Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
వర్షాకాలంలో జామ పండ్లు, అనేక ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
వర్షాకాలం వచ్చిందంటే.. దాని వెంటే రోగాలు కూడా వస్తాయి. వాతావరణం తేమగా, తడిగా మారడం వల్ల బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ లు వృద్ధి చెందుతాయి. వీటి వల్ల ఇన్ఫెక్షన్లు బాధిస్తాయి. జలుబు, దగ్గు, జ్వరం సహా అనేక ఇతర ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ మధ్యకాలంలో కండ్ల కలక కేసులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి.
అందుకే వర్షాకాలం మొదలైనప్పటి నుంచి రోగనిరోధక శక్తిని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలంటారు వైద్యులు. ఇమ్యూనిటీ పవర్ మెరుగుపరచుకోవడానికి.. కొన్ని రకాల ఆహార పదార్థాలు తినాలని చెబుతుంటారు. రోజుకో ఆపిల్ తింటే వైద్యులకు దూరంగా ఉండొచ్చన్నది పెద్దలు చెప్పే మాట. ఆపిల్ తో పాటు జామ కూడా అదే కోవ కిందకు వస్తుంది. జామ తింటే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అందుకే వర్షాకాలం జామ తినాలని అంటారు.

జామలో ఉండే పోషకాలు
జామకాయల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు ఉంటాయి. అందుకే జామ కాయలు తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అంటారు. 100 గ్రాముల జామకాయలు తింటే 50 గ్రాముల కేలరీలు లభిస్తాయి. ప్రతి రోజూ రెండు జామ కాయల చొప్పున తింటే తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా జామలో ఉండే ఫైబర్ వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
జామలో ఉండే డైటరీ ఫైబర్ డయాబెటిస్ తో బాధపడుతున్న వారికి చాలా సహాయపడుతుంది. మధుమేహంతో బాధపడే వారు ప్రతిరోజూ రెండు జామకాయలు తింటే రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఫైబర్ జీర్ణక్రియ సమస్యలను తగ్గిస్తుంది
జామకాయల్లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల జీర్ణక్రియ సమస్యలు తగ్గుముఖం పడతాయి. మలబద్ధకం కూడా తగ్గుతుంది. రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా సహాయపడుతుంది.
థైరాయిడ్ సమస్యా తగ్గుతుంది
థైరాయిడ్ సాధారణ సమస్యగా మారిన రోజులు ఇవి. చిన్న వారి నుంచి పెద్ద వారి వరకు చాలా మందిని ఈ థైరాయిడ్ సమస్య వేధిస్తోంది. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు జామపండ్లు తినడం వల్ల మంచి లాభాలు ఉంటాయి. దగ్గు, దమ్ము సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ



Click it and Unblock the Notifications