For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెక్స్ తర్వాత ఈస్ట్ ఇన్ఫెక్షన్ కు కారణాలు, చికిత్స మరియు నివారణ

|

వైజినల్ (యోని) ఈస్ట్ ఇన్ఫెక్షన్, దీన్నే వల్వోవాజినల్ కాన్డిడియాసిస్ అని కూడా పిలుస్తారు. యోనిమార్గంలో ఉండే ఆరోగ్యకరమైన ఈస్ట్ , యోని మోతాదుకు మించి పెరిగినప్పుడు ఇన్ఫెక్షన్ కు గురి అవుతారు. ఇది ఇది లైంగికంగా సంక్రమించే సంక్రమించే ఇన్ఫెక్షన్ కాదు, అయినప్పటికీ, సంభోంగం తర్వాత అభివృద్ధి చెందుతుంది.

మహిళల్లో అంతర్గతంగా భాదించే ఈ ఈస్ట్ ఇన్ఫెక్షన్ చాలా అసౌకర్యంగా, చీకాకు కలిగిస్తుంది. ఈమాదిరి ఇన్ఫెక్షన్ ఉప్పుడు సెక్స్యువల్ యాక్టివిటీస్ లో పాల్గొన్నప్పుడు కొత్త బ్యాక్టీరియ చేరి పరిస్థితి మరింత తీవ్రమవుతుంది.

మహిళల్లో సాధారణంగా వచ్చే ఈస్ట్ ఇన్ఫెక్షన్ అంత ప్రమాదకరమైనది కాదు. మందులతో నయం చేసుకోవచ్చు. మహిళ జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ సమస్య తప్పకుండా ఎదుర్కొంటారు.

సెక్స్ తర్వాత ఈస్ట్ ఇన్ఫెక్షన్ కు కారణాలు:

సెక్స్ తర్వాత ఈస్ట్ ఇన్ఫెక్షన్ కు కారణాలు:

సంభోగం తర్వాత యోని ప్రాదేశంలో కాండిడా ఫంగస్ అనే కంటికి కనిపించని ఫంగస్ పెరుగుతుంది. యోని ప్రదేశంలో బ్యాక్టీరియల్ ఎకోసిస్టమ్ లో ఈ ఫంగస్ ఒక బాగమే.

సంభోగ సమయంలో భాగస్వామి పురుషాంగం వెజైనల్ ఎకో సిస్టమ్ లో చొచ్చుకుపోయినప్పుడు ఈస్ట్ ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. అంతే కాదు సెక్స్ టాయ్స్ ద్వారా కూడా వజైనల్ బ్యాక్టీరియా యోనిలోకి చేరి ఈస్ట్ ఇన్ఫెక్షన్ పెరగుతుంది.

పురుషాంగం ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి సంభోగంలో పాల్గొనడం ద్వారా

పురుషాంగం ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి సంభోగంలో పాల్గొనడం ద్వారా

పురుషాంగం ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి సంభోగంలో పాల్గొనడం ద్వారా స్త్రీ యోనిలో కూడా ఈస్ట్ ఇన్పెక్షన్ అభివృద్ధి చెందుతుంది. దీన్ని బట్టి పార్ట్నర్ లో ఏ ఒక్కరికి ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నా రెండో వ్యక్తికి ఈ ఇన్ఫెక్షన్ సంక్రమించే అవకాశం ఉంటుంది. యోని ప్రదేశంలో కొత్త బ్యాక్టీరియా చేరి అంతరాయం కలిగిస్తుంది, ఇది యోనిలో ఈస్ట్ పెరగడాన్ని ప్రేరేపిస్తుంది.

ఈస్ట్ ఇన్ఫెక్షన్ అన్నది కేవలం యోనికి సంబంధించినది మాత్రమే కాదు

ఈస్ట్ ఇన్ఫెక్షన్ అన్నది కేవలం యోనికి సంబంధించినది మాత్రమే కాదు

ఈస్ట్ ఇన్ఫెక్షన్ అన్నది కేవలం యోనికి సంబంధించినది మాత్రమే కాదు, ఓరల్ సెక్స్ ద్వారా కూడా ఈస్ట్ ఈన్ఫెక్షన్ పెరుగుతుందని అధ్యయనాలు నొక్కి చెబుతున్నాయి. ఓరల్ సెక్స్ చేసేటప్పుడు , కాండిడా మరియు బ్యాక్టీరియా భాగస్వామి నోరు, నాలుక మరియు చిగుళ్ళలోకి ప్రవేశించగలవు.

యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్ కు ఇతర కారణాలు

యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్ కు ఇతర కారణాలు

యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్ కు ఇతర కారణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ

గర్భాధారణ

రక్తంలో అధిక చక్కెర స్థాయి

చికిత్స చేయని మధుమేహం

యాంటీబయాటిక్స్ వాడకం

జననాంగాలపై పెర్ఫ్యూమ్ లను ఉపయోగించడం

చికాకు కలిగించే తడి (లేదా చెమట) బట్టలు ధరించండం

బ్రెస్ట్ ఫీడింగ్

సంభోగం తర్వాత ఈస్ట్ ఇన్ఫెక్షన్ నివారించుకోవడానికి చికిత్స

సంభోగం తర్వాత ఈస్ట్ ఇన్ఫెక్షన్ నివారించుకోవడానికి చికిత్స

ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు అనుమానం వచ్చినట్లైతే, వెంటనే డాక్టరును సంప్రదించాలి.మీకు ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉందో లేదో మీరు సులభంగా అర్థం చేసుకోగలిగినప్పుడు, మైకోనజోల్ లేదా బ్యూటోకానజోల్ వంటి క్రీములతో నయం చేసుకోవచ్చు.

మందులు క్రీములు, మాత్రలు, లేపనాలు

మందులు క్రీములు, మాత్రలు, లేపనాలు

ఈస్ట్ ఇన్ఫెక్షన్ కోసం చాలా తరచుగా సూచించిన మందులు యాంటీ ఫంగల్ మందులు, వీటిని ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోవచ్చు.

మందులు క్రీములు, మాత్రలు, లేపనాలు మరియు సుపోజిటరీల రూపంలో లభిస్తాయి .

గమనిక:

గమనిక:

ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు తీసుకోదల్చుకున్నప్పుడు మందులషాపు వారిని ఎంత మోతాదులో తీసుకోవాలి, సైడ్ ఎఫెక్ట్స్ గురించి అడిగి తెలుసుకోండి.

సెక్స్ తరువాత ఈస్ట్ ఇన్ఫెక్షన్ నివారణ

సెక్స్ తరువాత ఈస్ట్ ఇన్ఫెక్షన్ నివారణ

ఈస్ట్ ఇన్ఫెక్షన్ నివారించడంలో మొదటి ప్రాధన్యత కండోమ్ ద్వారా సంభోగం. ప్రొటెక్టెడ్ సెక్స్ వల్ల ఇన్ఫెక్షన్ అభివృద్ధి చెందకుండా సహాయపడుతుంది.

మరో పద్దతి ఏమిటంటే,

మరో పద్దతి ఏమిటంటే,

మరో పద్దతి ఏమిటంటే, డెంటల్ డామ్, లాటెక్స్ లేదా పాలియురేతేనె షీట్ వంటి ఓరల్ సెక్స్ సమయంలో ఉపయోగించవచ్చు, వీటినే అవుట్ సైడ్ కండోమ్ అని పిలవబడుతున్నాయి.

ఇవి సంభోగ సమయంలో ఇన్ఫెక్షన్ కు కారణం అయ్యే బ్యాక్టీరియా పెరగకుండా తగ్గిస్తుంది.

వజైనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ పెరగకుండా తీసుకోవల్సిన మరికొన్ని జాగ్రత్తలు:

వజైనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ పెరగకుండా తీసుకోవల్సిన మరికొన్ని జాగ్రత్తలు:

కార్బోహైడ్రేట్- మరియు చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించాలి.

కాటన్ లోదుస్తులను ఉపయోగించాలి

పెర్ఫ్యూమ్ సబ్బులు లేదా ఇతర పరిశుభ్రత ఉత్పత్తులను జననాంగాలపై వాడటం మానుకోవాలి.

ఈస్ట్ ఇన్ఫెక్షన్తో పోరాడటానికి సహాయపడే మంచి బ్యాక్టీరియా ఉన్నగ్రీకు పెరుగు ఎక్కువగా తీసుకోవాలి.

డౌచింగ్ మానుకోండి.

English summary

Yeast Infection After Sex: Causes, Treatment & Prevention

Vaginal yeast infection, also called vulvovaginal candidiasis occurs when the healthy yeast that lives in your vagina grows out of control and leads to an infection. It is not a sexually transmitted infection, however, develops after vaginal intercourse
Story first published:Wednesday, August 28, 2019, 22:34 [IST]
Desktop Bottom Promotion