి తెలిసిందే. తన మరణానికి గుండెపోటు ప్రధాన కారణమని ప్రాథమిక నివేదికలో వెల్లడైనట్లు వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) యొక్క కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అంబుజ్ రాయ్, యువతలో గుండెపోటు మరియు గుండె సంబంధిత సమస్యలు పెరగడానికి ప్రధాన కారణాలను వివరించారు.

ఇటీవలి కాలంలో భారతీయులలో గుండె సంబంధిత కేసులు పెరగడం చూస్తుంటే ఆరోగ్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో క్రమంగా చిన్న వయసు గల వారిలో గుండెపోటు కేసులు ఎందుకు పెరిగాయి.. ఎందుకని చాపకింద నీరులా నెమ్మది గుండె సంబంధిత కేసులు పెరుగుతున్నాయనే వివరాలపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలోని AIIMS యొక్క కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అంబుజ్ రాయ్, ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యువతలో గుండెపోటు మరియు కార్డియాక్ అరెస్టు కేసులు పెరగడానికి గల ప్రధాన కారణాలేంటి అనే వివరాలను వెల్లడించారు.

మానసిక ఒత్తిడి..
మానసిక ఒత్తిడి, శారీరక ఆరోగ్యం మరియు ఇతర కారణాల వల్ల యువ భారతీయులలో పెరుగుతున్న గుండె సంబంధిత కేసులతో ముడిపడి ఉందని డాక్టర్ రాయ్ నొక్కి చెప్పారు. కొందరు వ్యాయామం చేస్తున్నారని, దీని వల్ల గుండె సంబంధిత సమస్యలకు దూరం కావొచ్చని.. కానీ మద్యం మరియు మాదక ద్రవ్యాలను తీసుకునే అలవాటు ఉన్నవారు ఇలాంటి సమస్యలను అధిగమించడం కష్టమన్నారు.

హార్మోన్లలో మార్పులు..
మాదక ద్రవ్యాలను తీసుకోవడంతో పాటు పొగ తాగడం వంటి వాటి వల్ల మానవ శరీరంలో హార్మోన్ల మార్పులు వేగంగా జరుగుతాయని, ఇవి నేరుగా గుండె రుగ్మతలతో ముడిపడి ఉంటాయని, ఈ కారణంగా యువతలో గుండె సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

మానసిక ఆరోగ్యం..
గుండె సంబంధిత వ్యాధుల నుండి తప్పించుకునేందుకు మానసిక ఆరోగ్యంపై కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాలన్నారు.. మన జీవితాల్లో చాలా మంది లైఫ్ స్టైల్ చాలా ఒత్తిడితో కూడుకుని ఉంటుంది. చాలా మంది వ్యక్తులు తమ సొంత శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి సమయం కేటాయించకుండా ఎక్కువ గంటలు పని చేస్తున్నారు. ఇలాంటి పనుల వల్ల హై-వోల్టేజీ జీవనశైలికి దారి తీస్తుంది. దీని వల్ల వ్యక్తిగత ఆరోగ్యానికి తక్కువ సమయం ఇవ్వబడుతుంది.

జన్యుపరమైన సమస్యలు..
జన్యుపరమైన లేదా కుటుంబ చరిత్ర కూడా గుండెపోటు సంబంధిత సమస్యలకు కారణామా అన్న ప్రశ్నకు జవాబిస్తూ.. ఆసియా దేశాలలో చాలా మంది ప్రజలు జన్యువుల కారణంగా గుండె సంబంధిత రుగ్మతలను లిగి ఉంటారు. అందులో జన్యు నిర్మాణ కారణాలలో ఒకటి. అందుకే మన దేశంలోని యువకులు పశ్చిమ దేశాల కంటే ఎక్కువగా గుండెపోటును ఎదుర్కొంటున్నారు.

ఇవి మానుకోవాలి..
మన భారతీయులు గుండె సంబంధిత సమస్యలను తప్పించుకోవడానికి తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి పొగ తాగడం మానుకోవాలి. మద్యం వాడాకాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించాలి. ధ్యానం మరియు యోగా చేయడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. దీని వల్ల మన లైఫ్ స్టైల్ అలవాట్లు నెమ్మదిగా మారే అవకాశం ఉందని తెలిపారు.
మానసిక ఒత్తిడి, శారీరక ఆరోగ్యం మరియు ఇతర కారణాల వల్ల యువ భారతీయులలో పెరుగుతున్న గుండె సంబంధిత కేసులతో ముడిపడి ఉందని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) యొక్క ప్రొఫెసర్ డాక్టర్ రాయ్ నొక్కి చెప్పారు. కొందరు వ్యాయామం చేస్తున్నారని, దీని వల్ల గుండె సంబంధిత సమస్యలకు దూరం కావొచ్చని.. కానీ మద్యం మరియు మాదక ద్రవ్యాలను తీసుకునే అలవాటు ఉన్నవారు ఇలాంటి సమస్యలను అధిగమించడం కష్టమన్నారు. కాబట్టి సాధ్యమైనంత మేరకు ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.



Click it and Unblock the Notifications