Latest Updates
-
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా!
గాఢ నిద్ర తర్వాత ఫ్రెష్ గా నిద్ర లేవడం ఎలా...?
నిద్రలేని రాత్రులు అధికమయ్యాయా? మంచి నిద్రపోయి చాలా రోజులయిందా? గాఢ నిద్ర పడితే...మరుసటి రోజు ఎంతో ఫ్రెష్. గాఢ నిద్ర రోజూ పడితే...అనారోగ్యం దగ్గరకే రాదు. రాత్రి నిద్ర సరిగా లేకపోతే, అనారోగ్య జీవన విధానాలు మీ ఆరోగ్యాన్ని పాడు చేసి ఇక ఆ రోజంతా బద్ధకంగా కూర్చునేలా చేస్తాయి. ఏ పనీ చేయబుద్ధి కాదు. మరి రాత్రి వేళ గాఢంగా నిద్రించాలంటే ఏం చేయాలి? ప్రత్యేకంగా చెప్పాలంటే, మన ప్రవర్తనా తీరు, వాతావరణ ప్రభావం మొదలైనవి మన నిద్రను ప్రభావిస్తాయి. మేము ఇచ్చే సూచనలు పాటిస్తే మీకు కంటినిండా నిద్ర, చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. పరిశీలించండి.
చాలా ఏళ్ళు కుస్తీ పట్టాక, ఎటువంటి మందుల అవసరం లేకుండా రాత్రిళ్ళు సుఖంగా నిద్రపోయి ఉదయాన్నే హాయిగా మేల్కోవడానికి సులభమైన మార్గాలు ఎట్టకేలకు కనుక్కున్నాను. త్వరగా నిద్ర పట్టి, అది గాఢ నిద్రగా మారి రేపటికి పునరుత్తేజితుడిని చేసే చిట్కాలు, నాకు పనిచేసినవి, ఈ క్రింద సూచిస్తున్నాను.
సూచనలు :

ఒక నిత్యనియమావళి కలిగి వుండండి. మీరు ఆలస్యంగా పడుకుని, ఆలస్యంగా లేచినా, త్వరగా పడుకుని త్వరగా లేవగలిగినా, మీ దైనందిన కార్యకలాపాలకు అనుకూలించే ఏదో ఒక నియమిత విధానానికి కట్టుబడి వుండడం వల్ల మీరు మరింత హాయిగా నిద్రపోగలుగుతారు.

ఉదయాన్నే లేచి వ్యాయామం చేయండి. కేవలం 20-30 నిమిషాల నడక, పరుగు, సైక్లింగ్ లేదా బరువులు ఎత్తడం వల్ల రోజంతా ఉత్సాహంగా వుంటారు, రాత్రికి అలిసిపోతారు.

నిద్ర పోయే ముందు ఒక 20-30 నిమిషాల పాటు ఆటవిడుపు వుండే సరదా పనులు చేయండి. వేడి నీళ్ళ స్నానం లేదా శృంగారం మీకు నిద్ర పట్టడానికి బాగా ఉపకరిస్తాయి.

పగటి నిద్ర లేదా కునుకులు మానివేయండి. అవి మీకు ఉత్సాహాన్ని కలిగించకపోగా మీ రాత్రి వేళ నిద్రని కూడా చెడగొడతాయి.

ఒక మంచి పరుపు, దిండు కొనండి. నేను ఈ మధ్యనే ఈ మార్పు చేసి చూసాను, ఇంతకు ముందే ఈ పని ఎందుకు చేయలేకపోయానో అర్ధం కాలేదు. జీవితంలో మూడో భాగం పరుపు మీదే గడుపుతాం, కాబట్టి నిద్రపోవడానికి ఉపయోగించే వాటి దగ్గర రాజీ పడకండి.

శబ్దాలు లేకుండా ఉండేందుకు ఒక ఫాన్ ని, వెలుతురు పడకుండా బ్లైండ్స్ ని ఉపయోగించండి. మధ్య రాత్రి వేళ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు ఇది సులభమైన, ప్రయోజనకరమైన చిట్కా.

ఎక్కువ కార్బోహైడ్రేట్లు లేనిది ఏదైనా తినండి. దీని వల్ల అద్భుతాలు జరుగుతాయి - నాకైతే చిన్న బౌల్ లో పాలు, ధాన్యాలు పని చేసాయి. కొవ్వు పదార్ధాలు, మాంసకృత్తులు ఉండేవి తినకుండా వుండండి.



Click it and Unblock the Notifications
