For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుండెకు ఆరోగ్యకర ఆహారం- కొన్ని అపోహలు!

By B N Sharma
|

Diet For Healthy Heart- Some Misconcepts
గుండె ఆరోగ్యంగా వుండాలంటే చాక్లెట్లు, కాఫీ, రెడ్ వైన్ లాంటివి ప్రయోజనకరం కాదని తాజాగా ఒక స్టడీ తేల్చింది. కాని టీ మాత్రం గుండె ఆరోగ్యానికి చాలా మంచిదేనట. అయితే టీలో పోసే పాలు మాత్రం వీలైనంత అధికమైన నీరు కలిపి వుండాలని చెపుతోంది.

వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు వుండటంచే గుండె ఆరోగ్యానికి ఉపయోగకర ఆహారమని చెపుతారు. కాని అల్సేషియన్ హార్టు ఫౌండేషన్ చేసిన స్టడీ మాత్రం వీటిని తిన్నందువలన గుండె ఆరోగ్యానికి ఏ మాత్రం ప్రయోజనం లేదని తెలిపింది. వీటిని సంతులిత ఆహారంలో అన్నిటితోపాటు చేర్చవచ్చేకాని ఇవి ఆరోగ్యానికి పనికి వస్తాయని చెప్ప లేమని పరిశోధన తేల్చింది. యాంటీ ఆక్సిడెంట్లు కావాలంటే మొక్కలనుండి లభించే వివిధ రకాల తాజా పండ్లు, కూరలు, కాయలు, గొధుమ, పప్పు ధాన్యాలు, విత్తనాలు మొదలైనవి ప్రతి రోజూ తీసుకోవాలని పరిశోధన తెలుపుతోంది.

గుండె ఆరోగ్యంగా వుండాలంటే రోజుకు రెండు మార్లు తాజా పండ్లు, అయిదు మార్లు తాజా కూరగాయలు తీసుకోవాలని ఈ నిపుణులు తెలిపారు. గుండె సంబంధిత ఆహారాలపై అనేక అపోహలున్నాయని, పరిశోధనా ఫలితాలు డాక్టర్లకు తెలుపుతారని రీసెర్చర్లు వెల్లడించారు.

English summary

Diet For Healthy Heart- Some Misconcepts | గుండెకు ఆరోగ్యకర ఆహారం- కొన్ని అపోహలు!

The researchers reveal that the results of the review would be sent to doctors and other health professionals, as there were several widespread misconceptions about the foods having positive impact on cardiovascular health.
Story first published:Saturday, October 1, 2011, 10:16 [IST]
Desktop Bottom Promotion