Latest Updates
-
అర్ధరాత్రయినా సరే నేనున్నాననే భరోసా.. యువ జంటల మనోభారం దించేస్తున్న ఏఐ చాట్‌బాట్.! -
ఒత్తిడి, ఆందోళనను యోగా ఎలా తగ్గిస్తుంది? -
సన్ స్క్రీన్ రాసుకున్నా చర్మం నల్లబడుతుందా.. మీరు చేసే అతి పెద్ద తప్పులు ఇవే.! -
భర్తలకు హెచ్చరిక..భార్యను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 4 ప్లేస్ లకు తీసుకెళ్లొద్దు! -
చక్కెర లేదు, నూనె లేదు..ఎముకలను ఉక్కులా మార్చే, పిల్లల జ్ఞాపకశక్తి పెంచే ప్రోటీన్ లడ్డూ! -
టెస్టుల అవసరం లేకుండానే మీలో ఫెర్టిలిటీ సమస్య లేదని తెలిపే 5 సంకేతాలు.! -
గుడ్డు కంటే ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే 5 అద్భుతమైన శాకాహారాలు ఇవే! -
హైదరాబాద్ ఫేమస్ షా గౌస్ చికెన్ దమ్ బిర్యానీ.. ఇప్పుడు మీ ఇంట్లోనే! -
భార్యాభర్తల మధ్య ఎమోషనల్ అబ్యూస్.. ఈ సిగ్నల్స్ కనిపిస్తే చాలా డేంజర్.! -
బ్యాంక్ బెంచ్ స్టూడెంట్,4 సార్లు ఫెయిల్ అయినా కూడా.. ఈ మేడం ఎందరికో ఆదర్శం!
ఈ మొక్క తింటే మీకు రోబోలలాంటి సూపర్ పవర్ వస్తాయి.. ఒక్కసారి చూస్తే ఏదీ మర్చిపోరు!
ఆయుర్వేదానికి పుట్టినిల్లు మన భారతదేశం. ఎన్నో గొప్ప గొప్ప శాస్త్రీయ మందులకు సైతం నయం కానీ రోగాలు మన ఆయుర్వేద మందులకు నయమైన ఘటనలు చాలా ఉన్నాయి. ఆయుర్వేదంలో ఎన్నో రకాల మూలికలు, ఆకులు వేర్లు చాలా ఉన్నాయి. అటువంటి వాటిలో ఒకటే బ్రహ్మి. దీనిలో అబ్బురపరిచే నాలుగు అద్భుతమైన గుణాలు ఉన్నాయి. దీని కారణంగా ఈ బ్రహ్మి ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాచుర్యం పొందింది. విదేశీయులంతా దీనికోసం తెగ తహతహలాడుతున్నారు. ఇంతకీ ఈ బ్రహ్మి ఏంటి? దాని వలన కలిగే ప్రయోజనాలు ఏంటి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అసలు బ్రహ్మి ఏంటి?
బ్రహ్మి అంటే ఒక ఆయుర్వేద మూలిక. దీని శాస్త్రీయ నామం బాకోపా మొనీరి. దీనిని విదేశాల్లో బ్రెయిన్ బూస్టర్ అని కూడా పిలుస్తుంటారు. ఇటీవల ఈ బ్రాహ్మిపై జరిగిన పరిశోధనల్లో సంచనల విషయాలు బయటపడ్డాయి. ఇవి జ్ఞాపక శక్తికి, మైండ్ పవర్ పెంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, మెదడు సమస్యలను దూరం చేయడానికి చాలా బాగా పని చేస్తుందట. వేలకు వేలు పెట్టి కొనే మందుల కంటే ఎక్కువగా ఇది ప్రభావవంతంగా పని చేస్తుందని చెప్పడంతో ఇది బాగా ప్రాచుర్యం పొందింది.

ఆ దేశాల్లో ఫుల్ డిమాండ్
ఈ బ్రహ్మితో కలిగే ఉపయోగాల కారణంగా దీనిని పలు దేశాల్లో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అమెరికా, యూరోప్ వంటి దేశాల్లో బ్రహ్మీని సూపర్ ఫుడ్ క్యాటగిరిలో చేర్చారు. అలాగే అక్కడి ప్రజలు దీనిని కొనేందుకు వేలకు వేలు పెట్టడానికి కూడా వెనకాడడం లేదు. బ్రాహ్మిలో ఉండే ఉపయోగాలు తెలుసుకొని దీనికోసం పోటీపడుతున్నారు.
బ్రహ్మితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
బ్రాహ్మిలో బయో యాక్టీవ్ కాంపౌండ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడులోని న్యూరాన్లను ఉత్తేజపరుస్తాయి. అలాగే వాటిని సక్రియం చేస్తుంది. దీని కారణంగా మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అలాగే మైండ్ పవర్ పెరుగుతుంది. జానపక శక్తి ఇంప్రూవ్ అవుతుంది. కొత్త సమాచారం గుర్తుంచుకోవడానికి తగిన సామర్థ్యం వస్తుంది.
అలాగే ఇందులో ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ అనే హార్మోన్‌ను నియంత్రించే సహజసిద్ధమైన లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఈ బ్రహ్మిని తీసుకోవడం వల్ల ఒత్తిడి నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది. అలాగే ఇందులోని అడాప్టోజెనిక్ లక్షణాలు మనిషికి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. ఈ మూలికా విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పరీక్షల్లో రాణించేందుకు బాగా సహాయపడుతుంది. అలాగే అల్జీమర్స్ వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే వృద్దాప్యం కూడా దరిచేరదు. దీనిని నేరుగా పాలలో కలిపి తీసుకోవచ్చు. లేదా పొడి మాదిరిగా, ట్యాబ్లేట్ మాదిరిగా కూడా తీసుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications