Latest Updates
-
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.! -
సాయంత్రం వేళ ఇంట్లో ఎన్ని దీపాలు వెలిగించాలి?అష్టైశ్వర్యాలు తెచ్చే అద్భుతమైన మార్గం.. -
చేతి గోళ్లు ఇలా ఉంటే కిడ్నీల ఆరోగ్యానికి వార్నింగ్.. మీకూ ఇలా ఉందా.? -
ఈ పద్ధతిలో అల్లం చట్నీ చేస్తే.. ఎవరైనా సరే నాలుగు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి సొరకాయ దోశ..అప్పటికప్పుడు ఈజీగా చేసుకోండిలా.. -
మంచి భర్త కోసం ఉపవాసం చేస్తున్నారా.. కానీ శివారాధనలో అమ్మాయిలు చేసే పొరపాట్లు ఇవే.!
ఆరోగ్యానికి అవసరమయ్యే గొప్పగుణాలున్ననెయ్యి
నెయ్యి - Ghee: పాల నుండి లభించే ఒక నూనె లాంటి కొవ్వు పదార్థం. దీనిని వంటలలో, పూజ కార్యక్రమాలలో, కొన్ని ఆహార పదార్థాలులో ఎక్కువగా వాడుతారు. వెన్న (Butter) ను మరిగించడం ద్వారా నెయ్యిని తయారు చేస్తారు. చాలామందికి నేతిచుక్క కలవనిదే ముద్ద గొంతు దిగాడు . నెయ్యి శరీరానికి ఎన్నో పోషకాల్ని అందిస్తుంది. నెయ్యిని వంటకాలు తయారీలోగాని , నేరుగాగాని వాడవచ్చును.
నెయ్యి ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక వరం. కానీ విదేశీయులు దీన్ని యానిమల్ ఫ్యాట్ అంటూ చాలా చిన్న చూపు చూస్తారు. ఫ్యాట్ అంటే కొవ్వు. మేధో ధాతువు. ఇది చర్మం అడుగున వుండే పొర. శరీరంలో అదనంగా వుండే కేలరీలను నిల్వ చేసుకునే బాధ్యత కొవ్వుది. అంటే కొవ్వు అనేది కేలరీల బ్యాంకు లాంటిది. కానీ పాలలో ఉండే నేతి పదార్థం కేలరీలను అందించే ఉత్పత్తి కేంద్రం లాంటిది. రెంటికీ తేడా వుంటుంది. జంతు సంబంధమైన కొవ్వు పదార్థాల్లో ఆవు నెయ్యి ఉత్తమమైంది.
నెయ్యిలో ఔషధగుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నెయ్యి శీతల గుణం కలదే గాక కొంత తీపి రుచి కలిగి ఉంటుంది. నెయ్యి ఆరోగ్యాన్ని కలిగిస్తే ఆయుష్షుని కూడా పేంచే గుణం నెయ్యికి ఉంది. బలవర్థకమేకాక మేధస్సును తేజోవంతం చేస్తుంది ఇది కఫయుక్త రుగ్మతలకు ఉపయోగకరమైంది. సౌందర్యాన్ని ఇనుమడించచేయడమే కాకుండా తేజస్సును, ఉత్సాహాన్ని, కాంతిని అధికం చేస్తుంది. నేత్రాలకు హితకరం, వాతపిత్తాలకు నెయ్యి ఉపశమింప చేస్తుంది. పిచ్చి (ఉన్నాదం) శూల( నొప్పి) కడుపుబ్బరం, కడుపెలో తిప్పట, దేవడం, సాధారణ జ్వరము, లాంటి రుగ్మతలను ఉపశమనం కలిగిస్తుంది. క్షయ, రక్త ధోషాలను నివారిస్తుంది. ఇన్ని సుగుణాలున్న నెయ్యిలో మరిన్ని ఆరోగ్యప్రయోజనాలను తెలుసుకుందాం..

జీర్ణక్రియ:
నెయ్యి యొక్క ఒక ఉత్తమ హెల్త్ బెనిఫిట్ ఇది, డైజెస్టివ్ సిస్టమ్ ను క్రమబద్దం చేస్తుంది. జీర్ణక్రియ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి నెయ్యి బెస్ట్ గా ఉపయోగపడుతుంది. కాబట్టి, నూనెకు బదులుగా నెయ్యిని ఉపయోగించండి.

విటమినులు పుష్కలంగా ఉన్నాయి:
నెయ్యిలో అనేక విటమినులు పుష్కలంగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా విటమిన్ ఎ, డి, ఇ మరియు కె వంటి స్పెషల్ విటమిన్స్ కలిగి ఉన్నాయి. కాబట్టి, మీ భోజనంలో కొంత నెయ్యిని జోడించండి. దాంతో మీకు రోజుకు అవసరం అయ్యే విటమిన్లు మీ శరీరానికి అందుతాయి.

వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.
నెయ్యి యొక్క మరో ప్రధాన హెల్త్ బెనిఫిట్ ఇది మీలో వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. అలాగే పెరిగే పిల్లలకు ఇది బాగా దోహదపడుతుంది. వారి పెరుగుదలకు వేగవంతం చేస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచతుంది. దాంతో వారు జబ్బు బారిన పడకుండా ఉంటారు.

గుండెకు:
నెయ్యిలో యాంటీఆక్సిడెంట్స్, మరియు లినోలిక్ యాసిడ్స్ మరియు అధికంగా కరిగించే విటమిన్స్ ఇందులో పుష్కలంగా ఉండటం వల్ల మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఇది సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్:
నెయ్యిలోని మరో ఆశ్చర్యకరమైన హెల్త్ బెనిఫిట్, ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ తో పోరాడి మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను శరీరంలో తగ్గించడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఇది శరీరంలో జీవక్రియలను సక్రమంగా పనిచేయడానికి సహాయపడే లిపిడ్స్ ను కంట్రిబ్యూట్ చేస్తుంది. దాంతో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.

కండరాలు:
సాధారణ వ్యక్తులు, ఎవరైనా సరే, వారి రెగ్యులర్ డైట్ లో నెయ్యిని చేర్చుకోవడం వల్ల కండరాలు మరియు జాయింట్స్ యొక్క సరళంగా ఉండేందుకు సహాయపడుతుంది. అలాగే జాయింట్స్ మరియు వయస్సు అయినా వారిలో కీళ్ళ నొప్పుల వంటి వాటిని దూరంగా ఉంచతుంది. నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ల్యాక్టోస్ ఇన్ టాలరెస్ :
చాలా మందికి ల్యాక్టోజ్ సరిపడదు. అటువంటి డైరీ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉంటారు. అటువంటి వారి వారి శరీరానికి ల్యాక్టోజ్ అందించాలంటే, నెయ్యిని వారి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది. ఇది ల్యాక్టోజ్ ఇన్ టాలరెన్స్ వారికి సురక్షితం.

చెస్ట్ బర్న్:
గుండెలో మంట. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతుంటారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు.కాబట్టి, మీ భోజనంలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని జోడించడం వల్ల ఈ నొప్పి, మంట నుండి ఉపశమనం పొందవచ్చు.



Click it and Unblock the Notifications