Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
అర్ధరాత్రిళ్లు అకస్మాత్తుగా మేల్కొంటున్నారా.. అయితే ఇదే కారణం కావొచ్చు, జాగ్రత్త సుమీ!
నిద్ర మనిషికి చాలా అవసరం. సరిగ్గా ఆహారం లేకపోయినా పర్లేదేమో కానీ నిద్ర లేకపోతే మాత్రం మనిషి విపరీతంగా అలసిపోతాడు. లేనిపోని రోగాలన్నీ వచ్చి చేరుతాయి. సరిగ్గా వారం రోజుల పాటు క్షణం కూడూ కుణుకు తీయకుండా ఉంటే కచ్చితంగా ఆ మనిషి చనిపోతాడని గతంలోనే ఆరోగ్య నిపుణులు వివరించారు.
ప్రతిరోజూ 7 నుంచి 8 గంటలకు పాటు నిద్రపోతే మనిషి ఆరోగ్యంగా ఉంటాడని.. సూచిస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో చాలా మందికి నిద్ర కరవైంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

చాలా మందికి రాత్రిళ్లు తరచుగా మెల్కువ రావడం, ఒంటి గంట దాటుతున్న నిద్ర పట్టకపోవడం జరుగుతుంటుంది. మరికందరు అర్ధరాత్రిళ్లు అకస్మాత్తుగా మేల్కోవడం, భయంగా దిక్కులు చూసి టెన్షన్ తో పడుకోవడం కూడా చాలా సార్లే చూస్తుంటాం. అయితే అసలు ఇలా ఎందుకు జరుగుతుంది, మెల్కువ వచ్చిన తర్వాత మళ్లీ నిద్ర పట్టడానికి ఎక్కువ సమయం ఎందుకు పడుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. పిండి పదార్థాలు:
రాత్రి పడుకునే ముందు పిండి పదార్థాలు తినడం వల్ల ఎక్కువగా ఇలా జరుగుతుంటుంది. ముఖ్యంగా బియ్యం, చిప్స్, బంగాళాదుంపలు, అరటి పండ్లు, పాస్తా వంటి ఆహారాల్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ కార్బోహైడ్రేట్లు మనకు నిద్రకు లేకుండా చేస్తాయి. వీటిని ఎక్కువగా తింటే రాత్రిళ్లు తరచుగా మెల్కువ వస్తుంది.
2. టీ, కాఫీలు:
మన దేశంలో టీ, కాఫీలు తాగేవారికి కొదవ లేదు. రోజుకు ఐదారు సార్లు కూడా వీటిని తాగే వారు ఉన్నారు. కానీ ఇవి మన ఆరోగ్యానికి అసలు మంచివి కావు. ముఖ్యంగా వీటిని తాగితే నిద్రకు భంగం కల్గుతుంది. టీ, కాఫీల్లో ఉండే కెఫిన్ కంటెంట్ వల్ల నిద్ర రాదు. ముఖ్యంగా నిద్ర రాకుండా ఉండేందుకు, కాస్త ఉత్సాహంగా ఉండేందుకే టీ, కాఫీలను తాగుతుంటారు చాలా మంది. కానీ నిద్రపోయే రెండు, మూడు గంటల ముందు.. అంటే సాయంత్రం ఆరు గంటల తర్వాత టీ, కాఫీలను తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ తాగితే రాత్రిళ్లు నిద్ర సరిగ్గా పట్టదు. మధ్య మధ్యలో ఎక్కువ సార్లు మెల్కువ వచ్చే అవకాశం ఉంటుంది.
3. ఒత్తిళ్లు:
ఉరుకులు, పరుగుల జీవితంలో చాలా మంది ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోలేనంత బిజీగా ఉంటున్నారు. ఈ గజిబిజి జీవితాల మధ్య ఒత్తిడి సర్వ సాధారణంగా మారింది. కానీ ఈ ఒత్తిడి చాలా మందిలో మానసిక, శారీరక సమస్యల బారిన పడేస్తాయి. తీవ్ర ఒత్తిడి డిప్రెషన్ కు కూడా దారి తీస్తుంది. మానసిక ఆరోగ్యంపై విపరీతమైన ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. నిద్ర రుగ్మతకు ఇదే ప్రధాన కారమం అని నిపుణులు వివరిస్తున్నారు.
4. ఫోన్లు ఎక్కువగా వాడడం:
ఈ మధ్య చాలా మంది ఫోన్ ను ఎక్కువగా వాడేస్తున్నారు. తినేటప్పుడు, పడుకునే టప్పుడు, ఆఖరకు బాత్రూం వెళ్లేటప్పుడు కూడా ఫోన్ ను వదలట్లేదు. రీల్స్, వీడియోలు చూస్తూ.. అర్ధరాత్రి దాటుతున్నా నిద్ర పోకుండా అలాగే మెల్కుంటున్నారు. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
5. మెడిసిన్ వాడడం:
ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, థైరాయిడ్, క్యాన్సర్ లాంటి సమస్యలకు మందులు వాడుతున్న వారు కూడా సరైన నిద్రను పొందలేరు. వాటిలో ఉండే రసాయనాలు నిద్రలేమికి దారి తీస్తాయి. అలాగే జలుబు, పెయిన్ కిల్లర్స్ లాంటి మందులను వాడడం వల్ల నిద్ర అనేది సరిగ్గా పట్టదు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications