Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
బానపొట్ట, అతి బరువుతో లాఫింగ్ బుద్ధలా కనిపిస్తున్నారా? వేగంగా బరువు తగ్గడానికి ఇలా చేయండి
బరువు తగ్గడం పెరిగినంత ఈజీ కాదు. కొవ్వు కరగడానికి చెమటోడ్చాల్సిందే. బానపొట్ట, అతి బరువు ఉన్న వాళ్లు ఒక్కో గ్రాము బరువు తగ్గడానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అలాగే వ్యాయామం ఒక్కటే చేస్తూ పోతే బరువు తగ్గుతామనుకున్నా అది పొరపాటే. బరువు తగ్గడానికి వ్యాయామం చేయడం ఒక్కటే కాదు.. నోరు కూడా కట్టేసుకోవాలి. అంటే ఇష్టమొచ్చినట్లుగా తింటూ పోతే బరువు తగ్గడం కష్టం.
రోజూ మనం ఎన్ని కేలరీలు తీసుకుంటున్నామో ఆ కేలరీల మొత్తాన్ని తగ్గించాలి. అలాగే అంతే మొత్తంలో వ్యాయామం ద్వారా కరిగించాలి. దాని వల్ల కేలరీ డెఫిసిట్ జరిగి బరువు తగ్గడం మొదలవుతుంది. బరువు తగ్గడంలో ఆహారానిదే కీలక పాత్ర. వేగంగా బరువు తగ్గాలంటే ఆహారాన్ని ఎలా తినాలి, ఎలా తింటే కొవ్వు వేగంగా కరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

నాణ్యమైన, సంపూర్ణమైన ఆహారం:
బరువు తగ్గడానికి ఆహారం కీలకం. తక్కువ కార్బొహైడ్రేట్లు, తక్కువ అసంతృప్త కొవ్వులు ఉండే ఆహారం తీసుకోవాలి. అయితే ఆ ఆహారం నాణ్యంగా, సంపూర్ణంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తాజా కూరగాయలను, పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు. పండ్లు, విత్తనాలు, గింజలు, అవొకాడో, ఆలివ్, బంగాళాదుంపలు, మొక్కజొన్న, కాయధాన్యాలు, బీన్స్ వంటివి ఆహారంలో చేర్చుకోవాలి.
ఇందులో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే నూనెలు,ఇతర పోషకాలు ఉంటాయి. న్యూట్రియెంట్స్ జర్నల్ లో ప్రచురితమైన ఓ నివేదిక ప్రకారం.. తాజా పండ్లు, కూరగాయలు తీసుకున్న మహిళల్లో బరువు తగ్గుదల గణనీయంగా ఉన్నట్లు వెల్లడైంది. ఈ ఆహారాల్లో డైటరీ ఫైబర్ ఎక్కువ ఉండటం, కేలరీలు తక్కువ ఉండటం వల్ల తక్కువ ఆకలి కలుగుతుందని, దీని వల్ల తక్కువ తింటారని వైద్యులు చెబుతున్నారు.
రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి చేపలు, గుడ్లు, పౌల్ట్రీ వంటి లీన్ ప్రోటీన్లను కూడా ఎక్కువగా తినాలి. ఇలాంటి ఆహారాలు సమతుల్యతను అందిస్తాయి. సంతృప్తిగా ఉంచుతాయి. వీటి వల్ల భోజనాల మధ్యలో ఆకలి కాకుండా ఉంటుంది. దీంతో జంక్ ఫుడ్స్, ప్రాసెస్ట్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ కు దూరంగా ఉండొచ్చు.
చక్కెర తీసుకోవడాన్ని తగ్గించాలి:
బరువు తగ్గాలనుకునే వారు చక్కెర పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. చక్కెర వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అర్టిఫీషియల్ స్వీటెనర్లను దూరం పెట్టాలి. సహజ స్వీటెనర్లే ఎంచుకోవాలి. చక్కెర ఆరోగ్యంపై, బరువుపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. యాడెడ్ షుగర్స్ వల్ల శరీరానికి అధిక మొత్తంలో కేలరీలు అందుతాయి. దీని వల్ల పొట్ట కొవ్వు పెరుగుతుంది, బరువు పెరుగుతారు.
కూల్ డ్రింక్స్, స్వీట్లు, జంక్ ఫుడ్స్, చక్కెర వేసిన టీ కాఫీలు అన్నింటికి దూరంగా ఉండాలి. యాడెడ్ షుగర్ అని రాసిన లేబుల్ ఉన్న ఉత్పత్తుల జోలికి వెళ్లొదదు.
తగినంత ఆహారం తీసుకోవాలి:
వేగంగా బరువు తగ్గడానికి పగటి పూట తగినంత ఆహారం తీసుకోవాలి. శరీరానికి పగటి పూట ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. ప్రొడక్టివ్ టైమ్ లో శక్తి లేకపోతే అలసట, నిస్సత్తువ ఆవహిస్తుంది. తగినంత ఆహారం తీసుకోకపోతే కొద్ది సమయానికి నీరసించిపోతారు. అందుకే తగినంత ఆహారం తీసుకోవడం ముఖ్యం. దీని వల్ల రాత్రి తినే ఆహారం మొత్తం కూడా తగ్గుతుంది.
శరీరం పని చేయడానికి శక్తి చాలా అవసరం. శక్తి వచ్చేది ఆహారం నుంచే కాబట్టి తగినన్ని పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి. రాత్రి ఎట్టిపరిస్థితుల్లో ఎక్కువ తినకుండా కంట్రోల్ చేసుకోవాలి. పగటి పూట ఎక్కువ తినేసి, రాత్రి అతి తక్కువగా తినాలి.
ఇంట్లో వండిన ఆహారమే ఉత్తమమైనది:
ఇంట్లో వండిన ఆహారమే ఉత్తమమైనది. అందులో కల్తీ ఉండదు. పరిశుభ్రత పాటిస్తారు. మొత్తం హైజినిక్ పద్ధతిలో వంట వండుకుంటారు కాబట్టి అది ఆరోగ్యానికి ఉత్తమమైనది. బయట వండిన ఆహారంలో ఎలాంటి నూనెలు వాడతారో, ఎలాంటి మసాలాలు వాడతారో మనకు తెలియదు. ఎంతటి పరిశుభ్రత ఉంటుందో కూడా తెలియదు.
ఎంత పెద్ద రెస్టారెంట్ అయినా కూడా ఇంట్లో వండిన ఆహారం ముందు దిగదుడుపే. మెరుగైన, నాణ్యమైన ఆహారం కోసం ఇంట్లో వండిన ఆహారమే తినాలి.
ఏం తింటున్నాం.. ఎంత తింటున్నామో తెలియాలి:
ఆహారాన్ని తినే ముందు దాని గురించి తెలుసుకోవాలి. దీనినే మైండ్‌ఫుల్ ఈటింగ్ అంటారు. ఏం తింటున్నాం.. ఎంత తింటున్నామనేది చూసుకోవాలి. పరధ్యానంగా, ఫోన్ లేదా టీవీ చూస్తూ, ఇతరులతో మాట్లాడుతూ తింటుంటే ఎంత తింటున్నామో తెలియకుండానే బాగా తినేస్తుంటాం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











