నోటి దుర్వాసనతో మాట్లాడాలంటే ఇబ్బంది.. దంతాల ఆరోగ్యాన్ని కాపాడే హోం మేడ్‌ టూత్‌ పేస్ట్‌.!

మన శరీరంలో ముఖ్యంగా నోటి ఆరోగ్యం చాలా ముఖ్యం. అందుకు దంతాలు దృఢంగా, హెల్తీగా ఉండాలి. లేదంటే నోటి దుర్వాసనతో పక్క వాళ్లు ఇబ్బంది పడటం పక్కా. అందుకోసమే మార్కెట్‌లో రకరకాల టూత్‌ పేస్ట్‌లు, బ్రష్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే కొందరికి వాటితో కూడా ఎలాంటి సత్ఫలితాలు కనిపించవు. అలాంటప్పుడు ఇంట్లోనే హెల్తీ టూత్‌ పేస్ట్‌ను తయారుచేసుకోవచ్చు.

Homemade toothpaste eliminates bad breath prepare with these simple ingredients

మన పూర్వీకుల దంతాలు చాలా గట్టిగా, రాళ్లను సైతం నమిలే సామర్థ్యంతో చాలా దృఢంగా ఉండేవి. అందుకు కారణం అప్పట్లో వారు ఉపయోగించే బ్రష్‌లు.. అదే వేప పుల్లలు. దివ్యమైన ఔషధ గుణాలు కలిగిన వేప పుల్లలతో దంతాల ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉండేది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ, బిజీ లైఫ్‌ స్టైల్‌ కారణంగా వేప పుల్లలు కనుమరుగైపోయాయి. వాటి స్థానంలో బ్రష్‌లు, టూత్‌ పేస్ట్‌లు దర్శనమిచ్చాయి. రకరకాల ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నాయి. కానీ చాలావరకు వాటిలో కెమికల్స్‌ కారణంగా పళ్లు అరిగిపోవడం లేదా దుర్వాసన పోకుండా ఉండటం వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అయితే వీటికి పరిష్కారం లేదా అంటే ఉంది.. అదే హోమ్‌ మేడ్‌ టూత్‌ పేస్ట్‌.. ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో సులభంగా ఇలా చేసుకోండి.

ముఖం ఉబ్బిందా? మెడ నల్లబడిందా? ఫ్యాటీ లివర్ కు ఇవే తొలి సంకేతాలు!

ఆరోగ్యకరమైన దంతాలు, చిగుళ్లతో నోటి దుర్వాసనని పోగొట్టుకోవాలంటే మీరు చేయాల్సిన పని ఒక్కటే. మీ డైలీ రొటీన్‌లో కల్తీవి కాకుండా ప్రకృతి సిద్ధమైన పదార్థాలను చేర్చుకోవాలి. దీనికి కొంచెం ఓపిక అవసరమే. అప్పుడే ఇది ఒక అలవాటుగా మారడంతో పాటు మీ దంతాల ఆరోగ్యమూ బాగుంటుంది. ఇక, హోమ్‌ మేడ్‌ టూత్‌పేస్ట్‌ కోసం సిద్ధంగా ఉంచుకోవాల్సిన పదార్థాలివే..

హోమ్‌ మేడ్‌ టూత్‌ పేస్ట్‌ తయారి కోసం కావాల్సిన పదార్థాలు

బెంటోనైట్‌ క్లే- మూడు టీస్పూన్లు
కొబ్బరి నూనె- మూడు టీస్పూన్లు
వేప ఆకు పొడి- అర టీస్పూన్‌
పసుపు- అర టీస్పూన్‌
పుదీనా ఆకు- 5 చుక్కలు

Homemade toothpaste eliminates bad breath prepare with these simple ingredients

వీటితో పాటు మీకు ఇష్టమైతే పావు టీస్పూన్ బేకింగ్‌ సోడా, కొద్దిగా రాతి ఉప్పు, 5 చుక్కల వేప నూనె, 3 చుక్కల టీ ట్రీ ఆయిల్‌, కొద్దిగా లవంగాల పొడి, అర టీస్పూన్‌ బొగ్గు పొడి కూడా ఉపయోగించవచ్చు. ఇవి అందుబాటులో లేకపోతే పైనున్న పదార్థాలతో తయారుచేసుకోవచ్చు.

కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్?కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్?

హోమ్‌ మేడ్‌ టూత్‌పేస్ట్‌ తయారీ విధానం

టూత్‌ పేస్ట్‌ తయారీకోసం గాజు పాత్రను ఉపయోగిస్తే మంచిది. ఒక గాజు గిన్నెలో బెంటోనైట్‌ మట్టి, కొబ్బరి నూనె, వేప ఆకు పొడి, పసుపు, పుదీనా నూనె వేసి బాగా కలపండి. మీకు అందుబాటులో ఉంటే పైన చెప్పిన పదార్థాలను కూడా చేర్చుకోవచ్చు. వీటన్నిటినీ బాగా కలిపి గాలి దూరని చిన్న గాజు డబ్బాలో స్టోర్‌ చేసుకోండి. కొన్ని రోజుల వరకు ఇది మీకు ఉపయోగపడుతుంది. ఈ టూత్‌పేస్ట్‌ను నాణ్యమైన బ్రష్‌తో చేసుకుంటే కొన్ని వారాల్లోనే మీరు మెరుగైన ఫలితాలను చూస్తారు. అయితే మీకు ఏమైనా ఇతర దంత సమస్యలు ఉంటే ఉపయోగించే ముందు దంత వైద్య నిపుణుల సలహా తప్పనిసరి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Wednesday, September 16, 2026, 12:33 [IST]
Desktop Bottom Promotion