Latest Updates
-
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా! -
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి -
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా..
మహిళల ఆరోగ్యానికి ఇవి చాలా అవసరం
మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా జీవించడానికి కావలసింది సమతులాహారం. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామాలు చేయాలనీ, పౌష్టికాహారం తీసుకోవాలనీ చెడు అలవాట్లు మానుకోవాలనీ అందరూ అంటూంటారు. చాలామంది నుంచి ఎప్పుడూ వినే మాటలే ఇవి. అయితే నిజమైన ఆరోగ్యం మన నిత్య జీవనంపై ఆధారపడి ఉందన్న సంగతిని చాలామంది విస్మరిస్తున్నారు.
స్త్రీ, పురుషుడు అని తేడా లేకుండా ప్రతి స్టేజిలో న్యూట్రిషన్ ఫుడ్ అవసరమవుతుంది. కానీ ఇంటిపనులను చూసుకొంటూ, పిల్లలను స్కూలుకు పంపడం, భర్తకు అన్నీ పనులు చేయడం, ప్రతీ రోజూ చేస్తూ అలసి పోయే స్త్రీలకుతమ శరీరాన్ని ఫిట్ గా, హెల్తీగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నేటి మహిళల్లో ఆరోగ్యపరమైన సమస్యలెన్నో తలెత్తుతున్నాయి. అయితే వాటిని ఎలా అధిగమించాలో తెలియక అనారోగ్యాల పాలు అవుతున్నారనటం నిజం. కాని మహిళల్లో వచ్చే చాలా సమస్యలకు చెక్ పెట్టాలంటే కొన్ని పాటిస్తే చాలు అంటున్నారు న్యూట్రీషియన్లు. కాబట్టి మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహారం గురించి తెలుసుకుందాం...

కెరొటినాయిడ్స్
పసుపు, ఎరుపు రంగులో ఉండే పండ్లు, కూరగాయల్లో కెరొటినాయిడ్లు పుష్కలంగా లభిస్తాయి. ప్రతి ఒక్కరూ పదార్థాలను ప్రతిరోజూ తప్పనిసరిగా తీసుకోవాలి. మహిళలు వీటిని తీసుకుంటే రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ అవకాశాలు తగ్గుతాయి.

కాలిఫ్లవర్
స్త్రీలకు అతి ముఖ్యమైన విటమిన్ B కాలీప్లవర్ ద్వారా పుష్కలంగా లభిస్తుంది. గర్బిణీ స్త్రీలయితే ఖచ్చితంగా కాలిఫ్లవర్ తీస్కోగలిగితే వాళ్లకు డెలివరీ టైమ్ లో కావలసిన శక్తి లభిస్తుంది. అంతే కాకుండా కాలిఫ్లవర్ లో విటమిన్ C - కాల్షియమ్ కూడా లభిస్తాయి. ఇందులో ఫ్యాట్ కంటెంట్ 0. కాలిఫ్లవర్ ను ప్రతి రోజూ తీసుకోవాలి.

క్యారెట్స్
Aవిటమిన్ పుష్కలంగా ఉండే క్యారెట్ చర్మ సౌందర్యానికి చాలా ఉపయోగపడుతుంది. అంతే కాదు బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడే స్త్రీలు క్యారెట్ ను ఎక్కువగా తీసుకొంటే మంచిది

బీన్స్
బీన్స్ ను తీస్కోవడం ద్వారా గుండె పని తీరు బాగుంటుంది. అంతే కాకుండా ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది.

పాలు
కాల్షియంకి మారుపేరు పాలు. పాలలో విటిమిన్ డి కూడా ఎక్కువగానే ఉంటుంది. మహిళల్లో సర్వసాధారణంగా కనిపించే ఆస్టియో ఆర్థరైటిస్ అవకాశాన్ని తగ్గించడంలో పాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. పిఎంఎస్ సమస్య కూడా తగ్గుతుంది.

ఓట్స్
బిపి నుంచి మధుమేహం దాకా మంచి మందులా పనిచేసే ఓట్స్ గర్భిణి స్త్రీలకు మరింత మేలు చేస్తాయి. గర్భిణులు వీటిని తీసుకోవడం వల్ల పుట్టే శిశువుకు జన్యులోపాలు కలిగే అవకాశం చాలా తక్కువ.

అవిసె గింజలు
ఈ గింజలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ను కలిగి ఉండి గుండెకు బలాన్ని చేకూరుస్తాయి. ఇందులో పీచు పదార్థము కూడా లభిస్తుంది. ఈ గింజలను ప్రతి రోజు ఉదయం పూట తీస్కుంటే ఇక అలసట అనేది కనపడదు.

చేపలు
వీటిలోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు డిప్రెషన్ నుంచి గుండెజబ్బుల దాకా అన్నింటినీ నివారించగలవు. మహిళల్లో హార్మోన్ల ప్రభావం వల్ల మూడ్ స్వింగ్స్ ఎక్కువ. కాబట్టి ఇవి వాళ్లకి మంచి మందు.

టొమాటో
వీటిలోని లైకోపీన్ రొమ్ముక్యాన్సర్‌ను నివారిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది. గుండెజబ్బుల రిస్కూ తగ్గుతుంది.

తోటకూర
దీనిలో విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. దీనిలోని మెగ్నీషియం ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ (పిఎంఎస్) సమస్యను తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications
