Latest Updates
-
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026 -
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి!
వర్షకాలంలో వివిధ ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే బెస్ట్ ఫ్రూట్స్
వర్షాకాలం అంటే కొంత విశ్రాంతి తీసుకొనే సమయం అంతే కాదు, కొంత సమయం ఇంట్లో కూర్చొని వేడి వేడిగా క్రిస్పీగా చిరుతిండ్లు తినే బెస్ట్ సమయం ఇది. ముఖ్యంగా ఈ సీజన్ లో చాలా మంది లేజీగా ఫీలవుతుంటారు. మిమ్మల్ని మీరు రిలాక్స్ గా ఉంచుకోవడానికి హెల్తీగా ఉండటానికి ఒక ఫ్రూట్ బాస్కెట్ ను రెడీగా ఉంచుకోండి.
సహజంగా ఈ సీజన్ లో ఎక్కువగా అలర్జీలకు, ఇన్ఫెక్షన్లకు మరియు అజీర్ణ సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల, ఇటువంటి చిన్న చిన్న జబ్బుల బారీ నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి మన శరీరానికి కావల్సినంత శక్తి సామర్థ్యాలను కలిగి ఉండాలి. వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇంకా వాతావరణంలోని హ్యుమిడిటి వల్ల మన జీర్ణక్రియను నిధానం చేస్తుంది.
ఈ కారణాలన్నింటివల్ల మీరు సరైన ఆహారంను తీసుకోవడం ఖచ్చితంగా అవసరం. ఆయిల్ ఫుడ్స్, స్ట్రీట్ ఫుడ్స్ మరికొన్ని ఫ్రైడ్ ఫుడ్స్ ఇవన్నీ మీ పొట్టను అసౌకర్యానికి గురిచేస్తాయి కాబట్టి, వీటికి దూరంగా ఉండాలని గుర్తించుకోవాలి. వర్షాకాలంలో మీ ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాధకరమై వ్యాధులను నివారించడానికి కొన్ని పండ్లు గ్రేట్ గా సహాయపడుతాయి. కాబట్టి, ఈ వర్షాకాలంలో మీరు తీసుకోవల్సిన కొన్ని రకాల పండ్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

జామూన్ (బ్లూ బెర్రీస్):
నేరుడుపండ్లు వర్షకాలంలో మనకు అందుబాటులో ఉంటాయి . వీటిని తీసుకోవడం వల్ల వీటిలో క్యాలరీలు తక్కువగా మరియు ఎక్కువ న్యూట్రీషియన్స్ ఐరన్, ఫొల్లేట్, పొటాషియం, మరియు విటమిన్స్ వంటి పోషకాలు అధికంగా ఉండి వర్షకాలంలో వచ్చే చిన్నచిన్న జబ్బులను ఎదుర్కోవడానికి సహాయపడుతాయి.

లిచి:
వర్షాకాలంలో మనకు అందుబాటులో ఉండేది మరియు మనం ఖచ్చితంగా తినాల్సింది ఈ లిచి ఫ్రూట్. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో శక్తి సామర్థ్యాలు పెంచడానికి మరియు వ్యాధినిరోధకతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది . మరియు ఇది మన శరీరానికి కావల్సిన యాంటీఆక్సిడెంట్స్ ను అంధించి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ప్లమ్స్:
ఇవి మన శరీరంలో వ్యాధి నిరోధకశక్తిని పెంచడానికి సహాయపడుతుంది. మరయిు ఫ్లూ మరియు కోల్డ్ వంటి ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని కాపుటకు ఇది గొప్పగా సహాయపడుతుంది.

చెర్రీస్ :
చెర్రీస్ మరో మాన్ సూన్ ఫ్రూట్. వర్షాకాలంలో వీటిని మనం ఎక్కువగా చూడవచ్చు. ఇవి కూడా ఇన్ఫెక్షన్స్ ను నివారించడానికి సహాయపడుతాయిజ వీటిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మొదడకు ప్రశాంతపరచడానికి మరియు విశ్రాంతి పొందడానికి సహాయపడుతాయి.

పీచ్:
వర్షకాలంలో తినాల్సిన పండ్లలో ఇది ఒక బెస్ట్ ఫ్రూట్. ఈ పండ్లలో క్యాలరీలు తక్కువ, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది . ఇది బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంకా ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది వ్యాధినిరోధకతను పెంచుతుంది.

దానిమ్మ:
వర్షకాలంలో మనకు విరివిగా దొరికే పండ్లలో దానిమ్మ కూడా ఒకటి. ఇది మనలో వ్యాధినిరోధకతను పెంచడానికి సహాయపడుతుంది . ఈ దానిమ్మ విత్తనాల్లో అనేక న్యూట్రీషియన్స్ ఉంటాయి.

ఆపిల్స్:
రోజుకొక్క ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదంటారు. అదే విధంగా ఈ ఆపిల్స్ వర్షాకాలంలో కూడా డాక్టర్ల అవసరం లేకుండా చేస్తాయి.
వివిధ రకాల వర్షకాల జబ్బుల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతాయి.

అరటిపండ్లు:
అరటిపండ్లలో విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. వర్షాకాలంలో తినాల్సిన పండ్లలో ఇది మరొక పండ్. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే వర్షాకాలంలో వీటిని మితంగా తీసుకోవల్సి ఉంటుంది.

బేరిపండ్లు:
వర్షాకాలంలో, అనేక ఇన్ఫెక్షన్లతో పోరడటానికి మనకు అనేక విటమిన్స్ అవసరం అవుతాయి . అన్ని విటమిన్స్ ఈ బేరిపండ్లలో పుష్కలంగా ఉంటాయి . ఈ సీజన్ లో వాతావరణంలో హ్యుముడిటి అధికంగా ఉండటం వల్ల త్వరగా జబ్బపడటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల వర్షాకాలంలో తినాల్సిన ఆహారాల్లో బేరిపండ్లు కూడా ఒకటి.

బొప్పాయి:
బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది వ్యాధినిరోధకతను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అంతే కాదు, ఇందులో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ అనేక జబ్బులను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications